PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trsac865d91-8ae1-46e0-a32e-8cc2fb299ab2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trsac865d91-8ae1-46e0-a32e-8cc2fb299ab2-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం త‌రువాత ఇప్పుడు అంద‌రి దృష్టి ద‌ళిత‌బంధు మీదు ఉంది. ద‌ళిత‌బంధు విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయ‌డం ప్రారంభించాయి. ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తారా లేదా..? ఎప్పుడు మొద‌లుపెడుతారు..? ఎందుకు ఆపుతున్నారంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకు వ‌చ్చిన ఈ ప‌థ‌కం అమ‌లు పై అనుమానాలకు గ‌త అనుభ‌వాలు దారితీస్తున్నాయి. ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, ద‌ళిత సీఎం లాంటి హామీలు కేసీఆర్ అమ‌లు చేయ‌లేదు. ఈ రెండు హామీలపై పెద్ద‌గా ప్ర‌జా వ్య‌తిరేక‌త dalith bandhu {#}Telangana Rashtra Samithi TRS;KCR;CM;Huzurabadగులాబి కారులో `ద‌ళిత‌బంధు` గుబుల్‌..!గులాబి కారులో `ద‌ళిత‌బంధు` గుబుల్‌..!dalith bandhu {#}Telangana Rashtra Samithi TRS;KCR;CM;HuzurabadSun, 07 Nov 2021 09:30:01 GMTహుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం త‌రువాత ఇప్పుడు అంద‌రి దృష్టి ద‌ళిత‌బంధు మీదు ఉంది. ద‌ళిత‌బంధు విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయ‌డం ప్రారంభించాయి. ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తారా లేదా..? ఎప్పుడు మొద‌లుపెడుతారు..? ఎందుకు ఆపుతున్నారంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం తీసుకు వ‌చ్చిన ఈ ప‌థ‌కం అమ‌లు పై అనుమానాలకు గ‌త అనుభ‌వాలు దారితీస్తున్నాయి. ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, ద‌ళిత సీఎం లాంటి హామీలు కేసీఆర్ అమ‌లు చేయ‌లేదు.


  ఈ రెండు హామీలపై పెద్ద‌గా ప్ర‌జా వ్య‌తిరేక‌త రాన‌ప్ప‌టికీ.. ప్ర‌తిప‌క్షాలు ఈ హామీల‌పై అడ‌పాద‌డ‌పా కేసీఆర్‌ను నిల‌దీస్తూ వ‌స్తున్నారు. కానీ, వీటిపై నిజాయితిగా నిక్క‌చ్చిగా పోరాడిన సంద‌ర్భాలు ఏం లేవు. అయితే, అతిపెద్ద న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కంగా ఉన్న ద‌ళిత‌బంధుపై రాజ‌కీయ పార్టీలు పెద్ద ఎత్తున గ‌ళం విప్పుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తే ఇత‌ర కులాల్లో కూడా ఇలాంటి ప‌థ‌కాలు కావాల‌ని కోరుకుంటారు. ఈ సంద‌ర్భంలో అధికార పార్టీకి వ్య‌తిరేక‌త మొద‌ల‌వుతుంది.


ఇప్ప‌టికే ద‌ళిత‌బంధు ఎఫెక్ట్ హుజురాబాద్ ఎన్నిక‌ల్లో ఉంద‌ని గట్టిగా విశ్వ‌సిస్తున్నాయి ప్ర‌తిప‌క్ష పార్టీలు.  ఒక వేళ ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేసినా.. రెండేళ్లలో రాష్ట్రంలో ఉన్న అన్ని ద‌ళిత కుటుంబాలకు ఈ ప‌థకాన్ని అమ‌లు చేయ‌డం సాధ్యం కాదు. అలాగే దీనికి 20వేల కోట్లు ఖ‌ర్చు పెట్టినా పూర్తికాదు. ఈ ప‌థ‌కం అమ‌లుకు ల‌క్ష కోట్ల‌కు పైగా కావాల‌ని ప్ర‌భుత్వ‌మే లెక్క‌వేసింది. అంటే ప్ర‌తి ఏటా 20 వేల కోట్లు ఖ‌ర్చుపెట్టినా 20 శాతం మాత్ర‌మే పూర్త‌వుతుంది. దీంతో ఈ 20శాతం మంది ద‌ళితులు టీఆర్ఎస్‌కు ఓటు వేసినా మిగ‌తా 80 శాతం మంది ప్ర‌జ‌లు ఈ ప‌థ‌కంతో ప్ర‌యోజ‌గం అంద‌లేద‌ని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేయ‌వ‌చ్చు.


అలాగే, బ‌డ్జెట్ ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌కు కేటాయించిన డ‌బ్బుల‌ను ఈ ప‌థ‌కానికి  మ‌ళ్లించాల్సి వ‌స్తుంది. దీని ద్వారా ఆ ప్ర‌యోజ‌నాలు పొందుతున్న ప్ర‌జ‌లు దూరం అయ్యే అవ‌కాశం ఉటుంది అని రాజ‌కీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ద‌ళితఏత‌ర వ‌ర్గాలు ప్ర‌భుత్వానిక వ్య‌తిరేకంగా మారే అవ‌కాశాలు కూడా ఉన్నాయిని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ద‌ళిత‌బంధుపై టీఆర్ఎస్ వైఖ‌రితో ప్ర‌జ‌ల్లో పార్టీపై న‌మ్మ‌కం పోయేలా ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.



భారత్ : ప్రధానికి.. క్రేజ్ తగ్గేదేలే.. !

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>