SportsM Manohareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/new-zealand-vs-afghanistan254e9533-5989-47bf-95be-ba86564fb819-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/new-zealand-vs-afghanistan254e9533-5989-47bf-95be-ba86564fb819-415x250-IndiaHerald.jpgఐసిసి టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చాలా కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ రెండు జట్లు గ్రూప్ ఏ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే గ్రూప్ ఏ నుండి ఇప్పటివరకు ఒక్క పాకిస్తాన్ మాత్రమే సెమీస్ కు చేరుకోగా మిగతా ఒక్క స్థానం కోసం ఈ రెండు జట్లతో పాటు ఇండియా కూడా పోరాడుతుంది. అయితే ఈ కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు న్యూజిలాండ్ బౌలర్లు షాకిచ్చారు. జట్టు ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ 4 బంతుల్లో 2 పరుగులు చేసి ఔట్ కాగా... మరో ఓపెనర్ మహ్మద్ షాnew zealand vs afghanistan{#}Pakistan;ICC T20;New Zealand;James Cameron;Indiaకివీస్ ముందు చిన్న లక్ష్యం.. ఇండియాకు కష్టమే...!?కివీస్ ముందు చిన్న లక్ష్యం.. ఇండియాకు కష్టమే...!?new zealand vs afghanistan{#}Pakistan;ICC T20;New Zealand;James Cameron;IndiaSun, 07 Nov 2021 17:24:07 GMTఐసిసి టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు న్యూజిలాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య చాలా కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ రెండు జట్లు గ్రూప్ ఏ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే గ్రూప్ ఏ నుండి ఇప్పటివరకు ఒక్క పాకిస్తాన్ మాత్రమే సెమీస్ కు చేరుకోగా మిగతా ఒక్క స్థానం కోసం ఈ రెండు జట్లతో పాటు ఇండియా కూడా పోరాడుతుంది. అయితే ఈ కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు న్యూజిలాండ్ బౌలర్లు షాకిచ్చారు. జట్టు ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ 4 బంతుల్లో 2 పరుగులు చేసి ఔట్ కాగా... మరో ఓపెనర్ మహ్మద్ షాజాద్ 11 బంతుల్లో 4 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఆ వెంటనే రహ్మానుల్లా గుర్బాజ్ 9 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరుకుంటే... 18 బంతుల్లో 15 పరుగులు చేసి గుల్బాదిన్ నైబ్ ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆటగాడు నజీబుల్లా జద్రాన్ ఒంటి చేత్తో ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఒక్కడే 48 బంతుల్లో 73 పరుగులతో స్కోర్ బోర్డు నడిపించాడు. ఇక కెప్టెన్ మొహమ్మద్ నబీ 20 బంతుల్లో 14 పరుగులు చేయగా... కరీం జనత్ 2 బంతుల్లో 2 పరుగులు చేశాడు. అలాగే చివర్ లో రషీద్ ఖాన్ 7 బంతుల్లో 3 పరుగులు చేసి నిరాశపరచడంతో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 124 పరుగులు చేసి 8 వికెట్లను చేజార్చుకుంది.

ఇక కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీయగా సౌటిమ్ సౌతీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక జేమ్స్ నీషమ్, ఆడమ్ మిల్నే, ఇష్ సోధి ఒక్కో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో కివీస్ విజయం సాధించాలంటే న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 125 పరుగులు చేయాలి. ఈ లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో.. వారికీ ఈ లక్ష్య ఛేదన కొంత కష్టమే అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోతేనే భారత్ కు అవకాశాలు ఉంటాయనేది తెలిసిందే. కాబట్టి భారత ఆశలను ఆఫ్ఘన్ బౌలర్లు నిలబెడతారా.. లేదా చూడాలి.



కుప్పంలో వివాదంగా మారిన టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌..!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M Manohar]]>