PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-62b327e9-f60d-4dde-bb89-81a4282dca5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-62b327e9-f60d-4dde-bb89-81a4282dca5e-415x250-IndiaHerald.jpgవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు. ఆనాడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పాదయాత్ర ద్వారా ప్రజలలో కలిసిపోయిన తరువాతే బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నారు. జగన్ కూడా అదే బాట పట్టారు. పాదయాత్ర సంకల్పం చేసిన తరువాత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లగలిగారు అంటే అందుకు ప్రజల ఆదరాభిమానాలే కారణం. వాళ్ళు ఈ ఇద్దరు ఎక్కడకు వెళ్లినా సాదరంగా స్వాగతం పలికారు. అంతటితో వారిలో కూడా ఉత్సాహం రెట్టించిందేమో శారీరిక బడాలికను కూడా లెక్కచేయకుండా అనుకున్న దానికంటే ఎన్నో రేట్లు పాదయాతys-jagan;{#}politics;Jagan;Fatherజగన్ పాదయాత్ర : ప్రజాస్పందన.. ఉత్సాహాన్ని ఇచ్చేసింది..!జగన్ పాదయాత్ర : ప్రజాస్పందన.. ఉత్సాహాన్ని ఇచ్చేసింది..!ys-jagan;{#}politics;Jagan;FatherSat, 06 Nov 2021 17:53:17 GMTవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు. ఆనాడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పాదయాత్ర ద్వారా ప్రజలలో కలిసిపోయిన తరువాతే బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నారు. జగన్ కూడా అదే బాట పట్టారు. పాదయాత్ర సంకల్పం చేసిన తరువాత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లగలిగారు అంటే అందుకు ప్రజల ఆదరాభిమానాలే కారణం. వాళ్ళు ఈ ఇద్దరు ఎక్కడకు వెళ్లినా సాదరంగా స్వాగతం పలికారు. అంతటితో వారిలో కూడా ఉత్సాహం రెట్టించిందేమో శారీరిక బడాలికను కూడా లెక్కచేయకుండా అనుకున్న దానికంటే ఎన్నో రేట్లు పాదయాత్ర సాగించారు. జగన్ అయితే ముందు పాదయాత్రను ఆరునెలలు అనుకున్నప్పటికీ, ప్రజాధారణ చుసిన తరువాత ప్రతి చోట కాస్త వాళ్ళతో ఎక్కువ సమయం గడపడం మొదలు పెట్టారు. ఆవిధంగా కూడా వారిలో త్వరగా కలిసిపోయారు.

ప్రజలు కూడా జగన్ ను నిండు మనసుతో ఆదరిస్తూ ఉండటంతో ఆయన పాదయాత్ర ఆరు నెలలు కాదు రెండేళ్లు సాగింది. ఇదంతా కేవలం ప్రజాదరణ వలన సాగింది తప్ప, అంత కాలం పాదయాత్ర అంత సులభం కూడా కానిపని. నేతకు ఉత్సాహం వచ్చేది ప్రజల ఆదరాభిమానాలు లభించినప్పుడే, అది నాటి రాజశేఖరుడికి లభించింది, మళ్ళీ పాదయాత్ర ద్వారా అంతటి ప్రేమాభిమానాలు జగన్ చవిచూడగలిగాడు. అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అతీగతీ లేని రాజకీయాలు కాకుండా ప్రజాసేవ మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు అడుగులు వేశారు. ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ వాళ్ళ స్థితిగతులు తెలుసుకుందాం అనుకున్న నేతలకు ఒక్కోసారి అభిమానం లభిస్తుంది, దానిని సరిగ్గా అర్ధం చేసుకున్న వారు నిజమైన నాయకుడు అవుతారు.

నేటి ప్రభుత్వంలో జగన్ అదే నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ తన సేనతో కలిసి ప్రజలకు నిరంతరం సేవలు చేస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది ఎంతో ఆహ్వానించదగిన విషయం. స్వచ్ఛమైన రాజకీయాలను జగన్ మరోసారి ప్రజలకు రుచిచూపించారు. ఇలాంటి నేతలు దొరికినప్పుడు ప్రజలు కూడా తన నేత కోసం ఎంతవరకైనా వెళ్ళగలరు అనేది కూడా ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలలో నిరూపితం చేయబడింది.



బాల‌కృష్ణ‌తో ఆహాకు ఎంత లాభం అంటే..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?

ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!

చిరంజీవి సినిమా ఓపెనింగ్‌లో ఐదుగురు ద‌ర్శ‌కులు సంద‌డి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>