PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/attchanaidu-sensational-comments-on-cm-jagane1b24efd-9106-4a70-928e-2567070d2d47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/attchanaidu-sensational-comments-on-cm-jagane1b24efd-9106-4a70-928e-2567070d2d47-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ అమరావతి ప్రాంతం నుంచి తిరుమల వరకు పాదయాత్ర మొదలైన సంగతి తెలిసిందే. ఈ యాత్ర వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది అనే వ్యాఖ్యలు కాస్త గట్టిగానే వినపడుతున్నాయి. రాజకీయంగా కూడా ఈ యాత్ర ఇప్పుడు ఏపీలో కాస్త హాట్ టాపిక్ కూడా అయింది. ఇక ఇప్పుడు రైతుల మహాపాదయాత్రపై జగన్ రెడ్డి ప్రభుత్వం కవ్వింపు చర్యలు మానుకోవాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేన్నాయుడు డిమాండ్ చేసారు. భవిష్యత్ తరాల కోసం పోరాడుతున్న రైతులపై పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం ap{#}Amaravati;Yatra;court;Jagan;Telugu Desam Party;CBN;Manam;TDP;Government;police;Tirupatiఅప్పుడు చంద్రబాబు తలుచుకుంటే జగన్ పరిస్థితి...?అప్పుడు చంద్రబాబు తలుచుకుంటే జగన్ పరిస్థితి...?ap{#}Amaravati;Yatra;court;Jagan;Telugu Desam Party;CBN;Manam;TDP;Government;police;TirupatiSun, 07 Nov 2021 14:17:34 GMTఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ అమరావతి ప్రాంతం నుంచి తిరుమల వరకు పాదయాత్ర మొదలైన సంగతి తెలిసిందే. ఈ యాత్ర వెనుక తెలుగుదేశం పార్టీ ఉంది అనే వ్యాఖ్యలు కాస్త గట్టిగానే వినపడుతున్నాయి. రాజకీయంగా కూడా ఈ యాత్ర ఇప్పుడు ఏపీలో కాస్త హాట్ టాపిక్ కూడా అయింది. ఇక ఇప్పుడు రైతుల మహాపాదయాత్రపై జగన్ రెడ్డి ప్రభుత్వం కవ్వింపు చర్యలు మానుకోవాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేన్నాయుడు డిమాండ్ చేసారు.

భవిష్యత్ తరాల కోసం పోరాడుతున్న రైతులపై పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం అని ఆయన ఆరోపించారు. పాదయాత్రకు స్వాగతం చెప్పేందుకు వస్తున్న పల్లె ప్రజలను అడ్డుకోవడం సరైంది కాదు అని ఆయన కోరారు. పోలీసుల దుందుడు చర్యలతో ఒకసారి వారికి సంకెళ్లు వేసి కోర్టుల చేత తిట్లు తిన్నారు అని విమర్శించారు. కోర్టు అనుమతితో, న్యాయసస్థానం పర్యవేక్షణలో జరుగుతున్న పాదయాత్రపైనే పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తే ప్రజలకు ఈ రాష్ట్రంలో నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును ఉల్లంఘించడం కాదా?  అని ఆయన ప్రశ్నించారు.

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంత పాలనలో ఉన్నామా? అని ఆయన ప్రశ్నించారు. న్యాయాన్ని, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కవ్వింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నారు. పోలీసుల చర్యలపై విచారణ చేపట్టి రైతులపై అత్యుత్సాహంతో ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. 3648 కి.మీ పాదయాత్ర చేసానని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి రైతుల పాదయాత్రపై పోలీసులను రెచ్చగొట్టడం నీతిమాలిన చర్య అని అన్నారు. నాడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా ప్రవర్తించి ఉంటే జగన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగే వాడా? అని ఆయన ప్రశ్నించారు. రైతుల మహాపాదయాత్రలో జరగరాని సంఘటనలు జరిగితే దానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని స్పష్టం చేసారు.



అప్పుడు చంద్రబాబు తలుచుకుంటే జగన్ పరిస్థితి...?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>