MoviesPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suma1642e7b9-1fe2-44fb-a52a-2a45ed6727e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suma1642e7b9-1fe2-44fb-a52a-2a45ed6727e2-415x250-IndiaHerald.jpgబుల్లి తెర స్టార్ యాంకర్ ఎవరూ అంటే... ఠక్కున చెప్పే పేరు సుమ కనకాల. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెర మహారాణిగా... రాజ్యం ఏలుతున్నారు సుమ. స్టార్ మహిళగా, క్యాష్... ఇలా ఎన్నో ప్రొగ్రామ్‌లను రక్తికట్టించిన ఘనత ఈ సుమకే దక్కుతుంది. ఇక మెగా ఈవెంట్లకు, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు, అభినందన సభలకు సుమ యాంకరింగ్ ఎక్స్ ట్రా అట్రాక్షన్. అక్కడ స్టార్ హీరోల మాటలకు ఎంత మంది చప్పట్లు కొడతారో... సుమ చెప్పే మాటలకు అంతకు రెట్టింపు సంఖ్యలో నవ్వుల పువ్వులు పూస్తాయి సభల్లో. స్టార్ హీరోల ఫంక్షన్లకు సుమ యాంకరింగ్ ఎకSuma{#}Allari;vennela;Pawan Kalyan;Kumaar;suma;suma kanakala;television;m m keeravani;Posters;Joseph Vijay;Director;Mass;Cinema;Silverసిల్వర్ స్క్రీన్‌పై యాంకర్ సుమ... పోస్టర్ అదిరింది..!సిల్వర్ స్క్రీన్‌పై యాంకర్ సుమ... పోస్టర్ అదిరింది..!Suma{#}Allari;vennela;Pawan Kalyan;Kumaar;suma;suma kanakala;television;m m keeravani;Posters;Joseph Vijay;Director;Mass;Cinema;SilverSat, 06 Nov 2021 13:51:07 GMTబుల్లి తెర స్టార్ యాంకర్ ఎవరూ అంటే... ఠక్కున చెప్పే పేరు సుమ కనకాల. దాదాపు రెండు దశాబ్దాలుగా బుల్లితెర మహారాణిగా... రాజ్యం ఏలుతున్నారు సుమ. స్టార్ మహిళగా, క్యాష్... ఇలా ఎన్నో ప్రొగ్రామ్‌లను రక్తికట్టించిన ఘనత ఈ సుమకే దక్కుతుంది. ఇక మెగా ఈవెంట్లకు, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు, అభినందన సభలకు సుమ యాంకరింగ్ ఎక్స్ ట్రా అట్రాక్షన్. అక్కడ స్టార్ హీరోల మాటలకు ఎంత మంది చప్పట్లు కొడతారో... సుమ చెప్పే మాటలకు అంతకు రెట్టింపు సంఖ్యలో నవ్వుల పువ్వులు పూస్తాయి సభల్లో. స్టార్ హీరోల ఫంక్షన్లకు సుమ యాంకరింగ్ ఎక్స్ ట్రా యాడ్ చేస్తుంది. ఇక టీవీ షోలల్లో అయితే సుమ కోసం షోలు చూసే వారే ఎక్కువ. ఇక సొంత యూ ట్యూబ్ ఛానల్ ద్వారా కూడా సుమ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అప్పుడెప్పుడో వెండి తెరపై కనిపించిన సుమ... వివాహం తర్వాత పూర్తిగా సిల్వర్ స్క్రీన్‌కు దూరమయ్యారనే చెప్పాలి. అప్పుడప్పుడూ చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ... బుల్లి తెరకు ఇచ్చిన ప్రాధాన్యత సిల్వర్ స్క్రీన్‌కు ఇవ్వలేదు యాంకర్ సుమ.

అయితే అనూహ్యంగా సిల్వర్ స్క్రీన్‌ పై తళుక్కున్న మెరవనున్నారు సుమ కనకాల. వెన్నెల క్రియేషన్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మాతగా వస్తున్న సినిమా జయమ్మ పంచాయితీ. ఈ సినిమాలో సుమ కనకాల టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్, టైటిల్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ విడుదల చేశారు. కలివరపు విజయ్ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజికల్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో ఓ మాస్ రోల్‌లో సుమ కనకాల నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూష్ కుమార్ సినిమాటోగ్రాఫీ చేస్తున్నారు. ఓ రోల్ దగ్గర దంచుతూ కూర్చున్న సుమ కనకాల... సీరియస్ లుక్‌తో కనిపిస్తున్నారు. పోస్టర్‌లో పైట కొంగు అలా ఎగురుతూ ఉండగా... దానిపై సినిమాలో నటీనటులందరూ ఉండేలా పోస్టర్ డిజైన్ చేశారు. సినిమా ప్రేమికులకు ఓ ఫీల్ గుడ్ సినిమా ఇది అంటూ సుమ కనకాల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు యాంకర్ సుమగా బుల్లి తెరపై తన సత్తా చాటిన సుమ కనకాల... ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి తనేమిటో రుజువు చేసుకోనున్నారు.





బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు

ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకున్న మారుతి..!

యాత్రకు నాలుగేళ్లు: జ‌గ‌న్‌.. అడ్డ‌గోలుగా సీఎం అవ్వాల‌నుకోలేదు..!

బ్యాగ్ సర్దుకుని ఇంటికి పోవడమే : రవీంద్ర జడేజా

అలా అయితే బ్యాగ్ సర్దుకోవడమే..! వెల్లడించిన జడేజా

కేవలం రూ.10 కే ఏడాది పాటు ఓపీ సేవ‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>