CrimeN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/---------------429dce34-ec6d-4e16-9cd1-bf89d1673973-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/---------------429dce34-ec6d-4e16-9cd1-bf89d1673973-415x250-IndiaHerald.jpgపేకాట, క్యాసినో దందా సూత్రధారి గుత్తా సుమన్‌ను ఇటీవ‌ల కస్టడీలోకి తీసుకొని విచారించ‌డంతో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. ఈ ఘ‌ట‌న చోటు చేసుకొని కొద్ది రోజులు కూడ గ‌డ‌వ‌క ముందే బేగంపేట‌లో మ‌రో పేకాట క‌ల‌క‌లం రేపిన‌ది. బేగంపేట‌లోని ఓ అపార్టుమెంట్‌లో అర్థ‌రాత్రి గుట్టుచ‌ప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నార‌నే క‌చ్చిత‌మైన స‌మాచారం మేర‌కు పోలీసులు దాడులు చేప‌ట్టారు. ఈ దాడుల‌లో రూ.22ల‌క్ష‌ల న‌గ‌దు, 150 మ‌ద్యం సీసా బాటిల్ల‌ను, క్యాసినో కాయిన్స్ స్వాధీనం చేసుకొని#పేకాట అడ్డా పై పోలీసుల దాడులు{#}festival;police;Diwaliపేకాట అడ్డా పై పోలీసుల దాడులు.. ఆ విష‌యంపై స్థానికులు ఆగ్ర‌హంపేకాట అడ్డా పై పోలీసుల దాడులు.. ఆ విష‌యంపై స్థానికులు ఆగ్ర‌హం#పేకాట అడ్డా పై పోలీసుల దాడులు{#}festival;police;DiwaliSat, 06 Nov 2021 10:28:02 GMTపేకాట, క్యాసినో దందా సూత్రధారి గుత్తా సుమన్‌ను ఇటీవ‌ల కస్టడీలోకి తీసుకొని విచారించ‌డంతో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌చ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. ఈ ఘ‌ట‌న చోటు చేసుకొని కొద్ది రోజులు కూడ  గ‌డ‌వ‌క ముందే  బేగంపేట‌లో మ‌రో పేకాట క‌ల‌క‌లం రేపిన‌ది. బేగంపేట‌లోని ఓ అపార్టుమెంట్‌లో అర్థ‌రాత్రి గుట్టుచ‌ప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నార‌నే క‌చ్చిత‌మైన స‌మాచారం మేర‌కు పోలీసులు దాడులు చేప‌ట్టారు. ఈ దాడుల‌లో రూ.22ల‌క్ష‌ల న‌గ‌దు, 150 మ‌ద్యం సీసా బాటిల్ల‌ను, క్యాసినో కాయిన్స్ స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు పోలీసులు.

 అర‌వింద్ అగ‌ర్వాల్ అనే వ్య‌క్తి నిర్వ‌హిస్తున్న పేకాట అడ్డాలో పోలీసులు సోదాలు జ‌రిపారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారంతో ఏక‌కాలంలో పేకాట అడ్డాల‌పై సోదాలు నిర్వ‌హించారు. దాదాపు 30 మందికి పైగా పేకాటరాయుళ్లను పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అంద‌రికీ ఇన్విటేష‌న్ పంపి నిర్వ‌హాకుడు అర‌వింద్ అగ‌ర్వాల్ ర‌ప్పించాడు.

అర‌వింద్ క్యాసినో నిర్వ‌హిస్తున్నాడు అని స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దీపావళి పండుగ రోజు రాత్రి స‌మ‌యంలో అర‌వింద్ చెప్పిన‌ట్టుగా పేకాట రాయుళ్లంద‌రూ అత‌ని ఇంటికి చేరుకున్నారు. అదే స‌మ‌యంలో టాస్క్‌ఫోర్స్‌, బేగంపేట పోలీసులు జాయింట్ ఆప‌రేష‌న్ కొన‌సాగించారు. పేకాట అడ్డాపై దాడి చేసిన విష‌యాన్ని తెలుసుకున్న హైద‌రాబాద్ లో ఉన్న ఓ ప్ర‌ముఖ నాయ‌కుడు జోక్యం చేసుకొని పేకాట రాయుళ్ల‌ను త‌ప్పించిన‌ట్టు స‌మాచారం.

పేకాట స్థావ‌రంలో 20 నుంచి 30 మంది వ‌ర‌కు ప‌ట్టుబడితే కేవ‌లం ఐదు మంది పేకాట రాయుళ్ల‌తో పాటు రూ.12 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు ప్ర‌క‌టించారు. తొలుత ఓ మీడియాకు పోలీసులు రూ.22ల‌క్ష‌లు, 150 మందు సీసాలు స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం ఇచ్చిన పోలీసులు ఆ వెంట‌నే మాట మార్చ‌డం ఏమిట‌ని స్థానికులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. చాలా మందితో పాటు అధిక మొత్తంలో డ‌బ్బును ప‌ట్టుకెళ్లి కేవ‌లం ఐదుగురు నిందితుల‌ను చూపెట్ట‌డం ఏమిట‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ అంశంపై పోలీసులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి మ‌రి.





భారత్‌పై చైనా కుట్ర.. బయటపెట్టిన అమెరికా..?

విశాఖను ఎక్జికూటివ్ రాజధాని గా గుర్తించిన ఇండియన్ నేవీ..!

జ‌గ‌న్‌కు సొంత జిల్లాలో బిగ్ షాక్‌...!

ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?

న‌వంబ‌ర్ 9న‌ మరో అల్పపీడనం

వారెవా: ఆ ఒక్క మాత్రతో కరోనాకు చెక్..?

యాత్రకు నాలుగేళ్లు : జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన జగన్..!

పెట్రో వాత: ఈ రాష్ట్రాలు గ్రేట్.. వ్యాట్ తగ్గించాయి!

జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>