MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/siva-karthikeyan-telugu-movie-gossip39757a49-2ca0-455d-ac6a-8299529a92c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/siva-karthikeyan-telugu-movie-gossip39757a49-2ca0-455d-ac6a-8299529a92c0-415x250-IndiaHerald.jpgస్వయం కృషి అన్న పదం వినడానికి ఈజీగా ఉన్నా పాటించడానికి ఎంత కష్టమో, ఎన్ని అవరోధాలను అధిగమించాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. రంగం ఏదైనా ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా అక్కడ నిలదొక్కుకోవాలి అంటే అంత చిన్న విషయమేమీ కాదు, ఎంతో ప్రతిభ, ఓర్పు, నేర్పు ఉంటే తప్ప అనుకున్నది సాధించడం కుదరదు. SIVA-KARTHIKEYAN-TELUGU-MOVIE-GOSSIP{#}Athadu;Nijam;Tollywood;Chitram;Telugu;Director;Shiva;lord siva;Hero;Tamil;Cinemaశివ కార్తికేయన్ కు టాలీవుడ్ డైరెక్టర్ ఛాన్స్... ?శివ కార్తికేయన్ కు టాలీవుడ్ డైరెక్టర్ ఛాన్స్... ?SIVA-KARTHIKEYAN-TELUGU-MOVIE-GOSSIP{#}Athadu;Nijam;Tollywood;Chitram;Telugu;Director;Shiva;lord siva;Hero;Tamil;CinemaFri, 05 Nov 2021 19:27:27 GMTస్వయం కృషి అన్న పదం వినడానికి ఈజీగా ఉన్నా పాటించడానికి ఎంత కష్టమో, ఎన్ని అవరోధాలను అధిగమించాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. రంగం ఏదైనా ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా అక్కడ నిలదొక్కుకోవాలి అంటే అంత చిన్న విషయమేమీ కాదు, ఎంతో ప్రతిభ, ఓర్పు, నేర్పు ఉంటే తప్ప అనుకున్నది సాధించడం కుదరదు. ఇలా ఎటువంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఇండస్ట్రీలో ఎదిగిన నటులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శివ కార్తికేయన్...పేరుకు తమిళ నటుడే అయినా తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో బాగా పరిచయమే. తమిళ ఇండస్ట్రీలో ఒక టీవి యాంకర్ గా అడుగు పెట్టి , సింగర్ గా, రైటర్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా, హీరోగా మరియు నిర్మాతగా మారి తన సత్తా చాటుతూ స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు.

తమిళ అనువాదం అయిన రెమో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు ఈ హీరో కోసం తమిళ సినిమాలు చూస్తారు అంటే అతిశయోక్తి కాదు. చాలా మంది తెలుగు అభిమానులు శివ కార్తికేయన్ నటన చూడటం కోసం అతడు తమిళ  చిత్రాలను చూస్తుంటారు. తెలుగులో ఈ యంగ్ హీరోకు అంతటి క్రేజ్ ఉంది. అయితే ఈ హీరోతో ఇపుడు నేరుగా తెలుగు చిత్రం తెరకెక్కించేందుకు రెడీ అయ్యారట ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.

శివ కార్తికేయన్ మొదట డేట్స్ కొంచం కష్టం అని చెప్పినా ఆ తరువాత ఎలాగోలా అడ్జస్ట్ చేసి ఒకే చెప్పారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఇంతకీ ఆ సినిమా కథ ఏమిటి..?? డైరెక్టర్ ఎవరు..??  తెలుగు సినిమా ఖరారు అయినట్లేనా అంటే త్వరలో తెలియనున్నాయి. ఒకవేళ ఇది నిజం అయ్యి శివ కార్తికేయన్ తెలుగులో డైరెక్ట్ గా సినిమా తీశారు అంటే అనతి కాలంలోనే తెలుగులోనూ స్టార్ హీరో గుర్తింపు తెచ్చుకుని వరుస చిత్రాలు చేస్తారు అనడంలో అనుమానం లేదు. ఇప్పటికే తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్న ఈ హీరోకి ఈ సినిమా మరింత ప్లస్ అయ్యే అవకాసం ఉంది.



తెరాస వరుస సమావేశాలు హుజురాబాద్ ఎఫెక్టేనా..!

పునీత్ కి సూర్య కన్నీటి నివాళి..!

ఆ పండుగ సందర్బంగా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు..

వామ్మో బాబూ కోవ‌ర్టు ? ఆ మంత్రి !

UPSCలో ఎలా విజయం సాధించాలో చెప్పిన IAS ఆఫీసర్..!

పెట్రో వార్ : దేవుడా ఎన్నిక‌లు తెప్పించు నన్ను ర‌క్షించు!

పెట్రో వార్ : మోడీకి లాస్ ఎంతో తెలుసా?

జ‌మ్ము-కాశ్మీర్‌లో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌పై ఉగ్ర‌దాడి..!

పెట్రో వార్ : జ‌గ‌న్ కోట‌లో నిర‌స‌న సెగ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>