PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghunath-reddy-found-stranded-in-the-villagef3c045b0-ed0e-42c6-ada7-670caa457bbe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/raghunath-reddy-found-stranded-in-the-villagef3c045b0-ed0e-42c6-ada7-670caa457bbe-415x250-IndiaHerald.jpgరాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పక్క పార్టీపై బురదజల్లేందుకు ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. ఒక మాజీ మంత్రి ఏకంగా మహిళ ద్వారా ఒక వ్యక్తిపై అబద్దపు ఆరోపణలతో వీడియో రూపొందించాలని సలహా ఇచ్చాడు. వీలైతే వేధింపులు, లైంగిక వేధింపులు, దుర్భాషలు ఆపాదిస్తూ సీఎంకు వీడియో పంపాలని చెప్పారు. అంతేకాదు ఆ వీడియోను ఆసరాగా చేసుకొని కంప్లైట్ చేయడంతో పాటు.. వైరల్ చేయాలని సూచించారు ఆ మాజీ మంత్రి. Raghunath Reddy found stranded in the village{#}CM;Minister;YCP;Reddy;Jaganఅడ్డంగా దొరికిపోయిన పల్లె రఘునాథ్ రెడ్డి..!అడ్డంగా దొరికిపోయిన పల్లె రఘునాథ్ రెడ్డి..!Raghunath Reddy found stranded in the village{#}CM;Minister;YCP;Reddy;JaganSat, 06 Nov 2021 23:57:55 GMTటీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నిజ స్వరూపం బయటపడింది. వైపీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించేందుకు ఆయన చేసిన ప్రయత్నం బట్టబయలైంది. అంగన్ వాడీ కార్యకర్తను అందుకు ఉసిగొల్పిన విషయం తెలిసిపోయింది. అంగన్ వాడీ కార్యకర్త సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాకు ఎక్కితే అంతా వణికిపోతారని సలహా ఇచ్చారు. అధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై వేధింపుల కేసు పెట్టాలని ఆమెకు సూచించారు.

అంతేకాదు ఆ తర్వాత సీఎం జగన్ కు పంపేందుకు ఒక వీడియో కూడా రూపొందించాలని ఆ అంగన్ వాడీ కార్యకర్తకు సలహా ఇచ్చారు పల్లె రఘునాథ్ రెడ్డి. జగన్ మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని.. అయితే ఒకవ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్న విషయం సీఎంకు వీడియో కాల్ ద్వారా చెప్పాలని సలహా ఇచ్చారు. లొంగక పోతే కేసు పెడతారని బెదిరించారని అందులో మాట్లాడాలని చెప్పారు. దయచేసి రక్షణ కల్పించాలని సీఎంకు విన్నవించుకోవాలని ఆమెకు చెప్పారు. సీఎం గారూ.. మీరే ఆదుకోవాలని వేడుకోవాలని సలహా ఇచ్చారు. సీఎం చొరవ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ వీడియో తయారు చేయాలని పల్లె రఘునాథ్ రెడ్డి మహిళకు సూచించారు. అలా చేస్తే ఫిర్యాదు చేసిన వ్యక్తే.. తన కాళ్ల బేరానికి వస్తాడని చెప్పారు.

ఆ అంగన్ వాడీ కార్యకర్త రూపొందించే వీడియోలో మొత్తం... దుర్భాషలు, లైంగిక వేధింపులు..అసభ్య చూపులు లాంటివి గట్టిగా ప్రస్తావిస్తూ ఆ వ్యక్తిపై సీఎంకు ఫిర్యాదు చేయాలని సూచించారు పల్లె రఘునాథ్ రెడ్డి. లేక పోతే ఆత్మహత్య చేసుకుంటా.. దయచేసి నాకు రక్షణ కల్పించండని వేడుకోవాలని చెప్పారు. అని వీడియో రూపొందించి.. వైరల్ చేయాలని చెప్పారు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా కంప్లైంట్ చేయాలని చెప్పారు.

ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించేందుకు ఒక మహిళను వాడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






ఉమాకు రెండుచోట్ల అదిరిపోయే షాకులు రెడీ?

లైఫ్ స్టైల్: స్నానానికి సరైన సమయం ఏంటో తెలుసా..?

ఆ విషయంలో... చైనాని నిలదీసిన అమెరికా?

జగన్ పాదయాత్ర : ఆరు నెలలు అన్నాడు.. రెండేళ్లు పట్టింది..!

మెహబూబా మూవి హీరోయిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటే..!

ద్రోణాచార్య అవార్డు గ్రహీత మృతి...

ఛార్జీల మోతకు ఆర్టీసీ ప్లానింగ్..!3wes2q1

కర్నూలు జిల్లాలో వింత ఆచారం..!

పునీత్ కుమార్ మరణాన్ని కూడా వాడుకుంటున్నారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>