PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/power-cute01eb646-5985-4f58-9ed1-9c2f9fc749f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/power-cute01eb646-5985-4f58-9ed1-9c2f9fc749f8-415x250-IndiaHerald.jpgక‌రెంట్ లేక‌పోతే ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఆగిపోతుంది. అంత‌లా విద్యుత్‌ను మాన‌వుడు త‌న జీవితంలో భాగం చేసుకున్నాడు. ఒక్క గంట క‌రెంట్‌పోతే ప్ర‌జ‌ల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌లు ఆగ‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలో బొగ్గు కొర‌తతో భార‌త్ విద్యుత్ ఉత్ప‌త్తిలో సంక్షోభం ఏర్ప‌డిన విష‌యం విధిత‌మే. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వ‌లు త‌గ్గిపోవ‌డం. పున‌రుత్పాద‌క వ‌న‌రులను ఎక్కువ‌గా వినియోగించ‌కపోవ‌డం, రోజురోజుకు పెరుగుతున్న వినియోగం ఇవ‌న్ని క‌లిసి దేశంలో విద్యుత్ సంక్ష‌భం నెల‌కొంద‌ని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, తమిళనాpower{#}Nepal;Punjab;Nijam;Aqua;electricityనేపాల్ నుంచి క‌రెంటు కొంటున్న భారత్‌..!నేపాల్ నుంచి క‌రెంటు కొంటున్న భారత్‌..!power{#}Nepal;Punjab;Nijam;Aqua;electricityFri, 05 Nov 2021 11:53:31 GMTక‌రెంట్ లేక‌పోతే ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఆగిపోతుంది. అంత‌లా విద్యుత్‌ను మాన‌వుడు త‌న జీవితంలో భాగం చేసుకున్నాడు. ఒక్క గంట క‌రెంట్‌పోతే ప్ర‌జ‌ల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌లు ఆగ‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలో  బొగ్గు కొర‌తతో భార‌త్ విద్యుత్ ఉత్ప‌త్తిలో సంక్షోభం ఏర్ప‌డిన విష‌యం విధిత‌మే. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వ‌లు త‌గ్గిపోవ‌డం. పున‌రుత్పాద‌క వ‌న‌రులను ఎక్కువ‌గా వినియోగించ‌కపోవ‌డం, రోజురోజుకు పెరుగుతున్న వినియోగం ఇవ‌న్ని క‌లిసి దేశంలో విద్యుత్ సంక్ష‌భం నెల‌కొంద‌ని చెప్పొచ్చు. 


ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌, పంజాబ్ త‌దితర రాష్ట్రాల్లో  విద్యుత్‌ కోతలు ఇప్పటికే ప్రారంభ‌మ‌య్యాయి. ఎలాంటి ఇబ్బంది లేద‌ని, త‌గిన బొగ్గు నిల్వ‌లు ఉన్నాయ‌ని ప్ర‌భుత్వాలు భ‌రోసానిస్తున్నా భ‌విష్య‌త్తులో భార‌గానే విద్యుత్ సంక్షోభం నెల‌కొనే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. భార‌త్‌లో ఇలా ఉంటే మన పక్క దేశం నేపాల్‌లో మాత్రం విద్యుత్ ఎక్కువ‌గా ఉంది. అక్క‌డ జ‌ల‌విద్యుత్ ఉత్ప‌త్తి ఎక్కువ‌గా జర‌గ‌డం ఇందుకు కారణంగా చెప్పుకోవ‌చ్చు.


 ఈ సంవత్స‌రం ఆగ‌స్టులో ప్రారంభ‌మ‌యిన త‌మ‌కోషి జ‌ల‌విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 456 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నారు. దీంతో మిగులు విద్యుత్ దేశంగా నేపాల్ అవ‌త‌రించింది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఒకే సూర్యుడు- ఒకే ప్ర‌పంచం- ఒకే గ్రిడ్ ఉండాల‌ని ప్ర‌పంచానికి సూచించారు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి.  ఈ క్రమంలో ఈ నినాదాన్ని నిజం చేస్తూ అంత‌కుముందే నేపాల్ నుంచి విద్యుత్ కొనుగోలుకు భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేస్తోంది.  విద్యుత్ కొరతను అధిగమించేందుకు నేపాల్‌ నుంచి మొత్తం 39 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలుకు రెడీ అవుతోంది.


మరోవైపు భారత దేశానికి మిగులు విద్యుత్‌ను విక్రయించేందుకు ఆ దేశ‌ ఇంధన, జలవనరులు, నీటిపారుదల శాఖ కూడా ఓకే చెప్పింది.  నేపాల్‌లోని త్రిశూలి హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నుంచి 24 మెగావాట్లు, దేవీ ఘాట్‌ జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి మరో 15 మెగావాట్లు కొనుగోలు చేసేందుకు భార‌త్ సిద్ధంగా ఉంది. 39 మెగావాట్ల విద్యుత్‌ను భార‌త్‌కు విక్ర‌యించేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత మెరుగవుతాయని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.



భీమ్లా నాయ‌క్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ ?

రూటు మార్చిన బాబు.. 2024 ఎన్నిక‌లే టార్గెట్..?

జ‌గ‌న్ ఆ ప‌ని చేస్తే 2024లో కూడా మ‌ళ్లీ సీఎంనే..!

శ్రీశైలంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు

కోహ్లీ ప్లేయర్ గా సక్సెస్ కానీ కెప్టెన్ గా ?

టీమిండియా ఫైనల్స్ కి రావాలి.. పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్?

జ‌న‌సేన‌తో పొత్తు.. ఆ మున్సిపాల్టీ టీడీపీదేనా...?

ఆ వైసీపీ క‌మ్మ ఎమ్మెల్యే మ‌ళ్లీ గెలుస్తాడా...!

కేదార్‌నాథ్‌లో మోడీ ప‌ర్య‌ట‌న‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>