PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpdb58c1cf-c89a-461f-bd37-1942309dc522-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpdb58c1cf-c89a-461f-bd37-1942309dc522-415x250-IndiaHerald.jpgవిశాఖ రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న కీల‌కంగా లేరు. మ‌ధ్య మ‌ధ్య‌లో ఏదో క‌నిపించి వెళ్తున్నారే కానీ ఆయ‌న‌పై ఎవ్వ‌రికీ స‌రైన అభిప్రాయం కూడా లేదు. ముఖ్యంగా రాజ‌కీయంగా ప‌దవులు అందుకోవ‌డ‌మే త‌న ధ్యేయంగా సాగిన ప్రయాణం ఎంద‌రినో క‌ల‌వ‌ర పెట్టింది. ప‌దవులు ఉంటేనే మాట్లాడే నేత‌గా చాలా చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. tdp{#}CBN;avanthi srinivas;Vishakapatnam;TDP;YCP;Party;media;Heroబాబు వ‌ద్ద‌న్నాడ్రా : వాల్తేరు శీను ఇక ఇంటికే!బాబు వ‌ద్ద‌న్నాడ్రా : వాల్తేరు శీను ఇక ఇంటికే!tdp{#}CBN;avanthi srinivas;Vishakapatnam;TDP;YCP;Party;media;HeroFri, 05 Nov 2021 22:52:40 GMTతెలుగుదేశం పార్టీ లో ఉన్నా లేకున్నా ఒక్క‌టే అన్న విధంగా ఉన్నాడొక లీడ‌ర్. ఆస్తులు పోగేసుకున్న ఆ లీడ‌ర్ కు సినిమాలంటే చాలా ఇష్టం. ఆ విధంగా సినీ ఫ‌క్కీలోనే రాజ‌కీయాలు నెర‌పే సత్తా ఉంది. అంతేకాదు వీలుంటే మ‌రో సినీ హీరో  పార్టీలోకి వెళ్లినా వెళ్తాడు ఆయ‌న. ఎందుకంటే త‌న మార్కు రాజ‌కీయాలు న‌డిపే స‌త్తా ఒక్క అక్క‌డే ఉంద‌న్న ఫీలింగులో ఇప్పుడిప్పుడే ఉన్నాడు.
ఆయ‌నే గంటా శ్రీ‌నివాస‌రావు. గ‌త కొద్దికాలంగా ఎక్క‌డున్నాడో ఏం చేస్తున్నాడో కానీ బాబు కూడా ఆయ‌న‌పై దృష్టి పెట్ట‌డం లేద‌న్న వార్త‌లే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఆయ‌న‌కు నో చెప్పాడ‌న్న టాక్ ఒక‌టి న‌డుస్తోంది కొన్ని మీడియా లీక్స్ ద్వారా!

విశాఖ రాజ‌కీయాల్లో తిరుగులేని నేత‌గా గుర్తింపు గంటా శ్రీ‌ను ఇప్పుడు ఆ ప్రాభ‌వాన్నో గ‌త వైభ‌వ ఛాయ‌నో కోల్పోతున్నారు. ఒక‌ప్పటి క‌న్నా ఇప్పుడు చాలా చాలా సైలెంట్ అయిపోయారు. పేరుకు టీడీపీలో ఉన్నా పట్టించుకునే వారే లేరు.ఈ నేప‌థ్యంలో స‌రైన గుర్తింపు లేని చోటు ఎందుక‌ని వైసీపీ వైపు చూసిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ను విజ‌య సాయిరెడ్డి రానివ్వ‌లేదు. త‌న హ‌వాకు ఎక్క‌డ అడ్డం ప‌డ‌తాడో అన్న భ‌యంతోనో ముంద‌స్తు జాగ్ర‌త్త‌తోనో ఆయ‌న‌ను రానివ్వ‌లేదు. తరువాత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న ఇంటికే ప‌రిమితం అయిపోయారు కానీ ఎక్క‌డా  పెద్ద‌గా హ‌ల్ చ‌ల్ చేసిన దాఖ‌లాలేవీ లేవు.


విశాఖ రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న కీల‌కంగా లేరు. మ‌ధ్య మ‌ధ్య‌లో ఏదో క‌నిపించి వెళ్తున్నారే కానీ ఆయ‌న‌పై ఎవ్వ‌రికీ స‌రైన అభిప్రాయం కూడా లేదు. ముఖ్యంగా రాజ‌కీయంగా ప‌దవులు అందుకోవ‌డ‌మే త‌న ధ్యేయంగా సాగిన ప్రయాణం ఎంద‌రినో క‌ల‌వ‌ర పెట్టింది. ప‌దవులు  ఉంటేనే మాట్లాడే నేత‌గా చాలా చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నారు.

 
ఈ నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీ వీడినా కూడా పెద్ద‌గా వ‌చ్చే లాభం ఏమీ ఉండ‌దు. జ‌న‌సేన‌కు ఇప్ప‌టికీ ఇలాంటి నాయ‌కుల అవ‌స‌రం ఉందేమో కానీ టీడీపీకి లేద‌నే తేలిపోయింది. అందుకే ఆయ‌న‌ను చాలా మంది  దూరం ఉంచారు. కేవ‌లం రాజ‌కీయ ప‌ద‌వులే కాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కూడా మాట్లాడి నెగ్గుకు రావాల‌ని, అంతేకానీ డ‌బ్బులు పంచితే గెలుస్తాం అని అనుకోవ‌డం ఓ పెద్ద త‌ప్పిదం అని ఆయ‌న గురించి తెలిసిన వారు చేసే వ్యాఖ్య. కొంత కాలం వేర్వేరు వ్యాపారాల్లో రాణించిన దాఖ‌లాలు ఉన్నా కానీ ఉత్త‌రాంధ్ర‌లో త‌న‌కంటూ ఓ వ‌ర్గంను నిలుపుకోలేక‌పోయారు. బొత్స‌కు పోటీగా ఎదిగే ప్ర‌య‌త్నం చేసినా కానీ ఆ విధంగా కూడా రాణించ‌లేక‌పోయారు. కొద్దో గొప్పో శిష్యుడు అవంతి శ్రీ‌ను వైసీపీలో రాణిస్తున్నా ఈయ‌న మాత్రం విప‌క్ష స‌భ్యుడిగా ఉంటూ మాట వ‌రుస‌కు కూడా వైసీపీ ని ప్ర‌శ్నించ‌డం కాదు క‌దా ప‌ల్లెత్తు మాట కూడా అన‌డం లేదు. అదే మేజిక్కు!





ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజీవ్ కనకాల...!

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>