Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crisgayl47807599-6cb1-460d-a068-d4b6ff797689-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/crisgayl47807599-6cb1-460d-a068-d4b6ff797689-415x250-IndiaHerald.jpgవెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం.. క్రిస్ గేల్ కి ప్రపంచ క్రికెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ముఖ్యంగా టీ-20 ఫార్మెట్లో స్పెషలిస్ట్ బ్యాట్మెన్గా క్రిస్ గేల్ నీ ఎంతో మంది ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తాను ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు టి20 క్రికెట్ లో క్రిస్ గేల్ సృష్టించిన విధ్వంసాలు అలాంటివి. ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే క్రిస్ గేల్ కేవలం ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగల సత్తా ఉన్న ఆటగాడు. అయితే సాధారణంగా క్రికెట్ లో కేవలం నలభై ఏళ్ల వయసు వచ్చింది అంటే చాలు ఆటగాళCrisgayl{#}Australia;West Indies;Chris Morris;INTERNATIONAL;Audience;Cricket;World Cupక్రికెట్ నుంచి తప్పుకున్న క్రిస్ గేల్.. ఫాన్స్ షాక్?క్రికెట్ నుంచి తప్పుకున్న క్రిస్ గేల్.. ఫాన్స్ షాక్?Crisgayl{#}Australia;West Indies;Chris Morris;INTERNATIONAL;Audience;Cricket;World CupSat, 06 Nov 2021 17:45:00 GMTవెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం.. క్రిస్ గేల్ కి ప్రపంచ క్రికెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ముఖ్యంగా టీ-20 ఫార్మెట్లో స్పెషలిస్ట్ బ్యాట్మెన్గా క్రిస్ గేల్ నీ ఎంతో మంది ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తాను ఉంటారు. ఎందుకంటే ఇప్పటివరకు టి20 క్రికెట్ లో క్రిస్ గేల్ సృష్టించిన విధ్వంసాలు అలాంటివి. ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే క్రిస్ గేల్ కేవలం ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగల సత్తా ఉన్న ఆటగాడు. అయితే సాధారణంగా క్రికెట్ లో కేవలం నలభై ఏళ్ల వయసు వచ్చింది అంటే చాలు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 అయితే ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కి 42 ఏళ్లు నడుస్తున్నాయి. ఇక ఇలాంటి సమయంలో పలుమార్లు మీ రిటైర్మెంట్ ఎప్పుడు అని ప్రశ్నించగా ఆ విషయం నాకు కూడా తెలియదు నాకు ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించాలని ఆలోచన లేదు అంటూ క్రిస్ గేల్ సమాధానమిచ్చాడు. దీంతో ఇప్పట్లో క్రిస్ గేల్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదు అని అనుకున్నారు అందరు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే క్రిస్ గేల్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు అన్నది మాత్రం అర్థమౌతుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఐపీఎల్ ఇక ఇప్పుడు జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో క్రిస్ గేల్ పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు.


 అంతేకాదు ఈ 42 ఏళ్ల ఆటగాడికి ఫిట్నెస్ సమస్యలు కూడా వస్తూ ఉండటం గమనార్హం.  ఈ క్రమంలోనే  క్రిస్ గేల్ రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధమైనట్లు ప్రస్తుతం తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే ఆస్ట్రేలియా మ్యాచ్ లో మరోసారి పేలవ ప్రదర్శన చేసి బౌల్డ్ అయ్యాడు క్రిస్గేల్. ఇలా వికెట్ కోల్పోగానే గేల్ చేతులు పైకెత్తి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. తోటి క్రికెటర్లు అతడికి అభినందనలు తెలిపారు. ఇక ఇదంతా చూస్తుంటే క్రిస్ గేల్ కు ఇదే చివరి మ్యాచ్ అని అంటున్నారు నెటిజన్లు. ఇక సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉండడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.



జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?

ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!

చిరంజీవి సినిమా ఓపెనింగ్‌లో ఐదుగురు ద‌ర్శ‌కులు సంద‌డి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>