PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/iraq-pm-kadiri-face-drone-attack813b3e0a-da07-4ed5-8ac4-2ab410f84578-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/iraq-pm-kadiri-face-drone-attack813b3e0a-da07-4ed5-8ac4-2ab410f84578-415x250-IndiaHerald.jpgప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది ఓ దేశ ప్ర‌ధాన‌మంత్రి నివాసంపై బాంబు దాడి. ఇరాక్ ప్ర‌ధాని ముస్తాఫా అల్ క‌దిమి నివాసాన్ని ల‌క్ష్యం చేసుకుని ఆదివారం తెల్ల‌వారుజామున డ్రోన్ బాంబు అటాక్ జ‌రిగింది. ఈ విష‌యాన్ని ఆ దేశ అధికార‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ దాడిలో ప్ర‌ధాన‌మంత్రి ముస్తాఫా అల్ క‌దిమి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని, కానీ ఆయ‌న ర‌క్ష‌ణ సిబ్బంది గాయాల‌పాల‌య్యార‌ని తెలుస్తోంది. గ‌త నెల‌లో జ‌రిగిన సాధార‌ణ‌ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బాగ్ధాద్ లో హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ప్ర‌ధానiraq {#}sunday;Kadiri;Parliment;Iraq;twitter;Prime Ministerప్ర‌ధానిపై బాంబ్ ఎటాక్‌..!ప్ర‌ధానిపై బాంబ్ ఎటాక్‌..!iraq {#}sunday;Kadiri;Parliment;Iraq;twitter;Prime MinisterSun, 07 Nov 2021 14:12:10 GMTప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది ఓ దేశ ప్ర‌ధాన‌మంత్రి నివాసంపై బాంబు దాడి. ఇరాక్ ప్ర‌ధాని ముస్తాఫా అల్ క‌దిమి నివాసాన్ని ల‌క్ష్యం చేసుకుని ఆదివారం తెల్ల‌వారుజామున డ్రోన్ బాంబు అటాక్ జ‌రిగింది. ఈ విష‌యాన్ని ఆ దేశ అధికార‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ దాడిలో ప్ర‌ధాన‌మంత్రి ముస్తాఫా అల్ క‌దిమి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డార‌ని, కానీ ఆయ‌న ర‌క్ష‌ణ సిబ్బంది గాయాల‌పాల‌య్యార‌ని తెలుస్తోంది. గ‌త నెల‌లో జ‌రిగిన సాధార‌ణ‌ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బాగ్ధాద్ లో హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ప్ర‌ధాని నివాసం దాడి జ‌ర‌గ‌డంతో మ‌ళ్లీ ఒక్క‌సారిగా దేశం ఉలిక్కిప‌డింది.


 గ్రీన్ జోన్ లో ఉన్న‌ ప్రధాన మంత్రి క‌దిమి నివాసాన్ని ల‌క్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడికి పాల్ప‌డ్డార‌ని తెలిపారు అధికారులు. ఈ ప్రాంతంలోనే ప్ర‌భుత్వం కార్యాల‌యాలు, విదేశి దౌత్య కార్యాల‌యాలు కూడా ఇక్క‌డే ఉంటాయి. అయితే, ఈ దాడిపై ఏ సంస్థ కూడా బాధ్య‌త‌ను ప్ర‌క‌టించలేదు. ప్ర‌ధాని నివాసం పై దాడి ఆరోగ్య‌క‌ర‌మైన‌ది కాద‌ని ఇరాక్ మిల‌ట‌రీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అలాగే  దాడి పై ఆ దేశ ప్రధాన మంత్రి  కదిరి అధికార ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. త‌న‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని, ప్ర‌జ‌లు సంయ‌మ‌నంగా ఉండాల‌ని సూచించారు ప్ర‌ధాని క‌దిరి.


   అధికారం చేజిక్కించుకోవాల‌నే ల‌క్ష్యంతో ఇరాక్ లో సాయుధ బ‌ల‌గాలు కూటమిగా ఏర్పడ్డాయి. అఫ్గ‌నిస్తాన్ త‌ర‌హాలో అధికారం చేప‌ట్టేందుకు అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నాయి బ‌ల‌గాలు.  గ్రీన్ జోన్ లోని పార్లమెంట్ భవనం సమీపంలో ఇటీవ‌ల ఆయుధాలు ప‌ట్టుకుని  తిరుగుబాటు దారులు నిరసన ప్రదర్శనలు చేశారు. అయితే ఈ దాడికి ఇత‌ర సంస్థ‌ల‌కు చెందిన వారు పాల్ప‌డి ఉంటార‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి ఇరాక్ రక్షణ శాఖ వర్గాలు. ఇప్పుడిప్పుడే గాడిలో ప‌డి బాగుప‌డుతున్న ఇరాక్‌కు ఇలాంటి దాడులు గొడ్డ‌లి పెట్టు లాంటివి అని అంత‌ర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.



అప్పుడు చంద్రబాబు తలుచుకుంటే జగన్ పరిస్థితి...?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>