MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajani6c457321-baa5-426f-be94-89be0a5cde28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajani6c457321-baa5-426f-be94-89be0a5cde28-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ అన్న పదానికి ఆయనే నిలువెత్తు రూపం. ఒకనాడు ఆయన సినిమాలను శాసించారు. వెండి తెర మీద ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే వచ్చేవి. ఆయన మానియాతో కొన్ని తరాలు ఊగిపోయాయి. ఆయనే రజనీకాంత్. రజనీకాంత్ ఇప్పటికి 168 సినిమాలు నటించారు. తాజా చిత్రం తమిళంలో అన్నాత్తేగా రిలీజ్ అయితే తెలుగులో పెద్దన్నగా వచ్చింది rajani{#}American Samoa;silver screen;Chennai;Hyderabad;Diwali;Chitram;Cinemaసూపర్ స్టార్ కి ఇదే కరెక్ట్ టైమ్... ?సూపర్ స్టార్ కి ఇదే కరెక్ట్ టైమ్... ?rajani{#}American Samoa;silver screen;Chennai;Hyderabad;Diwali;Chitram;CinemaFri, 05 Nov 2021 20:00:00 GMTసూపర్ స్టార్ అన్న పదానికి ఆయనే నిలువెత్తు రూపం. ఒకనాడు ఆయన సినిమాలను శాసించారు. వెండి తెర మీద ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే వచ్చేవి. ఆయన మానియాతో కొన్ని తరాలు ఊగిపోయాయి. ఆయనే రజనీకాంత్.

రజనీకాంత్ ఇప్పటికి 168 సినిమాలు నటించారు. తాజా చిత్రం తమిళంలో అన్నాత్తేగా రిలీజ్ అయితే తెలుగులో పెద్దన్నగా వచ్చింది. దీపావళి వేళ రిలీజ్ అయిన పెద్దన్న అనుకున్న అంచనాలు అందుకోలేదు. పైగా ఈ మూవీ రొటీన్ మూవీ అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఎర్లీ ఎయిటీస్ నాటి కధ అని కూడా చెబుతున్నారు. మొత్తానికి కారణాలు ఏమైనా కూడా అన్నాత్తే మూవీ విజయం మాత్రం సాధించలేదు.

మూవీ చేయడానికి రజనీ చాలా కష్టపడ్డారు. అంటే ఫైట్లు, డ్యాన్సుల కోసం మాత్రమే కాదు, ఆయన ఒక వైపు ఆరోగ్యంతో పోరాడుతూ మూవీ చేశారు. అన్నాత్తే హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతున్న  టైమ్ లోనే ఆయన ఆసుపత్రి పాలు అయ్యారు. ఆ తరువాత కూడా అమెరికా వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా చెన్నై ఆసుపత్రిలో చేరి సర్జరీ కూడా చేయించుకున్నారు. మొత్తానికి రజనీ ఆరోగ్యం ఒక వైపు ఇబ్బంది పెడుతోంది. ఆయన రాజకీయాలకు గుడ్ బై కొట్టడానికి కూడా అదే కారణం. అలాంటి రజనీ ఇపుడు సినిమాలు చేయడానికి కూడా అడ్డుపడుతోంది.

ఒక వైపు సినిమాలు హిట్ కావడం లేదు.మరో వైపు వయోభారం, అనారోగ్యం. దాంతో రజనీ అన్నాత్తేతో ఫుల్ స్టాప్ పెడతారా అన్న చర్చ అయితే వస్తోంది. రజనీ సినిమాలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారు అని కొంతకాలంగా ప్రచారం అయితే ఉంది. లేటెస్ట్ గా ఆయన సర్జరీతో అది ఇంకా ఎక్కువైంది. ఇపుడు అన్నాత్తే హిట్ అయితే సీన్ ఏమో కానీ ఆ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమో రజనీ ఆలోచనలు మారుతాయా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఈ ఏజ్ లో హెల్త్ కండిషన్ బాగు లేకున్నా రజనీ మూవీస్ చేయాలని మాత్రం ఎవరూ చెప్పరు, కోరుకోరు. ఆయన కనుక నో మూవీస్ అంటే మాత్రం ఫ్యాన్స్ బాధపడినా కరెక్ట్ డెసిషన్ అని మిగిలిన అంతా అంటారేమో.





అదరగొడుతున్న నాని ముద్దుగుమ్మలు..!

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>