PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------------------78589dd8-c8bf-41d6-8b6c-92533f4e8cca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/------------------------78589dd8-c8bf-41d6-8b6c-92533f4e8cca-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఒకటే సమస్య. అది పెట్రోల్, డీజిల్ ధరలు. ఇప్పటికే ధరలు సెంచరీ దాటడంతో.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అదే సమయంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. పరిస్థితి ఇలాగే వదిలేస్తే.... ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించిన కేంద్ర ప్రభుత్వం... పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు 5 రూపాయలు, డీజిల్‌పై లీటరుకు 10 రూపాయలు ధర తగ్గింది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రPetrol{#}Y. S. Rajasekhara Reddy;Diesel;Andhra Pradesh;central government;Bharatiya Janata Party;Minister;Telugu;Government;Partyపెట్రో ధరలపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు...!పెట్రో ధరలపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు...!Petrol{#}Y. S. Rajasekhara Reddy;Diesel;Andhra Pradesh;central government;Bharatiya Janata Party;Minister;Telugu;Government;PartySat, 06 Nov 2021 17:45:30 GMTదేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఒకటే సమస్య. అది పెట్రోల్, డీజిల్ ధరలు. ఇప్పటికే ధరలు సెంచరీ దాటడంతో.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అదే సమయంలో తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. పరిస్థితి ఇలాగే వదిలేస్తే.... ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించిన కేంద్ర ప్రభుత్వం... పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు 5 రూపాయలు, డీజిల్‌పై లీటరుకు 10 రూపాయలు ధర తగ్గింది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు మరో అడుగు ముందుకు వేసి... వ్యాట్ తగ్గింపులు కూడా భారీగానే ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వినియోగదారులకు భారీగా ఊరట లభించింది కూడా. అయితే తెలుగు రాష్ట్రాలు మాత్రం వ్యాట్ తగ్గింపు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో భారతీయ జనతా పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు కుడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే బీజేపీ నేతలు నిరసనలు కూడా చేస్తున్నారు.

అయితే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు విషయంపై ఏపీ ప్రభుత్వం ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాట్ తగ్గిస్తే... ఆ ప్రభావం రాష్ట్ర ఖజానాపై పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏపీ స్వాగతిస్తుందన్నారు. అయితే వ్యాట్ తగ్గింపుపై ఏపీ ప్రభుత్వం తగిన సమయంలోనే కీలక నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన తాము చేయటం లేదని తేల్చి చెప్పేశారు మంత్రి ధర్మాన. వ్యాట్ తగ్గిస్తే... ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గుతుందనే భయం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో బలంగా ఉంది. అసలే అంతంత మాత్రంగానే ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం ఏ మాత్రం సరి కాదనేది ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.





జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?

ఆళ్ల‌ను జ‌గ‌న్ అందుకే ప‌క్క‌న పెట్టారా ?

#Mega154 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌... హీరోయిన్ కూడా ఫిక్స్‌..!

చిరంజీవి సినిమా ఓపెనింగ్‌లో ఐదుగురు ద‌ర్శ‌కులు సంద‌డి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>