Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/head-ech1dcb0bfb-1045-4f9b-ad24-e7eced0db275-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/head-ech1dcb0bfb-1045-4f9b-ad24-e7eced0db275-415x250-IndiaHerald.jpgఏంటి సమాజం తీరు.. ఎటు పోతుంది మనిషి ఆలోచన తీరు.. నాగరిక సమాజం లోకి అడుగుపెడుతున్న మనిషి ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని కూడా ఆలోచించలేక పోతున్నాడు. చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనిషి ఏకంగా ప్రాణాలకే విలువ ఇవ్వడం లేదు నేటి రోజుల్లో. కొంతమంది నేటి రోజుల్లో దారుణంగా హత్యకు పాల్పడుతూ ప్రాణాలు తోడేస్తుంటే.. మరికొంతమంది చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వెరసి దేవుడిచ్చిన ఎంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిHead ech{#}sujatha;Sangareddy;Patancheru;mandalam;Wife;police;Districtషాకింగ్ : తల నొప్పి వచ్చిందని.. ప్రాణం తీసుకున్న మహిళ?షాకింగ్ : తల నొప్పి వచ్చిందని.. ప్రాణం తీసుకున్న మహిళ?Head ech{#}sujatha;Sangareddy;Patancheru;mandalam;Wife;police;DistrictSat, 06 Nov 2021 15:30:00 GMTఏంటి సమాజం తీరు.. ఎటు పోతుంది మనిషి ఆలోచన తీరు.. నాగరిక సమాజం లోకి అడుగుపెడుతున్న మనిషి ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని కూడా ఆలోచించలేక పోతున్నాడు. చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి గురవుతూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  మనిషి ఏకంగా ప్రాణాలకే విలువ ఇవ్వడం లేదు నేటి రోజుల్లో. కొంతమంది నేటి రోజుల్లో దారుణంగా హత్యకు పాల్పడుతూ ప్రాణాలు తోడేస్తుంటే.. మరికొంతమంది చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
 వెరసి దేవుడిచ్చిన ఎంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.


 ముఖ్యంగా నేటి రోజుల్లో అయితే ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతూ వస్తోంది. చిన్నపాటి కారణాలుతో మనస్తాపం చెంది ఇక అక్కడితో జీవితం అయిపోయింది అని భావిస్తూ ఎంతోమంది అర్ధాంతరంగా నిండు నూరేళ్ల జీవితాన్ని ముగిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. సాధారణంగా తలనొప్పి వస్తే ఏం చేస్తారు జండూబామ్ లాంటిది రాసుకుంటారు లేదా టాబ్లెట్ వేసుకుంటారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా తల నొప్పి వచ్చింది అన్న కారణంతో ప్రాణాలను తీసుకుంది.



 ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లో వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం బుక్కారానికి  చెందిన గోపాల్ భార్య సుజాత తో కలిసి పటాన్చెరు లోని రుద్రారం లో నివసిస్తున్నారు. అయితే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు భార్యాభర్తలు. అయితే భార్య సుజాతకు మెడ నరాల నొప్పి వల్ల తరచూ తలనొప్పితో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. దీంతో తట్టుకోలేకపోయిన సుజాత ఏకంగా గీతం కళాశాల పరిసరాలలో ఉన్న క్వారి కుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!

చిరంజీవి సినిమా ఓపెనింగ్‌లో ఐదుగురు ద‌ర్శ‌కులు సంద‌డి

కోచ్ మృతి.. విషాదంలో పంత్?

చంద్ర‌బాబుకు మ‌రో `ఛాన్స్‌` మ‌ళ్లీ క‌లేనా..?

ప్రజల్లో మార్పే లక్ష్యంగా వచ్చిన పొలిటికల్ మూవీస్ ఇవే?

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?

బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ చీలిక, ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>