PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telugudeshamparty-candidate-kidnapped-in-controversyfb3316f8-a72f-44d1-af53-c3cab425fe23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telugudeshamparty-candidate-kidnapped-in-controversyfb3316f8-a72f-44d1-af53-c3cab425fe23-415x250-IndiaHerald.jpgకుప్పం 14వ వార్డులో టీడీపీ తరఫున నామినేషన్ దాఖ‌లు చేసిన ప్ర‌కాశ్‌ను మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్ లు కిడ్నాప్ చేశార‌ని పోలీసులకు బంధువుల ఫిర్యాదు చేశారు. అదేవిధంగా టీడీపీ నుండి 14వ వార్డుకు నామినేష‌న్ వేసేందుకు వెళ్లిన మాజీ స‌ర్పంచ్‌, ఎంపీపీ వెంక‌టేష్‌ను అడ్డుకుని నామినేష‌న్ ప‌త్రాల‌ను వైసీపీ శ్రేణులు చించేశార‌ని మ‌రోసారి వెంక‌టేష్ నామినేష‌న్ దాఖ‌లు చేసారు. అయితే హై డ్రామా మ‌ధ్య ఎన్నిక‌ల అధికారులు స్క్రూట్నిలో తొలుత వెంక‌టేష్ నామినేష‌న్ ను ఒకే చేసిన త‌రువాత రాత్రిక#టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌{#}kuppam;Minister;TDP;YCP;CBNకుప్పంలో వివాదంగా మారిన టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌..!కుప్పంలో వివాదంగా మారిన టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌..!#టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌{#}kuppam;Minister;TDP;YCP;CBNSun, 07 Nov 2021 17:29:59 GMT కుప్పం మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి  రాజకీయ పరిణామాలు గంట‌కు ఒక మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేత‌లు ఒక‌రిపై మ‌రొక‌రు స‌వాల్‌లు, ప్ర‌తిస‌వాల్‌లు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండ‌గానే తాజాగా కుప్పం 14వ వార్డుకు నామినేష‌న్ వేసిన టీడీపీ రెండవ కౌన్సిల‌ర్ అభ్య‌ర్థి ప్ర‌కాశ్‌తో పాటు ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు కూడ అదృశ్యం అయ్యారు. ఈ వార్డుకు వెంక‌టేష్ అనే వ్య‌క్తి మొద‌టి అభ్య‌ర్థిగా టీడీపీ త‌రుపున నామినేష‌న్ వేశారు. కానీ స్క్రూట్నిలో వెంక‌టేష్ నామినేష‌న్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో తొల‌గించారు ఎన్నిక‌ల అధికారులు.  

కుప్పం  14వ వార్డులో టీడీపీ తరఫున నామినేషన్ దాఖ‌లు చేసిన ప్ర‌కాశ్‌ను మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్ లు  కిడ్నాప్ చేశార‌ని  పోలీసులకు బంధువుల ఫిర్యాదు చేశారు. అదేవిధంగా టీడీపీ నుండి 14వ వార్డుకు నామినేష‌న్ వేసేందుకు వెళ్లిన మాజీ స‌ర్పంచ్‌, ఎంపీపీ వెంక‌టేష్‌ను అడ్డుకుని నామినేష‌న్ ప‌త్రాల‌ను వైసీపీ శ్రేణులు చించేశార‌ని మ‌రోసారి వెంక‌టేష్ నామినేష‌న్ దాఖ‌లు చేసారు.
 
 అయితే హై డ్రామా మ‌ధ్య ఎన్నిక‌ల అధికారులు స్క్రూట్నిలో తొలుత వెంక‌టేష్ నామినేష‌న్ ను ఒకే చేసిన త‌రువాత రాత్రికి రాత్రి నామినేష‌న్‌ను ఎన్నిక‌ల అధికారులు తిర‌స్క‌రించారు. దీంతో రెండో నామినేష‌న్ దాఖ‌లు చేసిన‌ టీడీపీ అభ్య‌ర్థిగా ప్ర‌కాశ్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌కాశ్‌ను అమ‌ర్‌నాథ్‌రెడ్డి, చంద్ర‌బాబు పీఏ మ‌నోహ‌ర్‌, కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జీ పీఎస్ మునిర‌త్నం, నామినేష‌న్ తిరష్క‌ర‌ణ‌కు గురైన అభ్య‌ర్థి వెంక‌టేష్‌లు కిడ్నాప్ చేశార‌ని బంధువులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ చ‌ర్చ‌నీయాంశముగా మారిన‌ది.

కిడ్నాప్ కు గురైన ప్ర‌కాశ్ అన్న గోవింద‌రాజులు మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి, చంద్ర‌బాబు పీఏ మ‌నోహ‌ర్‌, టీడీపీ నేత‌లు పీఎస్ మునిర‌త్నం, మాజీ స‌ర్పంచ్ వెంక‌టేష్‌లు క‌లిసి నా త‌మ్ముడు ప్ర‌కాశ్‌, అత‌ని భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను బెదిరించి దౌర్జ‌న్యంగా తీసుకెళ్లారు అని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.  అదేవిధంగా సొంత పార్టీకి చెందిన అభ్య‌ర్థినే కిడ్నాప్ చేయ‌డం దారుణం అని గోవింద‌రాజులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు టీడీపీ  కిడ్నాప్ కాకుండానే భ‌యబ్రాంతుల‌కు గురిచేసే ఉద్దేశంతో త‌ప్పుడు ఫిర్యాదులు చేశార‌ని  ఆరోపించింది.





కుప్పంలో వివాదంగా మారిన టీడీపీ అభ్యర్థి కిడ్నాప్‌..!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>