PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/--------------9533f6c7-60be-4e0a-b794-cae5332f4a2e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/--------------9533f6c7-60be-4e0a-b794-cae5332f4a2e-415x250-IndiaHerald.jpgసీఎల్పీలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్‌, న‌ల్ల‌గొండ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి శ‌నివారం భేటీ అయ్యారు. చాలా రోజుల త‌రువాత కోమ‌టిరెడ్డి సీఎల్పీలో వీహెచ్ ను భేటీ కావ‌డంతో కాంగ్రెస్‌లో ఆస‌క్తిక‌రం నెల‌కొంది. కాంగ్రెస్ కొత్త చీఫ్ గా రేవంత్‌రెడ్డి వ‌చ్చిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు కోమ‌టిరెడ్డి గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌లేదు. గ‌తంలోనే కోమ‌టిరెడ్డి గాంధీ భ‌వ‌న్ మెట్లు ఎక్క‌న‌ని ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలోనే కోమటిరెడ్డి తో మాట్లాడే బాధ్యత నాకు అప్పగించారని వీహెచ్ తెలిపారు. వీహెచ్‌, కోమ‌టిర#వీహెచ్‌; కోమ‌టిరెడ్డి భేటీ{#}SoniaGandhi;Revanth Reddy;Sri Venkateswara swamy;V Hanumantharao;Kamareddy;MP;festival;Mohandas Karamchand Gandhi;Party;Government;District;Congress;Reddy;CM;mediaసీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?#వీహెచ్‌; కోమ‌టిరెడ్డి భేటీ{#}SoniaGandhi;Revanth Reddy;Sri Venkateswara swamy;V Hanumantharao;Kamareddy;MP;festival;Mohandas Karamchand Gandhi;Party;Government;District;Congress;Reddy;CM;mediaSat, 06 Nov 2021 13:40:33 GMTసీఎల్పీలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్‌, న‌ల్ల‌గొండ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి శ‌నివారం భేటీ అయ్యారు. చాలా రోజుల త‌రువాత కోమ‌టిరెడ్డి సీఎల్పీలో వీహెచ్ ను భేటీ కావ‌డంతో కాంగ్రెస్‌లో ఆస‌క్తిక‌రం నెల‌కొంది.  కాంగ్రెస్ కొత్త చీఫ్ గా  రేవంత్‌రెడ్డి  వ‌చ్చిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు కోమ‌టిరెడ్డి గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌లేదు. గ‌తంలోనే కోమ‌టిరెడ్డి గాంధీ భ‌వ‌న్ మెట్లు ఎక్క‌న‌ని ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలోనే కోమటిరెడ్డి తో మాట్లాడే బాధ్యత నాకు అప్పగించారని వీహెచ్ తెలిపారు.

వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీలో ఎంపీ వెంక‌ట్ రెడ్డి మాట్లాడారు.  ధాన్యం కొనకపోతే అనారోగ్యం తో వెంకన్న అనే రైతు చనిపోయాడని పేర్కొన్నారు. టోకెన్ల కోసం న‌ల్ల‌గొండ‌ జిల్లాలో బార్లు తిరుగుతున్నారు. ప్ర‌తీరోజు  అధికారులతో మాట్లాడితే కూడా ఫలితం లేకుండా పోతుంది. సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్‌లో ఓడిపోయాం అనే బాధ ఉండ‌వ‌చ్చు. దాదాపు వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేసినా గెల‌వ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితిలో ఎవ‌రూ  ఓడిపోయినా..  బాధ అనేది ఎవ‌రికైనా కామ‌న్‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. దీపావ‌ళి పండుగ రోజునే రైతు చ‌నిపోయాడు. క‌నీసం రైతుల బాధ‌ల‌ను పట్టించుకోండి అని కోరారు.

ప్ర‌స్తుతం ఎన్నిక‌లు లేవు కాబ‌ట్టి రాజ‌కీయాలు మ‌ర‌చిపోదాం.  ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం 750 బోనస్, 2000 మద్దతు ధర ఇస్తుంది అని వెల్ల‌డించారు. ఆ రాష్ట్రాన్ని చూసి మ‌నం నేర్చుకోవాల‌ని తెలిపారు. దేశ భ‌విష్య‌త్ రైతు మీద‌నే ఉంటుంద‌ని, ఆ రైతు తిర‌గ‌బ‌డితే దేశం గ‌డ‌గ‌డ‌లాడుతుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల‌ను పెంచాల‌ని, ప్ర‌స్తుతం ఎల్లారెడ్డి గూడం వెళ్లున్నా. వేల మంది అక్క‌డ రోడ్ల మీద నిల‌బ‌డ్డారు. ఇది పొలిక‌ల్ కార్య‌క్ర‌మం అస‌లు కాదు. రైతుల కోసం నేను వెళ్లుతున్నాను. నా వెంట కార్లు కానీ ఎలాంటి హంగామా లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అదేవిధంగా సోనియా గాంధీ తెలంగాణ‌ను ఇచ్చిన‌ దేవ‌త అని,  మా దాంట్లోనే  కొంద‌రూ ద‌య్యం అని పేర్కొన్న‌ట్టు గుర్తుచేశారు. ఇప్ప‌టికే  పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉన్నారు. ఈ భేటీతో  కోమ‌టిరెడ్డి పార్టీ కార్య‌క‌మాల్లో చురుకుగా పాల్గొనేట‌ట్టు క‌నిపిస్తున్న‌ది. భేటీలో మీడియా ఉండ‌డంతో వారిద్ద‌రూ ర‌హ‌స్యంగా మ‌ర‌ల భేటీ కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ భేటీలో ఏ అంశాల‌ను ప్ర‌తిపాదించాలి. కోమ‌టిరెడ్డి ఏమి డిమాండ్ చేస్తున్నార‌నే అంశంపై చ‌ర్చ జ‌రిగింది. పార్టీకీ దూరంగా ఉండ‌డం మంచిది కాదు. అంద‌రూ క‌లిసి ప‌ని చేయాల‌ని వీహెచ్ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డికి సూచించారు.

వీహెచ్‌, కోమ‌టిరెడ్డి  ఇద్ద‌రు క‌లిసిన త‌రువాత  కామారెడ్డి రైతుల‌కు సంబంధించిన రైతుల‌ను ప‌రామ‌ర్శించడానికి వెళ్ల‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు కోమ‌టిరెడ్డి.  రైతుల‌కు సంబంధించిన అంశాల‌పై జాతీయ ర‌హ‌దారుల దిగ్భందం చేస్తాం అని కోమ‌టిరెడ్డి పేర్కొన్నారు. ఇది కేవ‌లం న‌ల్ల‌గొండ జిల్లా వ‌ర‌కు చేస్తారా లేక రాష్ట్రవ్యాప్తంగా అన్న‌ది   ఆస‌క్తి  నెల‌కొంది.





బ్రేకింగ్: కరెంట్ బిల్లులు భారీగా తగ్గుతాయా...? స్టడీస్ ఏం అంటున్నాయి...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు

ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకున్న మారుతి..!

యాత్రకు నాలుగేళ్లు: జ‌గ‌న్‌.. అడ్డ‌గోలుగా సీఎం అవ్వాల‌నుకోలేదు..!

బ్యాగ్ సర్దుకుని ఇంటికి పోవడమే : రవీంద్ర జడేజా

అలా అయితే బ్యాగ్ సర్దుకోవడమే..! వెల్లడించిన జడేజా

కేవలం రూ.10 కే ఏడాది పాటు ఓపీ సేవ‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>