PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-ac322710-8b82-4daf-a9e5-99f2adeba9c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-ac322710-8b82-4daf-a9e5-99f2adeba9c8-415x250-IndiaHerald.jpgతీసుకున్నారు జగన్. 22 మంది ఎంపీలను ఢిల్లీకి తీసుకు వెళ్లి పెద్దోల్లకు దండం పెట్టి తిరిగి వచ్చారు. బిజెపి బలం ముందు మనం చాలా వీక్ అని తేల్చేశారు. ఇక పవన్ కళ్యాణ్ హోదాపై అనంతపురంలో అరిస్తే శ్రీకాకుళంలో వినిపించింది. అందరూ తిరిగి చూసేసరికి ఢిల్లీలో బీజేపీ నేతలతో నెయ్యి లడ్డూలు తింటూ ఆయన కనిపించారు. ఈ ముగ్గురిని చూశాక ప్రజలు కూడా హోదాపై మాట్లాడుకోవడం మానేశారు. పార్టీలు రాజకీయ అవసరాల కోసం మాత్రమే దాన్ని వాడుకుంటున్నాయి. పార్టీలు, ప్రజలు మర్చిపోయిన స్పెషల్ కేటగిరి స్టేటస్ అనే పదం ఏపీలో ఇప్పటికీ సజీవPolitical {#}Amit Shah;kalyan;Amith Shah;lotus;Ghee;Prime Minister;vedhika;Manam;Elections;CBN;Bharatiya Janata Party;Jagan;CMమళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా.. ఇంకా ఆశలు ఉన్నాయా..?మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా.. ఇంకా ఆశలు ఉన్నాయా..?Political {#}Amit Shah;kalyan;Amith Shah;lotus;Ghee;Prime Minister;vedhika;Manam;Elections;CBN;Bharatiya Janata Party;Jagan;CMSat, 06 Nov 2021 13:05:00 GMTరాష్ట్ర విభజన తర్వాత హోదా గురించి జరిగిన చర్చలు, ఆందోళనలు అంతా ఇంతా కాదు. అయితే రోజురోజుకు ఆ విషయం గురించి పట్టించుకోవడమే మానేశారు జనం. ఎన్నికలు వచ్చినప్పుడు, కేంద్రం నుంచి పెద్దలు రాష్ట్రానికి వచ్చినప్పుడు, మన రాష్ట్ర పెద్దలు ఢిల్లీకి వెళ్ళినప్పుడు హోదా అనేది ఓ రాజకీయ అంశంగా పార్టీలకు గుర్తుకు వస్తుంది. ఇది ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జనంలో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇప్పుడు కూడా అదే జరగబోతోందా..? అమిత్ షా పర్యటనతో మళ్లీ తెర మీదికి వచ్చిన హోదా వ్యవహారం  ఎలాంటి మలుపు తీసుకోబోతోంది..? సదరన్ స్టేట్ కౌన్సిల్ లో హోదాకు మద్దతు  లభిస్తుందా..?

కేంద్రంలోనూ, బీజేపీ లోనూ మోడీ తర్వాత స్థానంలో ఉన్న వ్యక్తి అమిత్ షా. ఈ నెల 14న ఏపీకి ఆయనే స్వయంగా వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, అధికారులతో సమీక్ష సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించబోతున్నారు. అయితే ఈ సమావేశాన్ని వేదిక చేసుకొని హోదా అంశాన్ని సీఎం జగన్ మరోసారి తెరమీదకు తీసుకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారని గట్టిగానే అడిగేందుకు సిద్ధమవుతున్నారని టాక్. దీంతోపాటు విభజన హామీలపై కూడా డిమాండ్ వినిపించబొతున్నారని తెలుస్తోంది. నిజానికి ప్రధాని మోడీని, అమిత్ షాని  ఢిల్లీలో ఎప్పుడు కలిసిన జగన్ ప్రత్యేక హోదా మీద వినతులు ఇస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు షానే ఏపీకి వస్తున్నారు. దీంతో తమ ఎజెండా ఏంటో చెప్పు చూడాలని జగన్ భావిస్తున్నారు. బిజెపి ఏపీకి కమలం పువ్వు ఇచ్చి చెబుతున్న విషయం ఏమిటంటే హోదా అనేది ముగిసిపోయిన అద్యాయమని కోడలు కొడుకులు కంటనంటే  అత్త వద్దంటుందా అని చంద్రబాబు ప్యాకేజీని ముద్దాడారు. దానికి బారసాల కూడా చేశారు. తీరా యుటర్న్ తీసుకున్నారు. ఈ మనవడు నాకొద్దు  నా హోదానే నాకు ముద్దు అన్నారు. యూనివర్సిటీలకు, కాలేజీలకు వెళ్లి మీటింగులు పెట్టి హోదా వల్ల కలిగే ప్రయోజనం ఏంటో క్లాస్ తీసుకున్నారు జగన్. 22 మంది ఎంపీలను ఢిల్లీకి తీసుకు వెళ్లి పెద్దోల్లకు దండం పెట్టి తిరిగి వచ్చారు. బిజెపి బలం ముందు మనం చాలా వీక్ అని తేల్చేశారు. ఇక పవన్ కళ్యాణ్ హోదాపై  అనంతపురంలో అరిస్తే శ్రీకాకుళంలో వినిపించింది. అందరూ తిరిగి చూసేసరికి ఢిల్లీలో బీజేపీ నేతలతో నెయ్యి లడ్డూలు తింటూ ఆయన కనిపించారు.

ఈ ముగ్గురిని చూశాక ప్రజలు కూడా హోదాపై మాట్లాడుకోవడం మానేశారు. పార్టీలు రాజకీయ అవసరాల కోసం మాత్రమే దాన్ని వాడుకుంటున్నాయి. పార్టీలు, ప్రజలు మర్చిపోయిన స్పెషల్ కేటగిరి స్టేటస్ అనే పదం ఏపీలో ఇప్పటికీ సజీవంగానే ఉంది. అది రాజకీయ నాయకుల అవసరాలకు కాకుండా, రాష్ట్ర ప్రజల అవసరాలకు ఉపయోగపడినప్పుడే ప్రయోజనం ఉంటుంది.



ఒక్కసారిగా రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన సమంత..!

ఆ ఆర్టీసీ డిపోల్లో స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు

ప్రభాస్ తో సినిమా సెట్ చేసుకున్న మారుతి..!

యాత్రకు నాలుగేళ్లు: జ‌గ‌న్‌.. అడ్డ‌గోలుగా సీఎం అవ్వాల‌నుకోలేదు..!

బ్యాగ్ సర్దుకుని ఇంటికి పోవడమే : రవీంద్ర జడేజా

అలా అయితే బ్యాగ్ సర్దుకోవడమే..! వెల్లడించిన జడేజా

కేవలం రూ.10 కే ఏడాది పాటు ఓపీ సేవ‌లు

"పుష్ప 2" లో యాంకర్ సుమకు ఛాన్స్?

యాత్రకు నాలుగేళ్లు : జ‌గ‌న్ ఆల్ టైం రికార్డ్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>