PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp135be204-af4d-442c-9889-f6376ed23879-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/ysrcp135be204-af4d-442c-9889-f6376ed23879-415x250-IndiaHerald.jpgఏపీలో ఇటీవ‌ల స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అధికార వైసీపీ వ‌న్ సైడ్ గా గెలిచింది. అయితే ఆ టైంలో వివిధ కార‌ణాల వ‌ల్ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా మిగిలిపోయిన స్థానిక సంస్థ‌ల‌కు ఈ నెల 15వ తేదీన ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. నెల్లూరు కార్పొరేష‌న్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 12 మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీ ల‌తో పాటు కొన్ని స‌ర్పంచ్ స్థానాలు, ఖాళీ గా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స‌ర్పంచ్ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.ఇన్ని చోట్ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నా కూడా అన్నింటి కంటే ప్ర‌ధానంగా మాజీ ysrcp{#}Kumaar;Kick;kuppam;Minister;MP;local language;TDP;YCP;Party;Reddy;Nelloreఏపీ లోక‌ల్ ఫైట్‌: వైసీపీకి ఆ ఒక్క చోటే టెన్ష‌న్‌..!ఏపీ లోక‌ల్ ఫైట్‌: వైసీపీకి ఆ ఒక్క చోటే టెన్ష‌న్‌..!ysrcp{#}Kumaar;Kick;kuppam;Minister;MP;local language;TDP;YCP;Party;Reddy;NelloreSat, 06 Nov 2021 10:29:47 GMTఏపీలో ఇటీవ‌ల స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అధికార వైసీపీ వ‌న్ సైడ్ గా గెలిచింది. అయితే ఆ టైంలో వివిధ కార‌ణాల వ‌ల్ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా మిగిలిపోయిన స్థానిక సంస్థ‌ల‌కు ఈ నెల 15వ తేదీన ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. నెల్లూరు కార్పొరేష‌న్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 12 మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీ ల‌తో పాటు కొన్ని స‌ర్పంచ్ స్థానాలు, ఖాళీ గా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స‌ర్పంచ్ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇన్ని చోట్ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నా కూడా అన్నింటి కంటే ప్ర‌ధానంగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం, మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు కుప్పం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌డంతో అక్క‌డి ఎన్నిక‌లు ఆయ‌న‌కు చావో రేవో మాదిరిగా మారాయి.

ఇక నెల్లూరు లో వైసీపీ గెలుపు విష‌యంలో పెద్ద సందేహాలు లేవు. అయితే అక్క‌డ పార్టీకి గ్రూపుల గోల ఎక్కువుగా ఉంది. కార్పొరేష‌న్‌లో 54 డివిజ‌న్లు ఉన్నా... అక్క‌డ భారీ మెజార్టీతో క‌నుక వైసీపీ గెల‌వ‌క‌పోతే పార్టీకి ఇబ్బంది త‌ప్ప‌దు. కేవ‌లం ఏ 30 డివిజ‌న్ల లో నో వైసీపీ గెలిచి కార్పోరేష‌న్ సాధించినా అది కిక్ ఇచ్చే గెలుపు అవ్వ‌దు. క‌నీసం 50 డివిజ‌న్ల లో గెలిస్తే నే వైసీపీ ఇక్క‌డ ప‌ట్టు ఉంద‌ని తెలుస్తుంది. మ‌రి ఆ టెన్ష‌న్ అయితే ఇక్క‌డ వైసీపీ ని వెంటాడుతోంద‌ట‌.

నెల్లూరు న‌గ‌రంలో వైసీపీ లోనే మంత్రి అనిల్ కుమార్ గ్రూప్ ఒక‌టి. ఇక స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే.. పార్టీ జిల్లా అధ్య‌క్షుడి గా ఉన్న కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి ది మ‌రో గ్రూప్‌.. ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి ది కూడా మ‌రో గ్రూప్‌.. ఇక మాజీ మంత్రి , పార్టీ సీనియ‌ర్ నేత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ది కూడా మ‌రో గ్రూప్‌. ఈ గ్రూపులే ఇక్క‌డ వైసీపీ కొంప ముంచుతాయ‌న్న ఆందోళ‌న అయితే ఉంది.

 



భారత్‌పై చైనా కుట్ర.. బయటపెట్టిన అమెరికా..?

విశాఖను ఎక్జికూటివ్ రాజధాని గా గుర్తించిన ఇండియన్ నేవీ..!

జ‌గ‌న్‌కు సొంత జిల్లాలో బిగ్ షాక్‌...!

ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?

న‌వంబ‌ర్ 9న‌ మరో అల్పపీడనం

వారెవా: ఆ ఒక్క మాత్రతో కరోనాకు చెక్..?

యాత్రకు నాలుగేళ్లు : జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన జగన్..!

పెట్రో వాత: ఈ రాష్ట్రాలు గ్రేట్.. వ్యాట్ తగ్గించాయి!

జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>