MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-srinivasf972d7cf-cd81-4771-9efd-bf85604cdca2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-srinivasf972d7cf-cd81-4771-9efd-bf85604cdca2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందువరుసలో ఉంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుడు ఉండడు. అంతేకాదు ఈ డైరెక్టర్ తో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని అనుకునే హీరోలు చాలామంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. త్రివిక్రమ్ ఇప్పటివరకూ చేసిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలతో చాలా పెద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల 'అల వైకుంఠ పురంలో' అనే సినిమా తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు త్రివిక్రమ్. డైరెక్టర్ గానే కాకుండా రచయితగా కూడా పలు సినిమాలకు పనిచేసి మంచిTrivikram Srinivas{#}Khaleja;thaman s;Pooja Hegde;Rajani kanth;VIRAT KOHLI;Pawan Kalyan;mahesh babu;Jr NTR;Industry;trivikram srinivas;Director;Cinema;Yevaruత్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ యాడ్స్ గురించి తెలుసా..?త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ యాడ్స్ గురించి తెలుసా..?Trivikram Srinivas{#}Khaleja;thaman s;Pooja Hegde;Rajani kanth;VIRAT KOHLI;Pawan Kalyan;mahesh babu;Jr NTR;Industry;trivikram srinivas;Director;Cinema;YevaruSun, 07 Nov 2021 14:30:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ముందువరుసలో ఉంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుడు ఉండడు. అంతేకాదు ఈ డైరెక్టర్ తో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని అనుకునే హీరోలు చాలామంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. త్రివిక్రమ్ ఇప్పటివరకూ చేసిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలతో చాలా పెద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల 'అల వైకుంఠ పురంలో' అనే సినిమా తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు త్రివిక్రమ్. డైరెక్టర్ గానే కాకుండా రచయితగా కూడా పలు సినిమాలకు పనిచేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

ఇక సినిమాలు మాత్రమే కాదు కొన్ని యాడ్స్ ని కూడా డైరెక్ట్ చేసాడు త్రివిక్రమ్. ఈ విషయం చాలా మందికి తెలియదు. త్రివిక్రమ్ ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన యాడ్స్ ని ఒకసారి పరిశీలిస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టీమిండియా క్రికెటర్ ధోనీ తో పెప్సీ యాడ్, జూనియర్ ఎన్టీఆర్ తో నవరత్న యాడ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోయాలుకాస్ యాడ్,  తమన్నా, విరాట్ కోహ్లీ సెల్కాన్ యాడ్స్ కూడా త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు. అంతెందుకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో యాడ్ ని కూడా త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడం విశేషం. కేవలం సినిమాలు మాత్రమే కాదు యాడ్స్ లో కూడా తన మార్క్ డైరెక్షన్ చూపించాడు త్రివిక్రమ్.

 ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో త్రివిక్రమ్సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రావడం జరిగింది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మరోసారి పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు...!!



తెలంగాణ‌లో ఆర్టీసీ ఛార్జీల పెంపు..? ఎంతంటే..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>