PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌త కొన్ని రోజులుగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ నడుస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న పాల‌నకు స‌మ‌యం మిగిలి ఉండ‌గానే అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఆ ఎన్నిక‌ల్లో 98 సీట్లు గెలుచుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐ, టీడీపీ కూటమిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అయినా, 2014 ఎన్నిక‌ల కంటే ఎక్కువ సీట్ల‌ను గెలుపొందింది గులాబీ పార్టీ. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న‌కు దెబ్బ‌ప‌డుతుంద‌ని ముందే ఊap and ts politics{#}YCP;TDP;Party;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;Telangana;KCR;Teluguముంద‌స్తు ముచ్చ‌ట.. అధికారం అందిస్తుందా..?ముంద‌స్తు ముచ్చ‌ట.. అధికారం అందిస్తుందా..?ap and ts politics{#}YCP;TDP;Party;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;Telangana;KCR;TeluguSun, 07 Nov 2021 12:51:34 GMT రెండు తెలుగు రాష్ట్రాల్లో గ‌త కొన్ని రోజులుగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ నడుస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న పాల‌నకు స‌మ‌యం మిగిలి ఉండ‌గానే అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఆ ఎన్నిక‌ల్లో 98 సీట్లు గెలుచుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐ, టీడీపీ కూటమిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. అయినా, 2014 ఎన్నిక‌ల కంటే ఎక్కువ సీట్ల‌ను గెలుపొందింది గులాబీ పార్టీ. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న‌కు దెబ్బ‌ప‌డుతుంద‌ని ముందే ఊహించిన కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లాడు.


   అయితే, కొన్ని నెల‌ల క్రితం ఇదే విష‌యం పై కేసీఆర్ చేసే ప‌నులు చాలా ఉన్నాయి అని ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సిద్ధం లేమ‌ని ప్ర‌క‌టించారు. కానీ, తాజా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీతో పాటు పార్టీ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త మొద‌ల‌యింద‌ని గ్ర‌హించిన కేసీఆర్ ముందస్తు దిశ‌గా అడుగులు వేయాల‌ని తాజాగా యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఒక వేళ ముంద‌స్తుకు వెళ్తే చేయాల్సిన కార్య‌క్ర‌మాలు చాలానే పెండింగ్‌లో ప‌డుతాయి. ఇప్ప‌టికే కేసీఆర్ ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డంలో ఆల‌స్యం అవుతుంది.


మ‌ళ్లీ ముంద‌స్తుకు వెళ్తే ఆ కార్య‌క్ర‌మాలు అన్ని నిలిచిపోతాయ‌ని, దీని వ‌ల్ల ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త మ‌రింత పెరుగుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ముంద‌స్తుకు వెళ్లినా అతి క‌ష్టం మీద విజ‌యం సాధించేందుకు అవకాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.  మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అధినేత కేసీఆర్ ను అనుస‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌చ్చని, ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉండాల‌ని ఇప్ప‌టికే త‌న మంత్రివ‌ర్గానికి సంకేతాలు ఇచ్చారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, క్షేత్ర‌స్థాయిలో ఇంటింటి కి వెళ్లి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుక‌కుని వాటిని ప‌రిష్క‌రించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.


అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డం  జ‌గ‌న్‌మోహన్ రెడ్డికి క‌లిసి వ‌చ్చే అంశం. అటు టీడీపీ, ఇటు బీజేపీ రెండు పార్టీలు కూడా ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయిన‌ట్టు తెలుస్తోంది. ఇక జ‌న‌సేన ఇప్పుడిప్పుడే అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లోకి వెళ్తోంది.  ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు బ‌లప‌డ‌క ముందే, ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఏర్ప‌డ‌క మునుపే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే రెండో సారి కూడా వైసీపీ అధికారంలోకి రావొచ్చ‌నే ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి.



   



ముంద‌స్తు ముచ్చ‌ట.. అధికారం అందిస్తుందా..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>