PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-a-story-on-ycp-and-bjp-political-equations0f040e76-c91f-4e30-adfa-6e481a88f3c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-a-story-on-ycp-and-bjp-political-equations0f040e76-c91f-4e30-adfa-6e481a88f3c6-415x250-IndiaHerald.jpgరాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. నాలుగు సీట్లు గెలిచినంత మాత్రానా ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప‌లేం.. అలాగే నాలుగు సీట్లు ఓడిపోయినంత మాత్ర‌న అధికారం కోల్పోతార‌ని కూడా తేల్చ‌లేం. రాజ‌కీయ ర‌ణ‌రంగంలో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితులు మారుతూనే ఉంటాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. అధికార టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయం అని చెప్పుకుంటూ ప్ర‌జ‌ల్లోకి వెళుతోంది. అయితే, తెలంగాణ‌లో గ‌తంలో కంటే ప్ర‌స్తుతం గ్రాఫ్ బాగానే పెరిగింది. కానీ, అది అధికార పార్టీనBJP{#}Huzur Nagar;Balupu;Telangana Rashtra Samithi TRS;Huzurabad;MLA;Congress;Party;Assembly;Bharatiya Janata Partyతెలంగాణ‌లో బీజేపీ నిజంగా బ‌ల‌ప‌డుతుందా..?తెలంగాణ‌లో బీజేపీ నిజంగా బ‌ల‌ప‌డుతుందా..?BJP{#}Huzur Nagar;Balupu;Telangana Rashtra Samithi TRS;Huzurabad;MLA;Congress;Party;Assembly;Bharatiya Janata PartyFri, 05 Nov 2021 07:17:27 GMTరాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. నాలుగు సీట్లు గెలిచినంత మాత్రానా ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప‌లేం.. అలాగే నాలుగు సీట్లు ఓడిపోయినంత మాత్ర‌న అధికారం కోల్పోతార‌ని కూడా తేల్చ‌లేం. రాజ‌కీయ ర‌ణ‌రంగంలో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితులు మారుతూనే ఉంటాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. అధికార టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయం అని చెప్పుకుంటూ ప్ర‌జ‌ల్లోకి వెళుతోంది. అయితే, తెలంగాణ‌లో గ‌తంలో కంటే ప్ర‌స్తుతం గ్రాఫ్ బాగానే పెరిగింది. కానీ, అది అధికార పార్టీని ఓడించేంత బ‌లంగా మాత్రం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


   2018 ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒకే సీటు సాధించిన బీజేపీ.. త‌రువాత జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఏకంగా  పార్ల‌మెంట్ స్థానాల‌ను త‌మ ఖాతాలో వేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నిక తరువాత 2019లో వ‌చ్చిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో బీజేపీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. ఆ త‌రువాత 2020లో దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ర‌ణంతో ఉప ఎన్నిక అనివార్య‌మ‌యింది. ఈ ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం వ‌చ్చిన సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో బీజేపీ ఘోర‌ప‌రాభ‌వాన్ని చూసింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలుపొందాడు.

 అయితే, బీజేపీకి ఉన్న మూడు ఎమ్మెల్యే స్థానాల్లో ఆ ముగ్గురు నాయ‌కులు బ‌లంగా ఉన్నారు. పార్టీతో సంబంధం లేకుండా ఎక్కువ శాతం మంది క్యాండిడేట్‌ను చూసి మాత్రమే ఓటు వేశార‌ని తెలుస్తోంది. ఈ అంశం హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో స్ప‌ష్టంగా కనిపించింది. బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ ఎక్క‌డా కూడా తాను బీజేపీ అభ్య‌ర్థిని అని చెప్పుకోలేదు. త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను ముందు పెట్టి, ఆత్మ‌గౌర‌వం నినాదంతో ముందుకు వెళ్లాడు.


 క‌మ‌ళం గుర్తుపై కాకుండా ఈట‌ల సొంత ఇమేజ్‌పై గెలిచాడ‌ని కాంగ్రెస్ ప‌దేప‌దే చెప్పుకొస్తుంది. ఇదే త‌రుణంలో వాపును చూసి బ‌లుపు అనుకుంటున్నారు అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణ‌లో కాస్త బ‌ల‌ప‌డ్డ అధికారంలోకి మాత్రం రావ‌డం క‌త్తిమీద సాము లాంటిదే. ఎందుకంటే, బీజేపీకి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేక‌పోవ‌డం ఒక ప్ర‌ధాన‌ కార‌ణం. మ‌రి రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో చూడాలి.



తెలంగాణ‌లో బీజేపీ నిజంగా బ‌ల‌ప‌డుతుందా..?

అయ్యో దేవుడా.. పేదరికమే ప్రాణం తీసింది?

అబ్బా..ప్రోమో తోనే మతిపోగొట్టాడుగా..!

తెలుగు అకాడమీ కేసులో బిగ్ ట్విస్ట్ !

కోవిడ్ అలెర్ట్ : శరీరంలో 1700 యాంటీబాడీలు గుర్తింపు

యాదాద్రి సుందర దృశ్యాలు.. చూస్తే మైమరచిపోతారు?

విజయ్ సినిమా కోసం అంతా రెడీ చేసిన వంశీ పైడిపల్లి..!

స్టార్ హీరో ప్రవర్తనపై ఘాటు కామెంట్ చేసిన తాప్సీ..!

మోడీ గారు.. మా పార్టీ లో చేరండి?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>