Love Marriage: పెళైన మూడు నెలలకే భర్త కిడ్నాప్, దారుణ హత్య, భార్య బంధువులు కలిసి !
చెన్నై/తిరుత్తిణి: దూరపు బంధువులు కావడంతో యువతి, యువకుడికి ముందు నుంచి పరిచయం ఉంది. శుభకార్యాలకు కలుసుకుంటున్న యువతి, యువకుడు ప్రేమలో పడ్డారు. ఇద్దరి కులం ఒకటే కావడం, పైగా బంధువులు కావడవంతో హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని ప్రేమికులు అనుకున్నారు. అయితే ఇద్దరి అంచనాలు తారుమారైనాయి. పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు మూడు నెలల క్రితం వివాహం చేసుకుని వేరుగా కాపురం పెట్టారు. పంచాయితీలు చేసిన పెద్దలు నవ దంపతులను విడదీశారు. భార్యను ఎలాగైనా తన ఇంటికి పిలుచుకుని రావాలని భర్త అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉద్యోగానికి వెళ్లిన నవ వరుడు మాయం అయ్యాడు. కొన్ని రోజుల తరువాత నవ వరుడు దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. నవ వరుడిని కిడ్నాప్ చేసి మారి దారుణంగా చంపేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. నవ వరుడుని ఎవరు హత్య చేశారు అనే విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, నవవధువు హడలిపోయారు.
Illegal affair: ఎస్ఐ భార్యకు ఇద్దరు ప్రియులు, బ్లాక్ మెయిల్ ?, స్పాట్ పెట్టి లేపేసిన ఎస్ఐ !

దూరపు బంధువులు
తమిళనాడులోని తిరుత్తిణి సమీపంలోని తాడూర్ గ్రామంలో రాసుకుట్టి (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాసుకుట్టి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తాడూరు సమీపంలోని గ్రామంలో కీర్తనా (22) అనే యువతి నివాసం ఉంటున్నది. రాసుకుట్టి, కీర్తనా దూరపు బంధువులు కావడంతో చాలా సంవత్సరాల నుంచి వీరికి పరిచయం ఉంది.

పెళ్లి చేసుకోవాలని డిసైడ్
శుభకార్యాలకు కలుసుకుంటున్న రాసుకుట్టి, కీర్తనా ప్రేమలో పడ్డారు. ఇద్దరి కులం ఒకటే కావడం, పైగా బంధువులు కావడవంతో హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని ప్రేమికులు రాసుకుట్టి, కీర్తనా అనుకున్నారు. మూడు సంవత్సరాల నుంచి రాసుకుట్టి, కీర్తనా కలిసి తిరుగుతూ సంతోషంగా ఉంటున్నారు. అయితే ఆరు నెలల క్రితం రాసుకుట్టి, కీర్తనా అంచనాలు తారుమారైనాయి.

మూడు నెలల క్రితం పెళ్లి
రాసుకుట్టితో పెళ్లికి అమ్మాయి కీర్తనా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు రాసుకుట్టి, కీర్తనా మూడు నెలల క్రితం వివాహం చేసుకుని వేరుగా కాపురం పెట్టారు. మూడు నెల రోజుల పాటు రాసుకుట్టి, కీర్తనా దంపతులు ఆమె కుటుంబ సభ్యుల కంటపడకుండా సంతోషంగా జీవించారు.

నవదంపతులను విడదీసిన పెద్దలు
కీర్తనా ఎక్కడ ఉందో అనే విషయం ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. రాసుకుట్టి, కీర్తనాను పట్టుకుని వెళ్లి పంచాయితీలు చేసిన పెద్దలు నవ దంపతులను విడదీశారు. ఇంకోసారి మా అమ్మాయి జోలికి వస్తే నిన్ను చంపేస్తామని కీర్తనా కుటుంబ సభ్యులు రాసుకుట్టికి వార్నింగ్ ఇచ్చారు. భార్య కీర్తనాను ఎలాగైనా తన ఇంటికి పిలుచుకుని రావాలని రాసుకుట్టి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఉద్యోగానికి వెళ్లి శవమైన నవరుడు
గత నెలలో ఉద్యోగానికి వెళ్లిన నవ వరుడు రాసుకుట్టి మాయం అయ్యాడు. రాసుకుట్టి కనపడకపోవడంతో అతని కుటుంబ సభ్యులు తిరుత్తిణి ఏఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకుదిగారు. కొన్ని రోజుల తరువాత నవ వరుడు రాసుకుట్టి ఓ నది పక్కన కత్తిపోట్లకు గురై దారుణ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

కిడ్నాప్ చేసి చంపేసిన కీర్తనా ఫ్యామిలీ
నవ వరుడు రాసుకుట్టిని కీర్తనా కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారని వెలుగు చూడటం కలకలం రేపింది. నవ వరుడు రాసుకుట్టిని ఎవరు హత్య చేశారు అనే విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, నవవధువు కీర్తనా హడలిపోయారు. రాసుకుట్టి హత్య కేసులో కీర్తనా కుటుంబ సభ్యులు భైరవన్, వెంకటేషన్, సూరజ్, చక్రవర్తి అనే నలుగురిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించామని తిరుత్తిణి పోలీసు అధికారులు తెలిపారు.