PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-0129f0e1-adf2-415e-89f2-5b47be404446-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-0129f0e1-adf2-415e-89f2-5b47be404446-415x250-IndiaHerald.jpgఎప్పుడైనా నాయకుడికి ప్రజల అండదండలు తోడైతే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. ఈ విషయం వైసీపీ అధినేత జగన్ విషయంలో నిరూపణ అయ్యింది. నేటికీ ఆయన పాదయాత్ర చేసి నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి దాని వలన పొందిన ఉత్సాహాన్ని ఆ పార్టీ నేతలు ఎవరూ మరిచిపోలేదు. జనంలోకి వెళ్లిన నేతకు ప్రజల నుండి వచ్చే స్పందన చూస్తేనే చాలు గెలిచినంత ఆనందం వచ్చేస్తుంది. అయితే ఇది అందరికి దక్కవచ్చు అనుకుంటే పొరపాటే. ఎక్కడో ఉంటారు కొందరు, పెద్ద ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, మళ్ళీ జగన్ కు ఆ అవకాశం దక్కింది. అందుకే పాదయాత్ర ప్రారంభys-jagan;{#}Yatra;YCP;Coronavirus;Party;Jagan;Anandamజగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!ys-jagan;{#}Yatra;YCP;Coronavirus;Party;Jagan;AnandamSat, 06 Nov 2021 18:07:55 GMTఎప్పుడైనా నాయకుడికి ప్రజల అండదండలు తోడైతే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. ఈ విషయం వైసీపీ అధినేత జగన్ విషయంలో నిరూపణ అయ్యింది. నేటికీ ఆయన పాదయాత్ర చేసి నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి దాని వలన పొందిన ఉత్సాహాన్ని ఆ పార్టీ నేతలు ఎవరూ మరిచిపోలేదు. జనంలోకి వెళ్లిన నేతకు ప్రజల నుండి వచ్చే స్పందన చూస్తేనే చాలు గెలిచినంత ఆనందం వచ్చేస్తుంది. అయితే ఇది అందరికి దక్కవచ్చు అనుకుంటే పొరపాటే. ఎక్కడో ఉంటారు కొందరు, పెద్ద ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, మళ్ళీ జగన్ కు ఆ అవకాశం దక్కింది. అందుకే పాదయాత్ర ప్రారంభించినప్పుడు జగన్ ఆరు నెలలు అనుకున్నప్పటికీ అది కాస్త రెండేళ్లు పట్టేసింది. యాత్ర లో అడుగడుగునా ప్రజల ప్రేమాభిమానాలు చూసి ముగ్ధుడైన జగన్ వారితో కాసేపు సమయం గడపడం ద్వారా వివరంగా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు.

తద్వారా అందరి సమస్యలను పార్టీ అధికారంలోకి వస్తే తీర్చితీరుతాను అని మాట కూడా ఇస్తూ వచ్చారు. పాదయాత్ర ఆద్యంతం బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలలో కూడా ఇదే తరహా వాతావరణం ఉండటంతో, సమస్యలకు పరిష్కారాలను కూడా అక్కడే చర్చించడం వీలైంది. దీనితో అక్కడికక్కడే నేతపై ప్రజలలో ఆయా వర్గాలలో నమ్మకం ఏర్పడింది. సమస్య ఎలా పరిష్కారం అవుతుందో కూడా ప్రజలకు తెలిసిపోవడంతో వాళ్ళు కూడా జగన్ ను గెలిపిస్తే మన సమస్యలు తీరిపోగలవు అని నమ్మేశారు. అదే ఎన్నికల సమయంలో ఓటుగా మారిపోయింది. జగన్ పార్టీ 2019లో భారీ మెజారిటీతో గెలిచింది. గెలిచింది మొదలు విశ్రాంతి తీసుకోకుండా ప్రజల కు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికే తాపత్రయపడ్డాడు జగన్.

తమ కోసం జగన్ చేస్తున్నవి ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. తాను స్వయంగా పాదయాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్లడమే కాకుండా పధకాలను కూడా ఇంటికే చేరుస్తున్న జగన్ పై ప్రజలలో విశ్వాసం రెట్టింపైంది. మంచిపనులకు ఆటంకాలు ఎక్కువ అన్న చందాన కరోనా వచ్చేసింది. అయినా తడబడకుండా, ఎందరో అనుభవం ఉన్న నేతల కంటే గొప్పగా ఆలోచిస్తూ పరిపాలన జరిపారు జగన్.



ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?

ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>