PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/-ys-jagandc41e06c-d0a3-45b7-ba94-3dead9e1e63b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/-ys-jagandc41e06c-d0a3-45b7-ba94-3dead9e1e63b-415x250-IndiaHerald.jpgప్రభుత్వం అంటే ఏమిటి ? పాలకులంటే ఎవరు ? ప్రజల చేత ఎన్నిక కాబడిన నేతలు ఏం చేయాలి ? ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు పరిష్కరించాలి. ఆంధ్ర ప్రదేశ్ లో అలా జరుగుతోందా . లేదే. మరేం చేయాలి ? ప్రభుత్వాన్ని నిలదీయాలి . ప్రజల ముందుకు ప్రభుత్వాన్ని తీసుకు రావాలి. వారి సమస్యలకు పరిష్కారం జరిగేలా చూడాలి. ఇదీ జననేత గా పేరు తెచ్చుకున్న వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుబ సభ్యుల మనోగతం. ys-jagan{#}dr rajasekhar;polavaram;Polavaram Project;Letter;Bharatiya Janata Party;Assembly;central government;Yevaru;Telugu Desam Party;Congress;Telangana Chief Minister;Party;Government;Jagan;Andhra Pradeshయాత్రకు నాలుగేళ్లు : ప్రభుత్వ లోపాలను ప్రజల ముందుకు తెచ్చారుయాత్రకు నాలుగేళ్లు : ప్రభుత్వ లోపాలను ప్రజల ముందుకు తెచ్చారుys-jagan{#}dr rajasekhar;polavaram;Polavaram Project;Letter;Bharatiya Janata Party;Assembly;central government;Yevaru;Telugu Desam Party;Congress;Telangana Chief Minister;Party;Government;Jagan;Andhra PradeshSat, 06 Nov 2021 07:05:32 GMT
ప్రభుత్వం అంటే ఏమిటి ? పాలకులంటే ఎవరు ? ప్రజల చేత ఎన్నిక కాబడిన నేతలు ఏం చేయాలి ? ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలు పరిష్కరించాలి. ఆంధ్ర ప్రదేశ్ లో అలా జరుగుతోందా . లేదే. మరేం చేయాలి ? ప్రభుత్వాన్ని నిలదీయాలి . ప్రజల ముందుకు ప్రభుత్వాన్ని తీసుకు రావాలి. వారి సమస్యలకు పరిష్కారం జరిగేలా చూడాలి. ఇదీ జననేత గా పేరు తెచ్చుకున్న వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుబ సభ్యుల మనోగతం. ఆ కుటుంబంతో మమేకమైన వై.ఎస్.ఆర్ సిపి శాసన సభ్యుల ఆలోచనల అంతరంగం.

2014 శాసన సభ ఎన్నికల్లో  67 స్థానాల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆ పార్టీ శాసన సభ్యులు  ప్రతిక్షణం అధికార పక్ష నేతలనుంచి వేధింపులు ఎదుర్కోన్నారు.  నాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా ప్రజా సమస్యలను సభ దృష్టికి, తద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సంకల్పించారు. ఫలితం శూన్యం. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన నిధులపై లెక్కలు అడిగింది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది ? అంటూ పలు మార్లు ప్రశ్నించింది.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఈ విషయమై ఎవరికి కూడా చీమకుట్టినంత స్పందన కూడా లేదు.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ఎగుడు దిగుడుగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రికి చాలా సార్లు లేఖ రాసింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పలేక పోయారు. కీలకమైన ప్రాజెక్టు విషయంలో నాటి ప్రతిపక్షనేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ పార్టీ శాసన సభ్యుల గోడు వినేవారు కరవయ్యారు. కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం రాష్ట్రానికే తలవంపులు తెచ్చింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఎలాంటి చలనమూ లేదు. ప్రభుత్వంలో ఏరులై పారుతున్న అవినీతి ఇక చెప్పనక్కర లేదన్నంతా ఉంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తానన్న రుణ మాఫీ హామీ ఉసే లేకుండా పోయింది. దీంతో గ్రామ గ్రామాన ప్రజలు నిరసన తెలిపారు. 'నిన్ను నమ్మం బాబూ' అంటూ నిరస తెలిపారు ఈ కార్యక్రమానికి వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ప్రజల ముందు వివరించాల్సిన పరిస్థితి ప్రజల చేత ఎన్నుకోబడిన నేతగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పైపడింది. దీంతో ఆయన ప్రజా సంకల్పాన్ని తెలుసుకునేందుకు మరోసారి జనం ముందుకు వచ్చారు . ప్రభుత్వ లోపాలను ప్రజల ముందుంచారు.



యాత్రకు నాలుగేళ్లు : ప్రభుత్వ లోపాలను ప్రజల ముందుకు తెచ్చారు

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>