SportsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-worldcup2cca9f7d-fa25-4ee2-896a-8455c79ee005-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/t20-worldcup2cca9f7d-fa25-4ee2-896a-8455c79ee005-415x250-IndiaHerald.jpgటీ 20 ప్రపంచ కప్‌ నుంచి ఓ కీలక జట్టు నిష్క్రమించింది. గ్రూప్‌ ఏ నుంచి దక్షిణాఫ్రికా ఔట్ అయ్యింది. పాపం.. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు నెగ్గినా కూడా దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు అంతా దురదృష్టమంటే దక్షిణాఫ్రికాదే అంటున్నారు. సెమీస్‌ చేరాలంటే ఘనవిజయం సాధించి తీరాల్సిన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కేవలం 10 పరుగుల స్వల్ప తేడాతోనే ఇంగ్లాండ్‌ను ఓడించింది. అందుకే ఈ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా నెగ్గినా.. ఆ ఆనందం లేకుండా పోయింది. గెలిచినా ఇంటి దారి పట్టింది. నెట్ రన్T20 WORLDCUP{#}Australia;England;World Cup;Qualification;Anandamపాపం.. దక్షిణాఫ్రికా: ఇంగ్లండ్‌పై నెగ్గింది.. ఇంటికి వెళ్లిందిపాపం.. దక్షిణాఫ్రికా: ఇంగ్లండ్‌పై నెగ్గింది.. ఇంటికి వెళ్లిందిT20 WORLDCUP{#}Australia;England;World Cup;Qualification;AnandamSun, 07 Nov 2021 06:57:20 GMTటీ 20 ప్రపంచ కప్‌ నుంచి ఓ కీలక జట్టు నిష్క్రమించింది. గ్రూప్‌ ఏ నుంచి దక్షిణాఫ్రికా ఔట్ అయ్యింది. పాపం.. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు నెగ్గినా కూడా దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు అంతా దురదృష్టమంటే దక్షిణాఫ్రికాదే అంటున్నారు.  సెమీస్‌ చేరాలంటే ఘనవిజయం సాధించి తీరాల్సిన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కేవలం 10 పరుగుల స్వల్ప తేడాతోనే ఇంగ్లాండ్‌ను ఓడించింది.


అందుకే ఈ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా నెగ్గినా.. ఆ ఆనందం లేకుండా పోయింది. గెలిచినా ఇంటి దారి పట్టింది. నెట్ రన్‌ రేట్ కారణంగా.. గ్రూప్‌ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకున్నాయి. చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయినా నెట్ రన్‌ రేట్ బావుండటంతో సెమీస్‌కు చేరింది. గ్రూప్ వన్ నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఈ మూడు జట్లూ నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. 8 పాయింట్ల స్కోరుతో సమంగా నిలిచాయి.


కానీ.. దక్షిణాఫ్రికా అతి తక్కువ రన్ రేట్ కారణంగా ప్రపంచ కప్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. గ్రూప్ 1లో ఇంగ్లండ్ నెట్ రన్ రేట్ 2.4 ఉండగా... ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్‌ 1.2 ఉంది. ఇక దక్షిణాఫ్రికా రన్ రేట్ 0.7 మాత్రమే.. ఇక చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారీ విజయం అవసరమైంది. ఈ పరిస్థితుల్లో బ్యాటుతో సఫారీ జట్టు బాగానే ఆడింది. డసెన్‌ అదిరే బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ దక్షిణాఫ్రికాకు మంచి స్కోరు తెచ్చాయి. హెండ్రిక్స్‌  2 పరుగులకే అవుటైనా.. డికాక్‌ 34 పరుగులు డసెన్‌ 94 పరుగులు చేశారు. మార్‌క్రమ్‌ 52 పరుగులు చేసాడు. మొత్తం 20 ఓవర్లలో 2 వికెట్లకు దక్షిణాఫ్రికా 189 పరుగులు చేసింది.  


అయితే.. దక్షిణాఫ్రికా సెమీస్‌ చేరాలంటే ఇంగ్లాండ్‌ను 131 పరుగుల కంటే తక్కువకే ముగించాలి. కానీ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆ అవకాశం ఇవ్వలేదు. జేసన్‌ రాయ్‌ 20, బట్లర్‌ 26 పరుగులు చేశారు. మొదటి 4 ఓవర్లలోనే స్కోరు 37 గా ఉంది. అయిదో ఓవర్లో రాయ్‌ రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యాడు. 20 ఓవర్లలో ఇంగ్లాండ్ 179 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైనా.. నెట్ రన్‌రేట్‌లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు వెళ్లింది. పాపం.. దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలిచినా.. ఇంటి ముఖం పట్టక తప్పలేదు.





ఇక చంద్రబాబుకు జాకీలు వేయడం కష్టమేనా..?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>