PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-jagan59ac2893-f5f1-4fec-b65c-368739687e8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-jagan59ac2893-f5f1-4fec-b65c-368739687e8a-415x250-IndiaHerald.jpgసరిగ్గా నాలుగేళ్ల క్రితం. 2017 నవంబర్ 6న ప్రజా సంకల్పం మొదలైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను అది ముఖ్యమంత్రి పీఠం వరకు చేర్చగలిగింది. మొత్తం 3648 కిలోమీటర్లు 341 రోజుల పాదయాత్ర.. అలుపెరగకుండా చేసిన ఈ మహా యాత్రకు అంతిమ ఫలితం లభించింది. జగన్ కల ఫలించింది. తండ్రి చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని తాను కొనసాగిస్తానంటూ అధికారంలోకి వచ్చారు జగన్. 2014లో ఏ ప్రజలైతే జగన్ ను పూర్తిగా నమ్మలేదో, అదే ప్రజలు.. 2019లో ఆయనకి 151 సీట్ల మెజార్టీ ఇచ్చారు. చరిత్రలోనే మరచిపోలేని విజయాన్ని అందించారు. ys-jagan{#}Maha;CM;YCP;Father;November;Telangana Chief Minister;Yatra;Jaganయాత్రకు నాలుగేళ్లు: జగన్ లో స్పష్టమైన మార్పులుయాత్రకు నాలుగేళ్లు: జగన్ లో స్పష్టమైన మార్పులుys-jagan{#}Maha;CM;YCP;Father;November;Telangana Chief Minister;Yatra;JaganSat, 06 Nov 2021 07:19:45 GMTసరిగ్గా నాలుగేళ్ల క్రితం. 2017 నవంబర్ 6న ప్రజా సంకల్పం మొదలైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ను అది ముఖ్యమంత్రి పీఠం వరకు చేర్చగలిగింది. మొత్తం 3648 కిలోమీటర్లు 341 రోజుల పాదయాత్ర.. అలుపెరగకుండా చేసిన ఈ మహా యాత్రకు అంతిమ ఫలితం లభించింది. జగన్ కల ఫలించింది. తండ్రి చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని తాను కొనసాగిస్తానంటూ అధికారంలోకి వచ్చారు జగన్. 2014లో ఏ ప్రజలైతే జగన్ ను పూర్తిగా నమ్మలేదో, అదే ప్రజలు.. 2019లో ఆయనకి 151 సీట్ల మెజార్టీ ఇచ్చారు. చరిత్రలోనే మరచిపోలేని విజయాన్ని అందించారు.

యాత్రకు నాలుగేళ్లు పూర్తయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. జగన్ లో మార్పులేమైనా వచ్చాయా..? అప్పుడు యాత్ర వల్ల ఆయనలో చాలా మార్పులొచ్చాయి, మరి యాత్ర అయిపోయిన తర్వాత, సీఎం అయిన తర్వాత జగన్ ఏమైనా మారారా..? ఆ మార్పు మంచికేనా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

అందరివాడు కాస్తా అందనివాడుగా మారిపోయారా..?
ప్రజా సంకల్ప యాత్రలో సామాన్య ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జగన్ ని కలిశారు. వైసీపీలో చేరాలనుకున్నవారు చేరిపోయారు, టికెట్లు ఆశించిన ఆశావహులంతా మంది మార్బలంతో ఆయన వెంట నడిచారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించారు జగన్. మరిప్పుడు ఆయన అపాయింట్ మెంట్ ఎంతమందికి దొరుకుతోంది. కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలయినా చొరవగా జగన్ వద్దకు వెళ్లగలుగుతున్నారా..? ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్ వేరు, సీఎం గా నిత్యం బిజీ షెడ్యూల్ తో ఉండే జగన్ వేరు. అయితే ఇప్పుడు కూడా ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు కొంత సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతిపక్షనేతగా తానేం చేయదలచుకున్నారో జగన్ జనానికి చెప్పారు, వారి కష్టాలు విన్నారు. ఇప్పుడు పాలన ఎలా ఉందో తెలుసుకుని, మెరుగు పరుచుకోడానికి ఏం చేయాలనేదానిపై కూడా కసరత్తు చేయాల్సి ఉంది. రెండున్నరేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జగన్ మరోసారి ప్రజల వద్దకు వెళ్లాలని అనుకుంటున్నట్టు వైసీపీ వర్గాలంటున్నాయి. రచ్చబండతో దానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నా ఎందుకో వాయిదా పడుతూ వస్తోంది. ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అయినా.. జగన్ మరో సంకల్పాన్ని ప్రకటిస్తారేమో చూడాలి.



యాత్రకు నాలుగేళ్లు: జగన్ లో స్పష్టమైన మార్పులు

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>