Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpf11ace9f-a0d2-4fc8-aa80-087ab5d328bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpf11ace9f-a0d2-4fc8-aa80-087ab5d328bf-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాలు గత కొంత కాలం నుంచి ఎంతో హాట్ హాట్ గా సాగుతున్నాయి. దీనికి కారణం తెలంగాణాలో వరుసగా ఎన్నికలు వస్తూ ఉండడమే. గతంలో దుబ్బాక నియోజక వర్గంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో ఎన్నికలు వచ్చాయి. ఇక ఈ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ కాకుండా బిజెపి విజయం సాధించింది. ఇక అటు వెంటనే జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్ ఇచ్చే విధంగా బిజెపి సీట్లు గెలుచుకుంది. ఇక ఆ తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ప్రBjp{#}రాజీనామా;Elections;politics;Assembly;Huzurabad;KCR;Bharatiya Janata Party;Party;MLAబిజెపి చెప్పేవి అన్నీ వట్టిమాటలేనా.. ఏమో మరి?బిజెపి చెప్పేవి అన్నీ వట్టిమాటలేనా.. ఏమో మరి?Bjp{#}రాజీనామా;Elections;politics;Assembly;Huzurabad;KCR;Bharatiya Janata Party;Party;MLAFri, 05 Nov 2021 16:00:00 GMTతెలంగాణ రాజకీయాలు గత కొంత కాలం నుంచి ఎంతో హాట్ హాట్ గా సాగుతున్నాయి.  దీనికి కారణం తెలంగాణాలో వరుసగా ఎన్నికలు వస్తూ ఉండడమే. గతంలో దుబ్బాక నియోజక వర్గంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో  ఎన్నికలు వచ్చాయి. ఇక ఈ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ కాకుండా బిజెపి విజయం సాధించింది. ఇక అటు వెంటనే జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు షాక్ ఇచ్చే విధంగా బిజెపి సీట్లు గెలుచుకుంది. ఇక ఆ తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి.


 ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ప్రయత్నించినప్పటికీ చివరికి టిఆర్ఎస్ మరోసారి తమ సిట్టింగ్ స్థానం దక్కించుకుని పరువు నిలబెట్టుకుంది. ఇకపోతే ఇటీవల హుజురాబాద్ లో ఉప ఎన్నికలు జరిగాయి. టిఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి   ఉప ఎన్నికకు వెళ్లారు. ఈ ఉప ఎన్నికల్లోటిఆర్ఎస్ పార్టీ ఎంత ప్రయత్నించినప్పటికీ చివరికి బిజెపి విజయం సాధించింది. కాగా ప్రస్తుతం తెలంగాణలో బిజెపికి ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే  కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి పార్టీ అటు వందమందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్న టిఆర్ఎస్ పార్టీకి సవాళ్ళు విసురుతూ ఉండడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.


 రాబోయే అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తప్పనిసరిగా టిఆర్ఎస్ ను ఓడించి తీరుతామని ప్రస్తుతం బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే బీజేపీ నేతలు చేస్తున్న సవాళ్ళు వినడానికి బాగానే ఉన్నప్పటికీ వాస్తవంగా చూసుకుంటే మాత్రం అవన్నీ వట్టి మాటలు అన్నది అర్ధమవుతుంది అంటున్నారు కొంతమంది జనాలు. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో ఎంతగానోప్రజాదరణ పొంది ఉంది. అదే సమయంలో బీజేపీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో బుడిబుడి అడుగులు వేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో కింది స్థాయిలో బలమైన క్యాడర్ కూడా లేని బిజెపి.. ఇక కేసీఆర్ కు సవాల్ విసురుతూ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం అనడం మాత్రం వట్టి మాటలే అంటూ కొట్టిపారేస్తున్నారు కొంత మంది విశ్లేషకులు.



కొర‌డాతో కొట్టించుకున్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం..! ఎందుకో తెలుసా..?

విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా?

ఆ జట్టు ఓటమి.. మాకు సంతోషం : అశ్విన్

నోట్లు రద్దయ్యి ఐదేళ్లు అవుతున్నా ఆశించిన ఫలితాలు లేవు..

అగ్నిప్ర‌మాదం..బూడిదైన దుకాణం..!

విరాట్ కోహ్లీ జెర్సీ గురించి ఈ సీక్రెట్ మీకు తెలుసా?

విరాట్ కోహ్లీ కీపింగ్ కూడా చేశాడు.. ఎప్పుడో తెలుసా?

నెల్లూరు టీడీపీలో ఇంత గంద‌ర‌గోళ‌మా...!

వామ్మో.. అమెజాన్ లో కవర్ ఆర్డర్ చేస్తే.. పాస్పోర్ట్ వచ్చింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>