PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kotla5448839c-19ee-41d6-9062-33b7558d4294-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kotla5448839c-19ee-41d6-9062-33b7558d4294-415x250-IndiaHerald.jpgకర్నూలు జిల్లాలో జరగనున్న బేతంచెర్ల మున్సిపాలిటీ ఎన్నిక... జిల్లా ప్రజలు దృష్టిని ఆకర్షిస్తుంది. కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఈ మున్సిపాలిటీలో గెలవాలని అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మామూలుగా అయితే జిల్లాలో టీడీపీకి పెద్ద స్కోప్ లేదని చెప్పి, ఆ పార్టీ శ్రేణులు లైట్ తీసుకునేవారు. కానీ ఒకటే మున్సిపాలిటీ కాబట్టి జిల్లా నాయకులు...బేతంచెర్లపై దృష్టి పెట్టారు. పైగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలో ఉంది. kotla{#}Kurnool;Kotla Jayasurya Prakasha Reddy;Buggana Rajendranath Reddy;Reddy;District;Minister;Party;TDP;YCP;central government;Chequeబుగ్గనకు చెక్ పెట్టడానికి కోట్ల ఎంట్రీబుగ్గనకు చెక్ పెట్టడానికి కోట్ల ఎంట్రీkotla{#}Kurnool;Kotla Jayasurya Prakasha Reddy;Buggana Rajendranath Reddy;Reddy;District;Minister;Party;TDP;YCP;central government;ChequeSat, 06 Nov 2021 02:30:00 GMTకర్నూలు జిల్లాలో జరగనున్న బేతంచెర్ల మున్సిపాలిటీ ఎన్నిక... జిల్లా ప్రజలు దృష్టిని ఆకర్షిస్తుంది. కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఈ మున్సిపాలిటీలో గెలవాలని అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మామూలుగా అయితే జిల్లాలో టీడీపీకి పెద్ద స్కోప్ లేదని చెప్పి, ఆ పార్టీ శ్రేణులు లైట్ తీసుకునేవారు. కానీ ఒకటే మున్సిపాలిటీ కాబట్టి జిల్లా నాయకులు...బేతంచెర్లపై దృష్టి పెట్టారు. పైగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలో ఉంది.

డోన్ అంటే వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే...గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ బుగ్గన విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆర్ధిక మంత్రిగా దూసుకెళుతున్నారు. ఇలా వైసీపీకి కంచుకోటగా ఉన్న డోన్‌లో టీడీపీ సత్తా చాటడం కష్టం...పైగా బేతంచెర్ల మున్సిపాలిటీ వైసీపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీలో బుగ్గనదే మెజారిటీ. దీని బట్టి చూస్తే బేతంచెర్లలో వైసీపీ గెలుపుకు బ్రేకులు వేయడం కష్టమనే చెప్పాలి.

కానీ బ్రేకులు వేయడానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది...పైగా ఇన్నిరోజులు యాక్టివ్‌గా లేని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు..బేతంచెర్లలో టీడీపీ అభ్యర్ధులని గెలిపించుకోవడానికి సిద్ధమయ్యారు. గత కొంతకాలం నుంచి కోట్ల ఫ్యామిలీ డోన్ స్థానంపై కన్నేసింది. ఈ క్రమంలోనే అక్కడ కోట్ల ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే మన్నె సుబ్బారెడ్డికి డోన్ ఇంచార్జ్ బాధ్యతలు దక్కాయి. దీంతో డోన్ ఎలాగైనా సత్తా చాటాలని కోట్ల ఫ్యామిలీ చూస్తుంది.

ఈ క్రమంలోనే బేతంచెర్ల మున్సిపల్ ఎన్నిక రూపంలో కోట్లకు మంచి అవకాశం దక్కింది. మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు నామినేషన్ పడేలా చూసుకుంటున్నారు. అలాగే అభ్యర్ధులకు ఆర్ధికంగా కూడా అండగా ఉండటానికి కోట్ల సిద్ధమయ్యారు. ఎలాగైనా బుగ్గనకు చెక్ పెట్టి బేతంచెర్లలో టీడీపీ జెండా ఎగరవేయాలని కోట్ల చూస్తున్నారు. కానీ అంత సులువుగా బుగ్గనకు చెక్ పెట్టడం కష్టమనే చెప్పాలి.



బుగ్గనకు చెక్ పెట్టడానికి కోట్ల ఎంట్రీ

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>