PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ys-jagana945c0f2-cd0b-42f1-8ff9-a5e0d1549739-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ys-jagana945c0f2-cd0b-42f1-8ff9-a5e0d1549739-415x250-IndiaHerald.jpgముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగులకు స‌కాలంలో వేత‌నాల చెల్లింపుల్లో ఇప్ప‌టికీ అవ‌స్థ‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల డేటా ఎంట్రీ ఆప‌రేటర్ల‌కు ఎనిమిది నెల‌లుగా జీతాలు కూడా లేని వైనం ఉంది. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా త‌మ స‌మ‌స్యల ప‌రిష్కారం విష‌య‌మై పెద్ద‌గా సీఎం చొర‌వ చూప‌డం లేద‌న్న అసంతృప్తితోనూ ఉన్నారు. ఇప్ప‌టికైనా స‌కాలంలో ఖాళీల భ‌ర్తీపై దృష్టి సారిస్తే మేలు. అదేవిధంగా గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల వేతనం పెంపు, పోస్టుల రెగ్యుల‌రైజేష‌న్ పై కూడా చ‌ర్య‌లు వేగం చేయాలి. వ‌లంటీర్లys-jagan{#}CMయాత్రకు నాలుగేళ్లు : ఉద్యోగాల ఊసేది నాయనో నాయనా!యాత్రకు నాలుగేళ్లు : ఉద్యోగాల ఊసేది నాయనో నాయనా!ys-jagan{#}CMSat, 06 Nov 2021 11:11:56 GMTపాద‌యాత్ర చేప‌ట్టి నాలుగేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంలో జ‌గ‌న్ ఆ రోజు ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ఏం చెప్పారో ఏం అన్నారో కూడా చూ ద్దాం. ముఖ్యంగా నిరుద్యోగ స‌మ‌స్య‌కు సంబంధించి ఆయ‌న చాలానే చెప్పారు. అయితే గ్రామ స‌చివాలయాల ఏర్పాటుతో ముందు గా అనుకున్న విధంగానే పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చారు. ఆస‌క్తి ఉన్న వారంతా క‌ద‌లి రావాల‌ని పిలుపు ఇచ్చారు. అదేవిధం గా గ్రామ వ‌లంటీరు వ్య‌వ‌స్థ‌ను కూడా తీసుకువ‌చ్చారు. పోస్టుల భ‌ర్తీతో కొంద‌రు నిరుద్యోగుల‌కు  ఉద్యోగాలు దొరికాయి. అయితే వీరిని ఉద్యోగుల‌ని వ్య‌వ‌హ‌రించ‌లేమ‌ని తేల్చేశారు.

 గ్రామ సెక్ర‌టేరియ‌ట్ లో ల‌క్షా న‌ల‌భై వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశారు. అంతేకాకుండా నాలుగు ల‌క్షల మంది వ‌లంటీర్ల‌ను తీసుకున్నారు. ప‌థ‌కాలు చేరేలా వీరంతా కృషి చేస్తార‌ని కూడా చెప్పారు. ఇదంతా ఓ ఎత్త‌యితే అధికారంలోకి వ‌చ్చాక రెగ్యుల‌ర్ నోటిఫికేష‌న్ల జారీలో జ‌గ‌న్ అల‌స‌త్వంతో ఉన్నారు. అస్స‌లు ఇప్ప‌టిదాకా పెద్ద‌గా ఖాళీల‌ను భ‌ర్తీ చేసే  ఏ ప‌ని కూడా ఏపీపీఎస్సీ పెట్టుకోలేదు. వైద్య శాఖ‌లో మాత్రం కొన్ని పోస్టుల భ‌ర్తీకి ఇటీవ‌ల జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. మొత్తం 14 వేల 200 పైగా పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు కూడా! ఈ నెల 15 నాటికే ఇందుకు సంబంధించిన అన్ని ప‌నులూ పూర్తి కావాల్సి ఉంది. గ‌త నెల ఒక‌టో తారీఖు నుంచే నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ మొద‌లుకుని మిగ‌తా ప‌నుల‌న్నీ చేప‌ట్టాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి ఇస్తున్న ఆదేశం. ఇదొక్క‌టీ మిన‌హా పెద్ద‌గా ఇత‌ర శాఖ‌ల్లో ఖాళీల భ‌ర్తీకి చ‌ర్య‌లే లేవు.

ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగులకు స‌కాలంలో వేత‌నాల చెల్లింపుల్లో ఇప్ప‌టికీ అవ‌స్థ‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల డేటా ఎంట్రీ ఆప‌రేటర్ల‌కు ఎనిమిది నెల‌లుగా జీతాలు కూడా లేని వైనం ఉంది. ఇక ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా త‌మ స‌మ‌స్యల ప‌రిష్కారం విష‌య‌మై పెద్ద‌గా సీఎం చొర‌వ చూప‌డం లేద‌న్న అసంతృప్తితోనూ ఉన్నారు. ఇప్ప‌టికైనా స‌కాలంలో ఖాళీల భ‌ర్తీపై దృష్టి సారిస్తే మేలు. అదేవిధంగా గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల వేతనం పెంపు, పోస్టుల రెగ్యుల‌రైజేష‌న్ పై కూడా చ‌ర్య‌లు వేగం చేయాలి. వ‌లంటీర్ల జీతాల‌ను నాలుగు వేలు నుంచి ఎనిమిది వేల‌కు పెంచాల్సి ఉంది.






యాత్రకు నాలుగేళ్లు: జ‌గ‌న్ సాహ‌సం ప‌వ‌న్‌, లోకేష్ క‌ల‌లో కూడా చేయ‌లేరేమో ?

రషీద్ ఖాన్ చేతుల్లో.. టీమిండియా భవిష్యత్తు?

మంత్రి త‌ల‌సాని కుమారుడి కారు హ‌ల్‌చ‌ల్‌..!

విశాఖను ఎక్జికూటివ్ రాజధాని గా గుర్తించిన ఇండియన్ నేవీ..!

జ‌గ‌న్‌కు సొంత జిల్లాలో బిగ్ షాక్‌...!

ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?

న‌వంబ‌ర్ 9న‌ మరో అల్పపీడనం

వారెవా: ఆ ఒక్క మాత్రతో కరోనాకు చెక్..?

యాత్రకు నాలుగేళ్లు : జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన జగన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>