PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-good-news-who-green-signal-for-that-vaccineead7bbca-e36d-4bb8-ab1d-679bf4fcd2a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-good-news-who-green-signal-for-that-vaccineead7bbca-e36d-4bb8-ab1d-679bf4fcd2a7-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు మరో టీకాకు అనుమతి లభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో కరోనాతో భయపడేవారికి ఇది శుభావార్తగా చెపొచ్చు. డబ్ల్యూహెచ్ ఓ ఆమోదం లభించడంతో ఆ సంస్థ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. Good news WHO green signal for that vaccine{#}Australia;INTERNATIONAL;Cheque;Doctor;Coronavirus;Indiaశుభవార్త.. ఆ టీకాకు WHO గ్రీన్ సిగ్నల్..!శుభవార్త.. ఆ టీకాకు WHO గ్రీన్ సిగ్నల్..!Good news WHO green signal for that vaccine{#}Australia;INTERNATIONAL;Cheque;Doctor;Coronavirus;IndiaWed, 03 Nov 2021 18:15:17 GMTదేశీయ కరోనా టీకా కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించింది. భారత్ బయోటెక్ అందించిన అదనపు డేటాతో సంతృప్తి చెందిన డబ్ల్యూహెచ్ఓ కొవాగ్జిన అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్టు అధికారికంగా తెలిపింది. దీంతో కోవాగ్జిన్ వేసుకున్నవారు ఇత దేశాల్లో ప్రయాణించేందుకు మార్గం సుగమమైంది. ఇదివరకు ఈ వ్యాక్సిన్ వేసుకున్నవారిపై పలు దేశాల్లో ప్రయాణ ఆంక్షలుండేవి.

ఇక మనదేశంలో తయారైన కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా గుర్తింపునిచ్చింది. ఈ టీకా 2డోసులు తీసుకున్న వారు తమ దేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కొవిషీల్డ్ టీకాను ఆస్ట్రేలియా గుర్తించగా.. తాజాగా కొవాగ్జిన్ కు కూడా ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ ప్రయాణీకులు, విద్యార్థులు, నైపుణ్యమైన సిబ్బంది తిరిగి ఆస్ట్రేలియా వచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది.

ఇక కోవిడ్ వ్యాక్సిన్ తో పోలిస్తే బూస్టర్ డోస్ తీసుకున్న వారికి అధిక రక్షణ ఉంటుందని లాన్సెట్ జర్నల్ అధ్యయనం తెలిపింది. ఫైజర్ బూస్టర్ డోస్ తీసుకున్న 7.28లక్షల మందిపై సర్వేచేయగా.. ఐదు నెలల క్రితం 2డోసులు తీసుకున్న వారితో పోలిస్తే ఈ బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో అధికంగా యాంటీబాడీలు ఉత్పన్నమైనట్టు వెల్లడైంది. వీరిపై కరోనా తీవ్రత తక్కువగా ఉందట. అయితే బూస్టర్ డోస్ వాడకంపై ఇంకా ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వలేదు.

కరోనాకు కాక్ టెయిల్ తో పూర్తిగా చెక్ పెట్టొచ్చని తేలింది. మోనోక్లోనల్ యాంటీబాడీస్ సామర్థ్యంపై ఏఐజీ హాస్పిటల్స్, సీసీఎంబీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇది రుజువైంది. ఒక్క ఇంజెక్షన్ తో కరోనా నుంచి రక్షణ పొందవచ్చని తేలింది. కరోనా నిర్ధారణ అయిన 3నుంచి 4రోజుల్లో ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల 100శాతం సానుకూల ఫలితాలు వస్తున్నట్టు తేలింది. మొత్తానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ కొవాగ్జిన్ కు అనుమతి ఇవ్వడంతో కరోనాను కంట్రోల్ చేసేందుకు మరో ఆయుధం దొరికినట్టయింది.






 





శుభవార్త.. ఆ టీకాకు WHO గ్రీన్ సిగ్నల్..!

హీరో ల వారసులే కాదు.. దర్శకుల వారసులు కూడా!!

ఈ తప్పులు చేస్తే చిన్న వయసులోనే వృద్ధాప్యం

భీమ్లా నాయక్ దీపావళి సర్ప్రైజ్ ఇదే!!

కళ్యాణ్ రామ్ బింబిసారా ఆగిపోయిందా!!

వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ లో మార్పులు

బూతులుపై విజయసాయి నీతులు...కేశినేని తిరిగిచ్చేశారు!

వివాదంలో ప్రకాష్ రాజ్.. జై భీమ్ లో ఆ సన్నివేశంపై రచ్చ..!!

అమరావతి పాదయాత్రలో పవన్ కళ్యాణ్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>