MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-eppudostadayya-chinnabalayya-4659cfb5-7a4a-4d2f-8aef-d8f5ed2ca689-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayya-eppudostadayya-chinnabalayya-4659cfb5-7a4a-4d2f-8aef-d8f5ed2ca689-415x250-IndiaHerald.jpgబాలయ్య అభిమానుల ఆశ ఇంకా నెరవేరలేదు. నటసింహం అప్పుడెప్పుడో తన పుత్రుడు సినిమా ఎంట్రీ ఇస్తాడని చెప్పాడు. ఇంకేముందీ కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. తమ అభిమాన హీరో కుమారుడిని భుజానికెత్తుకోవాలని చూస్తున్నారు. కానీ ఇప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. అందుకే ఎప్పుడయ్యా చిన్న బాలయ్య వచ్చేది అని అడుగుతున్నారు. Balayya Eppudostadayya Chinnabalayya {#}Balakrishna;Cinemaబాలయ్యా..! ఎప్పుడొస్తాడయ్య చిన్నబాలయ్య..!బాలయ్యా..! ఎప్పుడొస్తాడయ్య చిన్నబాలయ్య..!Balayya Eppudostadayya Chinnabalayya {#}Balakrishna;CinemaSat, 06 Nov 2021 20:46:10 GMTనందమూరి నటసింహం బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ.. సినీ ఎంట్రీ ఇస్తాడని చెప్పేశాడు. దీంతో బాలకృష్ణ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. నందమూరి తారకరామారావు గారి నటన చూశాం.. బాలయ్య యాక్టింగ్ చూశాం.. ఇక మోక్షజ్ఞ ఎలా తన టాలెంట్ చూపిస్తాడోనని బోలెడంత ఆశలు పెట్టుకున్నారు. అలా ఊహించుకుంటున్నారో కానీ అనుకున్నది జరగలేదు. మొక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడు చేస్తాడోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంది.

బాలయ్య స్టేట్ మెంట్ ఇచ్చి చాలా రోజులే అవుతోంది. కానీ ఆ మాటలు ఇంకా కెమెరా ముందుకు రాలేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌  డిసప్పాయింట్‌ అవుతున్నారు. బాలకృష్ణ దర్శకత్వంలో మోక్షజ్ఞ లాంచ్‌ అవుతాడనే స్టేట్ మెంట్ వచ్చినప్పటి నుంచి నందమూరి అభిమానులు ఈ ప్రాజెక్ట్‌ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'ఆదిత్య 369' సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొడుకు ఎంట్రి గురించి మాట్లాడాడు బాలయ్య. 'ఆదిత్య 999'తో మోక్షజ్ఞని లాంచ్‌ చేస్తానని, కథ కూడా సిద్ధమైందని చెప్పాడు.

'ఆదిత్య369' సీక్వెల్‌గా 'ఆదిత్య 999' సినిమా రాబోతోంది. ఈమూవీకి బాలకృష్ణే స్వయంగా స్టోరీ లైన్‌ ఇచ్చానని చెప్పాడు. అలాగే ఈ సీక్వెల్‌ని అయితే సింగీతం శ్రీనివాసరావు, లేకపోతే తానే డైరెక్ట్‌ చేస్తానని ప్రకటించాడు. ఈ ఒక్క సినిమాతో మోక్షజ్ఞని ఫుల్ గా ట్రైన్‌ చేస్తానని చెప్పాడు. దీంతో తండ్రీకొడుకులు కలిసి నటిస్తే చూడాలని బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలకృష్ణ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'అఖండ' పూర్తవ్వగానే గోపీచంద్ మలినేని సినిమాలో జాయిన్‌ అవుతున్నాడు. ఈ మూవీస్‌తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా పైప్‌లైన్‌లో ఉన్నాయనే టాక్ వస్తోంది. అంటే మోక్షజ్ఞ ఈ ఏడాది కూడా కెమెరాముందుకు రావడం కష్టమనే కామెంట్స్‌ వస్తున్నాయి. మరి 27 ఏళ్ల మోక్షజ్ఞ వచ్చే ఏడాదైనా సినిమాల్లోకి వస్తాడా అనేది చూడాలి. మరి బాలయ్య అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.





ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోట...!

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>