PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpbf704e77-bb80-4987-854e-e610b97dcc6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpbf704e77-bb80-4987-854e-e610b97dcc6a-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికలే లక్ష్యంగా అధికార వైసీపీ లో పలువురు నేతలు తమ పిల్లలను రంగంలోకి దించుతున్నారు. ముందు నుంచే వారసులను సమాయాత్తం చేసి... వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేయించాల‌ని వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మం లోనే వారిని ముందుగా నియోజ‌క‌వ‌ర్గాల్లో తిప్పుతూ జ‌గ‌న్‌కు ప‌రిచ‌యం ముఖ్యమంత్రి జగన్‌కు తమ వారసులను పరిచయం చేస్తూ జ‌గ‌న్ నుంచి భరోసాను పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లిస్టులో ఉన్న వార‌సుల ను చూస్తే శ్రీకాకుళం జిల్లా కు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తనయుడు డాక్టర్‌ ధర్మాన కృష్ణచైతన్య నరసనYsrcp{#}Chiranjeevi;sandeep;sravani;DHARMANA PRASADA RAO;Tammineni Sitaram;THOTA TRIMURTHULU;Rajya Sabha;MP;District;Vijayanagaram;Srikakulam;Telangana Chief Minister;MLA;Minister;Thota Chandrasekhar;YCP;Vizianagaram;Reddy;Ramachandrapuram;Chevireddy Bhaskarareddy;Party2024లో వైసీపీ వార‌సులు రెడీనా... ?2024లో వైసీపీ వార‌సులు రెడీనా... ?Ysrcp{#}Chiranjeevi;sandeep;sravani;DHARMANA PRASADA RAO;Tammineni Sitaram;THOTA TRIMURTHULU;Rajya Sabha;MP;District;Vijayanagaram;Srikakulam;Telangana Chief Minister;MLA;Minister;Thota Chandrasekhar;YCP;Vizianagaram;Reddy;Ramachandrapuram;Chevireddy Bhaskarareddy;PartyWed, 03 Nov 2021 12:08:00 GMT2024 ఎన్నికలే లక్ష్యంగా అధికార వైసీపీ లో పలువురు నేతలు తమ పిల్లలను రంగంలోకి దించుతున్నారు. ముందు నుంచే వారసులను సమాయాత్తం చేసి... వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేయించాల‌ని వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మం లోనే వారిని ముందుగా నియోజ‌క‌వ‌ర్గాల్లో తిప్పుతూ జ‌గ‌న్‌కు ప‌రిచ‌యం ముఖ్యమంత్రి జగన్‌కు తమ వారసులను పరిచయం చేస్తూ జ‌గ‌న్ నుంచి భరోసాను పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ లిస్టులో ఉన్న వార‌సుల ను చూస్తే శ్రీకాకుళం జిల్లా కు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తనయుడు డాక్టర్‌ ధర్మాన కృష్ణచైతన్య నరసన్నపేటలో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యే సీటే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నారు. ఇక అదే జిల్లాలో స్పీక‌ర్‌ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి వెంకట నాగ్ యాక్టివ్ గా ఉన్నారు. జ‌గ‌న్ నాగ్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ గా పోటీ చేయించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.

ఇక మాజీ మంత్రి, పార్టీ సినియ‌ర్ నేత , శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొడుకు ధర్మాన రామ్‌ మనోహర్‌ నాయుడు కూడా పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నారు. ఇక విజ‌య‌న‌గ‌రం జిల్లాలో సీనియ‌ర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు డాక్టర్‌ సందీప్ జిల్లా రాజ‌కీయాల్లో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక జిల్లా కేంద్ర‌మైన విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్ర స్వామి కుమార్తె శ్రావణి కార్పోరేష‌న్లో రెండో డిప్యూటీ మేయర్‌ పదవి ద‌క్కించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు.

ఇక మంత్రి వేణుగోపాలకృష్ణ కొడుకు చెల్లుబోయిన నరేన్ - రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కొడుకు పిల్లి సూర్యప్రకాష్‌ రామచంద్రాపురం నియోజకవర్గ రాజ‌కీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు.  ఇక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కుమారుడు తోట పృధ్వీరాజ్‌ లోక్‌సభకు పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక తిరుప‌తి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తనయుడు భూమన అభినయ్‌ రెడ్డి - ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి కూడా యాక్టివ్‌గా ఉన్నారు. మ‌రి వీరిలో జ‌గ‌న్ ఎవ‌రిని క‌రుణిస్తారో ?  చూడాలి.



ఆ దేశంలో హ‌లాల్‌, కాష‌ర్‌లు నిషేధం..!

సంక్రాంతికి సినిమాను విడుదల చేసే ప్లాన్ లో సీనియర్ హీరో..!

బాలయ్య నుండి దీపావళికి రెండు అదిరిపోయే కానుకలు..!

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>