PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-jagan559e2eed-e091-42c6-b8ea-48b726879b32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-jagan559e2eed-e091-42c6-b8ea-48b726879b32-415x250-IndiaHerald.jpg ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 'ప్రజాసంకల్పయాత్ర' చేసి నేటికి నాలుగేళ్లు. అసలాయన ఎందుకు పాదయాత్ర చేశారు ? పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? అప్పటికే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఎందుకు జనం ముందుకు వచ్చారు ? ఆయనే కాదు, నాటి అసెంబ్లీలో సభ్యులు కూడా జగన్ వెంట జనంలోకి వచ్చారు. నాటి పాలక పక్షం ఎన్ని ఇబ్బందులు కల్పించినా జనంతో మమేక మయ్యారు.ys-jagan{#}chalam;Telugu Desam Party;Jagan;Y. S. Rajasekhara Reddy;INTERNATIONAL;SV Mohan Reddy;Andhra Pradesh;Congress;Telangana Chief Minister;Fort;Reddy;India;Party;Governmentయాత్రకు నాలుగేళ్లు : ప్రజాస్వామ్య పరిరక్షణే అసలు లక్ష్యంయాత్రకు నాలుగేళ్లు : ప్రజాస్వామ్య పరిరక్షణే అసలు లక్ష్యంys-jagan{#}chalam;Telugu Desam Party;Jagan;Y. S. Rajasekhara Reddy;INTERNATIONAL;SV Mohan Reddy;Andhra Pradesh;Congress;Telangana Chief Minister;Fort;Reddy;India;Party;GovernmentSat, 06 Nov 2021 06:18:59 GMT 
 ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  ప్రజాసంకల్పయాత్ర చేసి నేటికి నాలుగేళ్లు. అసలాయన ఎందుకు పాదయాత్ర చేశారు ? పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? అప్పటికే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఎందుకు జనం ముందుకు వచ్చారు ? ఆయనే కాదు, నాటి అసెంబ్లీలో సభ్యులు కూడా జగన్ వెంట జనంలోకి వచ్చారు. నాటి పాలక పక్షం ఎన్ని ఇబ్బందులు కల్పించినా జనంతో మమేక మయ్యారు.
  చట్టసభల్లో  కేవలం రెండు సీట్లతో  వై.ఎస్.ఆర్ కాంగ్రెస్  పార్టీ తన ప్రస్థానాన్ని ఆరంభించింది. 2014 ఎన్నికల నాటికి ఆ బలం 67 సీట్లకు  పెరిగింది. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఆయ్యారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కోంటున్న కష్టాలను చట్ట సభ దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారించాలని పాలక పక్షానికి చాలా సార్లు విన్నవించారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు తమ గళం వినిపించారు. ప్రయోజనం శూన్యం. పై పెచ్చు అధికార  పక్షం ఒంటెద్దు పోకడలు ప్రజల్లో చిరెత్తాయి. అందరూ తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యలకు పరిష్కారుం జరిగేలా చూడాలని జగన్ మెహన్ రెడ్డి పై ఒత్తిడి పెంచారు.
ప్రాజా స్వామ్యానికి పునాది - శాసన వ్యవస్థ. భిన్నత్వంలో ఏకత్వం లా ఉండే భారత్ లో , ముఖ్యంగా  ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు శాసన వ్యవస్థ ఉన్నది. కాని నాడు జరుగుతున్న పరిణామాలు వేరు. పాలక వర్గం ( తెలుగుదేశం పార్టీ) నియంతృత్వ ధోరణితో, తామే రాచరికపు వారసులన్న ధీమాతో పాలన సాగించింది.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా ఉండాలంటే ,  ప్రతిపక్షంతో పాటు, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి అంశంపై చర్చ జరగాలి. నాటి పాలకులు  అలా చేయలేదు. తాము తీసుకున్న ఏ నిర్ణయం పైనా ఎవరినీ సంప్రదించ లేదు. అంతా ఏక పక్షం సాగుతోంది నాటి పరిపాలన. దీంతో ప్రజాస్వామ్యం విలువలు అపహాస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా  ప్రముఖంగా ప్రస్తావించింది.  పాలకుల్లో అహాంకార ధోరణి ఏమాత్రం తగదని పేర్కోంది కూడా. అయినా పాలకుల్లో ఏ మాత్రం చలం లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యంలో శూన్యత ఏర్పడింది.
ఈ శూన్యాన్ని భర్తీ చేసేందుకు,  ప్రజాస్వామ్యానికి పెట్టని కోట అయిన శాసన సభా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్ మెహన్ రెడ్డి సంకల్పించారు. ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. శాసనసభలో ఏం జరిగింది ?   రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అనే విషయాలను ప్రజలకు నేరుగా వివరించేందుకు సంకల్పించారు. జనంలోకి వచ్చారు.





యాత్రకు నాలుగేళ్లు : ప్రజాస్వామ్య పరిరక్షణే అసలు లక్ష్యం

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>