PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs2db495a2-1ac1-4f30-8a39-6e3f1ce34a4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs2db495a2-1ac1-4f30-8a39-6e3f1ce34a4c-415x250-IndiaHerald.jpgగులాబీ దండుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వ‌చ్చింది. తెలంగాణ జాగృతికి చెందిన నేత‌లు దానిని సామాజిక మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేశారు. ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీల భ‌ర్తీ ఇవాళ్టికి ఓ కొలిక్కి వ‌చ్చింది. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత రాదు రాదు అనుకున్న ప‌ద‌వి కౌశిక్ రెడ్డిని వ‌రించింది. ఎమ్మెల్సీగా ఆయ‌న పేరు ఖ‌రారు అయింది. ఆ కోవ‌లో ఆ తోవ‌లో టీడీపీ నుంచి కేసీఆర్ పై గంపెడు ఆశ‌లతో వ‌చ్చిన ఎల్.ర‌మ‌ణ‌కు కూడా ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న కూడా పెద్ద‌ల స‌భ‌కు పోనున్నారు అని తేలిపోయింది. బీసీ నేtrs{#}kaushik;Service;March;Backward Classes;raj;TDP;Governor;KCR;Reddy;Telangana;Huzurabadటీఆర్ఎస్ ఎమ్మెల్సీ : ఇంటి పార్టీకి పెద్దలు వీరేనా?టీఆర్ఎస్ ఎమ్మెల్సీ : ఇంటి పార్టీకి పెద్దలు వీరేనా?trs{#}kaushik;Service;March;Backward Classes;raj;TDP;Governor;KCR;Reddy;Telangana;HuzurabadSat, 06 Nov 2021 21:09:00 GMTమొత్తానికి అనుకున్న‌ది సాధించాడు కౌశిక్ రెడ్డి. హుజురాబాద్ ఫ‌లితం ఎలా ఉన్నా కూడా ఆయ‌న‌కు కేసీఆర్ ఇచ్చిన మాట మాత్రం నిల‌బెట్టుకున్నాడు. అంతేకాదు బీసీల‌కూ మంచి ప్రాధాన్య‌మే ఇస్తూ ప‌ద‌వులు కేటాయించాడు. పెద్ద‌ల స‌భ అన‌గా శాస‌న మండ‌లికి పంపే పేర్ల‌ను ఆయ‌న ఖ‌రారు చేసి దీపావ‌ళి కానుక‌ను కాస్త ఆల‌స్యంగానే ఇచ్చాడు ఆ ఆరుగురికి.. ఇంత‌కూ వారెవరంటే?


గులాబీ దండుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వ‌చ్చింది. తెలంగాణ జాగృతికి చెందిన నేత‌లు దానిని సామాజిక మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేశారు. ఎప్ప‌టి నుంచో పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీల భ‌ర్తీ ఇవాళ్టికి ఓ కొలిక్కి వ‌చ్చింది. హుజురాబాద్ ఎన్నిక‌ల త‌రువాత రాదు రాదు అనుకున్న ప‌ద‌వి కౌశిక్ రెడ్డిని వ‌రించింది. ఎమ్మెల్సీగా ఆయ‌న పేరు ఖ‌రారు అయింది. ఆ కోవ‌లో ఆ తోవ‌లో టీడీపీ నుంచి కేసీఆర్ పై గంపెడు ఆశ‌లతో వ‌చ్చిన ఎల్.ర‌మ‌ణ‌కు కూడా ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న కూడా పెద్ద‌ల స‌భ‌కు పోనున్నారు అని తేలిపోయింది.  బీసీ నేతగా గుర్తింపు ఉన్న ఎల్.ర‌మ‌ణ‌కు ప‌ద‌వి లాంఛ‌న‌మే అయింది. ఇదే కోవ‌లో క‌డియం శ్రీ‌హ‌రి, మాజీ స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి, ర‌వీంద‌ర్ రావు ఎమ్మెల్సీలుగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌నున్నారు అని తేలిపోయింది.
 

గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ఖ‌రార‌యింది. అయితే దీనిపై తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ఏమంటారో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం. ఎందుకంటే ఇప్ప‌టికే కౌశిక్ రెడ్డి పేరును గ‌వ‌ర్న‌ర్ కోటాలో పంపి భంగ‌ప‌డ్డ కేసీఆర్ ఈ సారి పేరు మార్చి ఫైలును రాజ్ భ‌వ‌న్ కు పం పారు. అయితే గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కూడా స‌మాజ సేవ చేసిన వాడో, క‌ళా సాంస్కృతిక రంగాల‌కు విశిష్ట సేవ‌లు అందించిన‌వా డో కాదు క‌దా! ఆ విధంగా జీవితాన్ని అంకింతం చేసిన వాడు కాదు క‌దా! మ‌రి! ఆయ‌న‌కు ప‌ద‌వి ఖ‌రారు అవుతుందా లేదా ? అన్న‌ది తేలాలిక. ఎందుకంటే గ‌తంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై త‌న ప‌దవిని రెండేళ్ల పాటు నిర్విరామంగా పూర్తి చేసిన సంద‌ర్భంగా చెప్పిన మాట‌లే కీల‌కం. స‌మాజ సేవ చేస్తే వారికి గ‌వ‌ర్న‌ర్ కోటాలో పెద్ద‌ల స‌భ‌కు పంపొచ్చ‌ని లేదంటే ఎందుకు పంప‌డం అని ఓ ఆస‌క్తిదాయ‌క వ్యాఖ్య చేసి విలేక‌రుల‌నూ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఈ దారిలో గుత్తా కూడా ఉండ‌రు క‌దా! ఇప్పుడెలా చెప్మా!





ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోట...!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>