PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-293f16f1-f1a2-4d82-adf6-3faef95e8832-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-293f16f1-f1a2-4d82-adf6-3faef95e8832-415x250-IndiaHerald.jpgకరోనాకు ఇప్పటి వరకూ ఎక్కువగా టీకాలే అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాలు కరోనా రాకుండా వేయించుకుంటాం.. ఇక .. కరోనా వస్తే చికిత్స కోసం ఇప్పటి వరకూ అనేక ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిలో ఏవి పని చేస్తాయన్నది ఇప్పటికీ ఆ వైద్యులకే అంతుబట్టడం లేదు. రెమిడిసివర్ వంటి ఔషధాలు వాడుతున్నాం. కొన్నాళ్ల క్రితం మన డీఆర్‌డీవో ఓ పౌడర్ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు కొత్తగా కరోనా చికిత్సకు మాత్రలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్‌ యాంటీ వైరల్‌ మాత్రను అందుcoronavirus {#}Coronavirusవారెవా: ఆ ఒక్క మాత్రతో కరోనాకు చెక్..?వారెవా: ఆ ఒక్క మాత్రతో కరోనాకు చెక్..?coronavirus {#}CoronavirusSat, 06 Nov 2021 09:54:02 GMTకరోనాకు ఇప్పటి వరకూ ఎక్కువగా టీకాలే అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాలు కరోనా రాకుండా వేయించుకుంటాం.. ఇక .. కరోనా వస్తే చికిత్స కోసం ఇప్పటి వరకూ అనేక ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిలో ఏవి పని చేస్తాయన్నది ఇప్పటికీ ఆ వైద్యులకే అంతుబట్టడం లేదు. రెమిడిసివర్ వంటి ఔషధాలు వాడుతున్నాం. కొన్నాళ్ల క్రితం మన డీఆర్‌డీవో ఓ పౌడర్ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది.


ఇప్పుడు కొత్తగా కరోనా చికిత్సకు మాత్రలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్‌ యాంటీ వైరల్‌ మాత్రను అందుబాటులోకి తెచ్చింది. ఈ మాత్ర సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే ప్రయోగ పరీక్షల్లో తేలిందట. కరోనా వచ్చిన వారు  ఈ మాత్ర వేసుకుంటే ఆస్పత్రుల్లో చేరే అవసరం రానేరాదట. అంతే కాదు.. ఈ మాత్రంతో 90శాతం మేర మరణాలను తగ్గించవచ్చట. దీంతో కరోనా చికిత్సకు తొలి సులభమైన ఔషధంగా ఈ మాత్రను  చెబుతోంది ఫైజర్ సంస్థ.


ఫైజర్ సంస్థ ఈ మాత్రను 775మందిపై ప్రయోగించి చూసింది. ఈ ప్రాథమిక పరీక్షల ఫలితాలను ఫైజర్‌ విడుదల చేసింది. వ్యాక్సిన్‌ తీసుకోనివారు, స్వల్ప నుంచి ఓ మోస్తరు కొవిడ్‌ లక్షణాలు కలిగిన వారిపైనా ప్రయోగాలు చేసింది. అంతే కాదు. ఆస్పత్రిలో చేరే ముప్పున్న ఊబకాయం, మధుమేహులు, హృద్రోగ వ్యాధులున్న వారిపైనా ఈ ప్రయోగం నిర్వహించారు. కరోనా లక్షణాలు ప్రాథమిక దశలో ఉన్నవారిపై 3నుంచి 5 రోజులలోపు చికిత్స ప్రారంభించారు. వారిలో కొంత మందికి ఫైజర్‌ మాత్రతోపాటు యాంటివైరల్‌ డ్రగ్‌ ఇచ్చారు.


ఈ ఫైజర్‌ మాత్ర తీసుకున్న వారిలో ఆస్పత్రిలో చేరే అవసరం 90శాతం తగ్గిపోయిందట. ఆ మిగిలిన ఒక శాతం మందిలోపు ఆస్పత్రిలో చేరినా ఎవరూ వైరస్‌తో మరణించలేదట. బాగానే ఉంది. ఈ  కరోనా మాత్ర అందుబాటులోకి వస్తే వయసు మీరిన వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఈ కరోనా మాత్రకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది.  కొన్ని వారాలు, నెలల్లో అనుమతి వచ్చే అవకాశం ఉందని ఫైజర్‌ చెబుతోంది.



ఇలాంటి సీఎం ఉంటే ప్రజలు కాదంటారా..?

యాత్రకు నాలుగేళ్లు : జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన జగన్..!

పెట్రో వాత: ఈ రాష్ట్రాలు గ్రేట్.. వ్యాట్ తగ్గించాయి!

జగన్ : మాటిచ్చాను.. నిలబెట్టుకున్నాను.. !

యాత్రకు నాలుగేళ్లు : వెలుగు నింపిన అడుగుజాడలు.. ?

యాత్రకు నాలుగేళ్లు: నవరత్నాలకు బీజం అప్పుడే..?

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>