HealthChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kapalabathi-9449f791-ad04-4407-9a01-f2031a7d9a10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kapalabathi-9449f791-ad04-4407-9a01-f2031a7d9a10-415x250-IndiaHerald.jpgశరీరంలో రక్తప్రసరణ అవరసం తెలిసిందే. అది సరిగా జరగని పక్షంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఎప్పటి కప్పుడు రక్తం కూడా శుద్ధి చేయబడుతూనే ఉండాలి. అప్పుడే రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. అయితే వీటన్నికి సరైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, దానికి తగిన శారీరిక శ్రమ కూడా అంతే అవసరం. కనీస శారీరక శ్రమ కోసమే గతంలో అనేక పనులు చేస్తూ ఉండేవాడు. కానీ నేడు అన్ని యంత్రాలకు అప్పజెప్పి వదిలేయడమే కాబట్టి మనిషికి దాదాపుగా శారీరిక శ్రమ తగ్గిపోయింది. అందుకే లేనిపోని రోగాలు వచ్చేస్తున్నాయి. రోజు శరీరంలో జరిగే పరిణాkapalabathi;{#}prakruti;Air;oxygen;Shakti;Heartరక్తప్రసరణకు.. యోగా సూత్రాలు..!రక్తప్రసరణకు.. యోగా సూత్రాలు..!kapalabathi;{#}prakruti;Air;oxygen;Shakti;HeartSun, 07 Nov 2021 19:35:00 GMT
అలా కానీ పక్షంలో శరీరం కింద పొరలలో అది చేరిపోయి ఉంటుంది కాబట్టి దానివలన అనవసరపు చర్మ రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. దాదాపుగా ఇలాంటి జబ్బులు అన్ని కూడా రక్త శుద్ధి లోపించడం వలన జరిగేవే, అందుకే శారీరక శ్రమ కాస్తైనా చేయడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో చెడు బయటకు పోవడం వలన చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా చర్మం కింద పేరుకుపోయిన చెడు బయటకు పోతే ఆ ప్రాంతం గ్లో పెరిగిపోతుంది. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సౌదర్యం కోసం రకరకాల ప్రాంతాలకు వెళ్లినా వాళ్ళు మసాజ్ పేరుతో అక్కడ ఉన్న చెడును స్థానచలనం చేయగలరు తప్ప మరేమి ప్రయోజనం ఉండదు, అందుకే అలాంటి చోటులకు మళ్లీమళ్లీ వెళ్లాల్సి వస్తుంది.

అందుకే పెద్దలు దీనిని గ్రహించి యోగ సూత్రాల ద్వారా శరీరానికి కావాల్సిన అనేక మంచి మార్గదర్శకాలు చేర్చిపెట్టారు. అందులో కాపలాభాతి గురించి నేడు కొద్దిగా తేలుకుందాం. ఆ పదంలోనే శుద్ధి లేదా శక్తి  విడుదల అని చెపుతుంది. దీనివలన శరీరంలోని అవయవాల శుభ్రత జరుగుతుంది, జీవక్రియ మెరుగుపడుతుంది. ఈ వ్యాయామం దశలవారీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాణాయామంలో ఒక పద్దతి.

దీనికి ముందుగా,

మీకు సౌకర్యంగా ఉన్న స్థితిలో కూర్చొని(వీలైతే మెల్లిగా పద్మాసనంలో లేదా బచాపట్టాలు వేసుకొని కూర్చోవడం అలవాటు చేసుకోండి), కళ్ళు మూసుకొని కాసేపు దృష్టి  కనుబొమ్మల మధ్యలో ఉంచండి. ఇలా కాసేపు చేసిన తరువాత కళ్ళు తెరిచి, స్వేచ్ఛగా(బాగా దీర్ఘంగా) గాలి లోనికి తీసుకోండి(ముక్కుద్వారా).

ఈ దీర్ఘ ఉచ్వాస ఛాతి, పొట్ట భాగంలోకి వెళ్లి మరలా పొట్ట భాగం నుండి ఛాతి భాగం ద్వారా ఇలా రివర్స్ లో బయటకు ఫోర్స్ గా వదలాలి. ఇలా మీకు సౌకర్యవంతంగా ఉన్నంత వరకు చేయండి. మొదటిలో ఎక్కువ చేయరాదు.

మెల్లిగా రోజులు గడిచే కొద్దీ 40 సార్లు(దీర్ఘ ఉచ్వాస-నిచ్వాసలు కలిపి ఒక సైకిల్) చేయడానికి ప్రయత్నించండి. సాధనలో కష్టం అనిపించిన వెంటనే గురుముఖంగా దీనిని నేర్చుకొని ప్రయత్నించడం అనివార్యం. సాధారణంగా యోగ గురుముఖంగా ముందు నేర్చుకొని అనంతరం గృహంలో లేదా మీకు సౌకర్యవంతమైన ప్రకృతి సిద్దమైన చోట సాధన చేయాల్సి ఉంటుంది.

ఇక దీని వలన ప్రయోజనాలు, ఉచ్వాస నిచ్వాసలు జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ లోనికి వెళ్లడం, కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఉచ్వాస ద్వారా శరీరానికి కావాల్సిన వాయువు అందుతుంది, నిచ్వాస ద్వారా శరీరంలో వివిధ ప్రక్రియల ద్వారా వెలువడిన చేడు వాయువు బయటకు నెట్టివేయబడుతుంది. ఇటీవల ఈ ప్రక్రియ కూడా సరిగా జరగటంలేదు. అందుకే కాపాలభాతి చేయడం అలవాటు చేసుకుంటే, జీవక్రియ సజావుగా జరుగుతుంది. అసలు జీర్ణ క్రియ సరిగా లేకపోతేనే రోగాలన్నీ వచ్చేది, అదే బాగుంటే దాదాపు రోగాలు జోలికి రానట్టే.

జీర్ణక్రియ సరిగా జరిగితే గుండె సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. కాపాలభాతి తో గుండె కూడా కావాల్సినంత ఆక్సిజన్ లభించి ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటుంది. కాపాలభాతి వలన బరువు అదుపులో ఉంటుంది. మొదట చెప్పినట్టుగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ముక్కు సంబంధిత అనేక వ్యాధులు కూడా రాకుండా చేస్తుంది. ఒత్తిడి లేని మానసిక ఆరోగ్యం కూడా దీనివలననే సాధ్యం. రోజు పది నిమిషాల వ్యాయామం, పది నిమిషాల కాపాలభాతి చేస్తే ఆరోగ్యం మీదే అంటే ఆ మాత్రం సమయం కేటాయించలేమా అనేది మిరే ఆలోచించుకోవాలి. మళ్ళీ చెపుతున్నాం, ఈ ప్రాణాయామాల గురుముఖంగా నేర్చుకున్న తరువాత సాధన చేయడం ఉత్తమం.


బిజెపి పై కొత్త కెసిఆర్... ఫుట్ బాల్ ఆడేసారు...!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>