PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgకొన్ని నెల‌లుగా దూసుకుపోతున్న పెట్రోల్, డీజీల్ ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఎక్సైజ్ సుంకాలు త‌గ్గించింది. దీంతో పెట్రోల్‌, డీజీల్ రేట్లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే బాట‌ను అనుస‌రించాయి. పెట్రోల్‌, డీజీల్‌పై దాదాపుగా రూ.7 త‌గ్గించాయి అస్సాం, త్రిపుర‌, క‌ర్ణాట‌క‌, గోవా, సిక్కిం రాష్ట్రాలు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ ధ‌ర రూ.12, డీజీల్ ధ‌ర‌లు రూ.15 మేర త‌గ్గ‌బోతున్నాయి. బీహార్ లోని బీజేపీ-జేడీయూ సంకీర్ణ ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజీల్ పై సుంకాన్ని త‌గ్గించkcr-jagan{#}Goa;Bihar;Diesel;Petrol;Bharatiya Janata Party;Telangana;Andhra Pradesh;central government;Teluguపెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల‌పై తెలుగు సీఎంల వైఖ‌రేంటి..?పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల‌పై తెలుగు సీఎంల వైఖ‌రేంటి..?kcr-jagan{#}Goa;Bihar;Diesel;Petrol;Bharatiya Janata Party;Telangana;Andhra Pradesh;central government;TeluguFri, 05 Nov 2021 08:59:41 GMTకొన్ని నెల‌లుగా దూసుకుపోతున్న పెట్రోల్, డీజీల్ ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఎక్సైజ్ సుంకాలు త‌గ్గించింది. దీంతో పెట్రోల్‌, డీజీల్ రేట్లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే బాట‌ను అనుస‌రించాయి. పెట్రోల్‌, డీజీల్‌పై దాదాపుగా రూ.7 త‌గ్గించాయి అస్సాం, త్రిపుర‌, క‌ర్ణాట‌క‌, గోవా, సిక్కిం రాష్ట్రాలు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ ధ‌ర రూ.12, డీజీల్ ధ‌ర‌లు రూ.15 మేర త‌గ్గ‌బోతున్నాయి. బీహార్ లోని బీజేపీ-జేడీయూ సంకీర్ణ ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజీల్ పై సుంకాన్ని త‌గ్గించింది. ఉత్త‌రాఖాండ్ పెట్రోల్‌పై రూ.2 త‌గ్గించింది.



 బీజేపీ అధికారంలో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోల్‌, డీజీల్ పై రూ.12 త‌గ్గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. గుజ‌రాత్ కూడా ఏడు రూపాయ‌లు త‌గ్గించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గోవా ఇలా బీజేపీ మిత్ర‌ప‌క్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల‌పై సుంకాలు త‌గ్గించాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వం సంగ‌తేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను త‌గ్గించి మ‌రింత ఉప‌శ‌మ‌నం క‌లిగించాల‌ని కోరుతున్నారు. కేంద్రం త‌గ్గింపుతో పెట్రోల‌పై రూ.6, డీజీల్‌పై రూ.11 ధ‌ర‌లు త‌గ్గాయి.


 ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా వ్యాట్‌పై త‌గ్గింపు నిర్ణ‌యం తీసుకుంటే మ‌రింత రేట్లు త‌గ్గుతాయి.  తెలంగాణ ప్ర‌భుత్వం ఇంధనంపై 32.5 శాతం వ్యాట్ విధిస్తోంది. ఏపీ కూడా దాదాపు అదే స్థాయిలో వ‌సూల్ చేస్తోంది. దేశంలో పెట్రోల్, డీజీల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. దానికి తోడు క‌ట్ట‌డి చేయలేని స్థాయిలో ద్ర‌వ్యోల్భ‌ణం చేరింది. వీటికి తోడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఎప్పుడో సెంచ‌రి కొట్టి ముందుకు దూసుకుపోతున్నాయి.


 ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌తో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో ఓ మెట్టు దిగివ‌చ్చి ఎక్సైజ్ సుంకంలో కోత విధిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే, రూ.40 పెంచి 5 త‌గ్గించ‌డం ఏంటి అనే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజీల్ పై వ్యాట్ త‌గ్గిస్తే మ‌రింత ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది.



టాలీవుడ్ లో తన సత్తా చాటిన మాలీవుడ్ హీరో..!!

ఇద్దరు హీరోలు.. ఒకే బయోపిక్.. మీకర్థమవుతుందా?

చైనా అణు రహస్యాలు బయటపెట్టిన అమెరికా..?

అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఉద్యోగులకు దీపావళి కానుకగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు..?

అయ్యో దేవుడా.. పేదరికమే ప్రాణం తీసింది?

అబ్బా..ప్రోమో తోనే మతిపోగొట్టాడుగా..!

తెలుగు అకాడమీ కేసులో బిగ్ ట్విస్ట్ !

కోవిడ్ అలెర్ట్ : శరీరంలో 1700 యాంటీబాడీలు గుర్తింపు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>