MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrra14a186d-d10f-4505-b756-87982635ebba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrra14a186d-d10f-4505-b756-87982635ebba-415x250-IndiaHerald.jpgఅభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ కు వచ్చిన స్పందన అత్యంత భారీ స్థాయిలో లేకపోవడంతో ఈమూవీని అత్యంత భారీ స్థాయికి కొనుక్కున్న బయ్యర్లకు కలవరపాటు మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ తో పోటీగా విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్’ ‘సర్కారు వారి పాట’ టీజర్ల కు ఒక్క రోజులోనే మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడంతో దానికి మించిన స్థాయిలో ‘ఆర్ ఆర్ ఆర్’ గ్లిమ్స్ కు వ్యూస్ వస్తాయని ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ భావించినట్లు టాక్.అయితే జరిగిన పరిణామం వేరేగా ఉంది అంటున్rajamouli rrr{#}you tube;Cinemaఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ గ్లిమ్స్ కు ఆతర్యంలో ఎదురీత !ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ గ్లిమ్స్ కు ఆతర్యంలో ఎదురీత !rajamouli rrr{#}you tube;CinemaSat, 06 Nov 2021 10:00:00 GMTఅభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ కు వచ్చిన స్పందన అత్యంత భారీ స్థాయిలో లేకపోవడంతో ఈమూవీని అత్యంత భారీ స్థాయికి కొనుక్కున్న బయ్యర్లకు కలవరపాటు మొదలైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ తో పోటీగా విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్’ ‘సర్కారు వారి పాట’ టీజర్ల కు ఒక్క రోజులోనే మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడంతో దానికి మించిన స్థాయిలో ‘ఆర్ ఆర్ ఆర్’ గ్లిమ్స్ కు వ్యూస్ వస్తాయని ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ భావించినట్లు టాక్.


అయితే జరిగిన పరిణామం వేరేగా ఉంది అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి భారీ  సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ రాకపోవడం వెనుక ఒక కారణం ఉంది అంటున్నారు. టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన టీజర్లకు భారీ రికార్డులు రావాలి అన్న ఉద్దేశ్యంతో టాప్ హీరోల సినిమాల దర్శక నిర్మాతలు ఒక ప్రత్యేకమైన టీమ్ ను ఏర్పాటు చేసి తమ సినిమా టీజర్ కు హిట్స్ పరంగా భారీ రికార్డులు రావడానికి చాల గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.


దీనికోసం భారీ స్థాయి నిర్మాతలు లక్షల స్థాయిలో ఖర్చు పెడతారు అన్న ప్రచారం కూడ ఉంది. అయితే అలాంటి వ్యూహాలు ‘ఆర్ ఆర్ ఆర్’ గ్లిమ్స్ విషయంలో అనుసరించ లేదా లేదంటే ఈ గ్లిమ్స్ పట్ల ఆదరణ అంతంత మాత్రంగా ఉందా అన్న సందేహాలు వస్తున్నాయి.


దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ ఫస్ట్ గ్లిమ్స్ ను కేవలం యూట్యూబ్ లో మాత్రమే విడుదల చేయకుండా డివివి దానయ్య యూట్యూబ్ ఛానల్ టి సిరీస్ లలో కూడ విడుదల చేసిన పరిస్థితులలో ఈ ఫస్ట్ గ్లిమ్స్ కు వచ్చిన వ్యూస్ లో తేడా వచ్చి ఉంటుందని మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలు ‘ఆర్ ఆర్ ఆర్’ బయ్యర్లను కలవర పెడుతోంది..  







ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?

యాత్రకు నాలుగేళ్లు : జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన జగన్..!

పెట్రో వాత: ఈ రాష్ట్రాలు గ్రేట్.. వ్యాట్ తగ్గించాయి!

జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !

యాత్రకు నాలుగేళ్లు : వెలుగు నింపిన అడుగుజాడలు.. ?

యాత్రకు నాలుగేళ్లు: నవరత్నాలకు బీజం అప్పుడే..?

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>