PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-politicsdda07d29-39ab-4f66-9858-ec827e76f18d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-politicsdda07d29-39ab-4f66-9858-ec827e76f18d-415x250-IndiaHerald.jpgవైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు సొంత జిల్లా లో బిగ్ షాక్ త‌గిలింది. త‌మ మాట‌కు విలువ ఇవ్వ‌కుండా.. ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌ల షెడ్యూల్ ఇవ్వ‌డాన్ని వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు గ్రామాల‌ ప్ర‌జ‌లు స‌హించ లేక పోతున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ ఆగ్ర‌హాన్ని ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌తో ప్రభుత్వానికి చాటి చెప్పారు. ఇది ఒక ర‌కంగా త‌మ సొంత జిల్లా కు చెందిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై ప్ర‌జ‌ల ధిక్క‌ర‌ణ స్వ‌ర‌మ‌నే అభిప్రాయాలు ఇప్పుడు స‌ర్వ‌త్రా వ్యక్త‌మ‌వుతున్నాయి. జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌కJagan mohan Reddy{#}Ishtam;Jammalamadugu;Gandikota;CM;Y. S. Rajasekhara Reddy;Districtజ‌గ‌న్‌కు సొంత జిల్లాలో బిగ్ షాక్‌...!జ‌గ‌న్‌కు సొంత జిల్లాలో బిగ్ షాక్‌...!Jagan mohan Reddy{#}Ishtam;Jammalamadugu;Gandikota;CM;Y. S. Rajasekhara Reddy;DistrictSat, 06 Nov 2021 10:08:31 GMTవైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు సొంత జిల్లా లో బిగ్ షాక్ త‌గిలింది. త‌మ మాట‌కు విలువ ఇవ్వ‌కుండా.. ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌ల షెడ్యూల్ ఇవ్వ‌డాన్ని వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని రెండు గ్రామాల‌ ప్ర‌జ‌లు స‌హించ లేక పోతున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ ఆగ్ర‌హాన్ని ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌తో ప్రభుత్వానికి చాటి చెప్పారు. ఇది ఒక ర‌కంగా త‌మ సొంత జిల్లా కు చెందిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై ప్ర‌జ‌ల ధిక్క‌ర‌ణ స్వ‌ర‌మ‌నే అభిప్రాయాలు ఇప్పుడు స‌ర్వ‌త్రా వ్యక్త‌మ‌వుతున్నాయి.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం కొండాపురం మండ‌లంలోని ఓబ‌న్న‌పేట‌, సుగుమంచిప‌ల్లె-1, సుగుమంచిప‌ల్లె-2, సుగుమంచిప‌ల్లె గ్రామ స‌ర్పంచితో పాటు 14 వార్డుల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ నోటిఫికేష‌న్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇవ‌న్నీ కూడా గండికోట జ‌లాశయం ముంపు ప‌రివాహ‌కంలో ఉండే ప్రాంతాలు. అయితే ఇప్పుడు ఇక్క‌డ ఎన్నిక‌లు పెట్టాల‌నుకుంటున్నా కూడా ఈ ఎన్నిక‌ల్లో పాల్గొనేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు.

త‌మ‌కు ఇష్టం లేక‌పోయినా కూడా త‌మ పంచాయ‌తీ ల‌ను ప్ర‌భుత్వం విలీనం చేసింద‌న్న కోపం వారిలో ఉంది. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా లోనే ఈ విధ‌మైన నిర‌స‌న రావ‌డం విచిత్ర‌మే అనుకోవాలి. నిన్న ఐదు గంట‌ల‌కు నామినేష‌న్ల తుది గ‌డువు.. అయినా కూడా ఏ ఒక్క‌రు ఇక్క‌డ నామినేష‌న్లు వేసేందుకు ముందుకు రావ‌డం లేదు.  గ‌తంలో ఓ సారి ఈ గ్రామాల ప్ర‌జ‌లు ఎన్నిక‌ల‌ను బహిష్క‌రించారు. అయినా ప్ర‌భుత్వం త‌మ‌కు న్యాయం చేయ‌లేద‌న్న ఆవేద‌న ఇక్క‌డ ప్ర‌జ‌ల్లో ఉంది.

ఇక ఇప్పుడు మ‌రోసారి నామినేషన్లు వేయ‌క పోవ‌డంతో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం చోద్యం చూడ‌డం త‌ప్పా చేసేదేం లేకుండా పోయింది. ఏదేమైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జాభిప్రాయానికి విరుద్ధంగా చాలా నిర్ణ‌యాలు  తీసుకుంటుంద‌న్న టాక్ ఉంది. అలా జ‌రిగితే ఏమ‌వుతుందో ఇప్పుడు ఆయ న సొంత జిల్లా ప్ర‌జ‌లే ఆయ‌న‌కు చెప్ప‌క‌నే చెప్పారు.

 



యాత్రకు నాలుగేళ్లు : ఉత్తరాంధ్రుల దీవెన రా ఇది!

ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?

న‌వంబ‌ర్ 9న‌ మరో అల్పపీడనం

వారెవా: ఆ ఒక్క మాత్రతో కరోనాకు చెక్..?

యాత్రకు నాలుగేళ్లు : జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన జగన్..!

పెట్రో వాత: ఈ రాష్ట్రాలు గ్రేట్.. వ్యాట్ తగ్గించాయి!

జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !

యాత్రకు నాలుగేళ్లు : వెలుగు నింపిన అడుగుజాడలు.. ?

యాత్రకు నాలుగేళ్లు: నవరత్నాలకు బీజం అప్పుడే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>