MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanea54571a-1937-4890-be35-a5666d92959f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanea54571a-1937-4890-be35-a5666d92959f-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో తిరిగి పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా వకీల్ సాబ్ సినిమా తో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న పవన్ కళ్యాణ్ అదే జోష్ లో వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరPawan kalyan{#}dil raju;thaman s;Daggubati Venkateswara Rao;Venu Sreeram;Nayak;Venkatesh;Josh;Varsham;November;kalyan;Darsakudu;Diwali;media;Director;Mass;Cinema;Teluguఅసలైన దీపావళి నవంబర్ 7న...భీమ్లా నాయక్..!అసలైన దీపావళి నవంబర్ 7న...భీమ్లా నాయక్..!Pawan kalyan{#}dil raju;thaman s;Daggubati Venkateswara Rao;Venu Sreeram;Nayak;Venkatesh;Josh;Varsham;November;kalyan;Darsakudu;Diwali;media;Director;Mass;Cinema;TeluguSat, 06 Nov 2021 14:26:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత  కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో తిరిగి పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా వకీల్ సాబ్ సినిమా తో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న పవన్ కళ్యాణ్ అదే జోష్ లో వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్ కోషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరొక హీరోగా కనిపించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, టీజర్, పాటలను చిత్ర బృందం బయటకు వదలగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఉన్న అంచనాలు పెంచేలా చేశాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యే దీపావళి సందర్భంగా కూడా భీమ్లా నాయక్ చిత్ర బృందం ఒక ప్రోమో విడుదల చేసింది. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారుతుంది. ఈ మధ్య 'లాలా భీమ్లా' సాంగ్ ప్రోమోను బయటకు వదలగా దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రోమో విపరీతంగా ఆకటు కోగా, దీని ఫుల్ సాంగ్ నవంబర్ 7 న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశాడు. పవన్ లేటెస్ట్ పోస్టర్‌ను షేర్ చేస్తూ, అమేజింగ్ 'డిజైన్... అసలైన దీపావళి నవంబర్ 7 వ తేదీన అని, స్పీకర్లతో సిద్దంగా ఉండండి...ఊర మాస్ సౌండ్... అంటూ కామెంట్ ను తమన్ జత చేశాడు. ఇలా తమన్ పోస్ట్ పెట్టడం తో ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అనేక మంది ఈ సాంగ్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.



ఫేక్ అకౌంట్స్‌లో కోట్ల రూపాయల నగదు....!

బ్రేకింగ్: బాబోరి కొత్త ప్రోగ్రాం...?

రైతన్న జాగ్రత్త :పత్తి కోనుగోలు తూకంలో మోసాలు..?

బ్రేకింగ్: తెలంగాణా కాంగ్రెస్ చీలిక, ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ...?

సీఎల్పీలో వీహెచ్‌, కోమ‌టిరెడ్డి భేటీ.. ఎందుకోసం అంటే..?

రేపే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు

ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకున్న మారుతి..!

యాత్రకు నాలుగేళ్లు: జ‌గ‌న్‌.. అడ్డ‌గోలుగా సీఎం అవ్వాల‌నుకోలేదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>