PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad85d9ffe8-5b46-4009-98d3-36225c94ddb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad85d9ffe8-5b46-4009-98d3-36225c94ddb6-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్‌లో విజయం సాధించడం ద్వారా బీజేపీ మరో అసెంబ్లీ సీటును పెంచుకుంది.. కాంగ్రెస్‌ ఆ నియోజకవర్గంలో ఓటు బ్యాంకును దారుణంగా కోల్పోయింది. ఇక టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటును కోల్పోయినట్టయింది. ఈ త్రికోణ రాజకీయాల్లో ప్రస్తుతానికి బీజేపీ బలపడినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ బాగా కోల్పోయినట్టు కనిపిస్తోంది. కానీ.. ఈ హుజూరాబాద్ ఫలితాన్ని విశ్లేషిస్తే.. టీఆర్ఎస్‌ పార్టీకి ఈ ఓటమి లాభం చేకూర్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎలాగంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి ఉంటే.. ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంhuzurabad{#}Assembly;Akkineni Nagarjuna;Party;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;Revanth Reddy;Congressకేసీఆర్‌ Vs ఈటల: ఓడినా టీఆర్‌ఎస్‌కు లాభమేనా..?కేసీఆర్‌ Vs ఈటల: ఓడినా టీఆర్‌ఎస్‌కు లాభమేనా..?huzurabad{#}Assembly;Akkineni Nagarjuna;Party;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;Revanth Reddy;CongressWed, 03 Nov 2021 08:15:11 GMTహుజూరాబాద్‌లో విజయం సాధించడం ద్వారా బీజేపీ మరో అసెంబ్లీ సీటును పెంచుకుంది.. కాంగ్రెస్‌ ఆ నియోజకవర్గంలో ఓటు బ్యాంకును దారుణంగా కోల్పోయింది. ఇక టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటును కోల్పోయినట్టయింది. ఈ త్రికోణ రాజకీయాల్లో ప్రస్తుతానికి బీజేపీ బలపడినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ బాగా కోల్పోయినట్టు కనిపిస్తోంది. కానీ.. ఈ హుజూరాబాద్ ఫలితాన్ని విశ్లేషిస్తే.. టీఆర్ఎస్‌ పార్టీకి ఈ ఓటమి లాభం చేకూర్చే అవకాశం కూడా కనిపిస్తోంది.


ఎలాగంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి ఉంటే.. ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మరింత బలపడి ఉండేది.. బీజేపీ ఓడిపోయి ఉంటే.. బలహీనపడి ఉండేది.. ఇప్పటికే నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీ ఉనికి కోల్పోయింది. ఈ ఎన్నికల్లోనూ ఓడిపోయి ఉండే.. బీజేపీ జోరు బాగా తగ్గేది.. కాంగ్రెస్‌ దీమా పెరిగేది.. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా తయారయ్యేది. అలా అయితే అది టీఆర్ఎస్‌ పార్టీకి నష్టం చేకూర్చే అంశమే అవుతుంది.


ఇప్పుడు హుజూరాబాద్ లో బీజేపీ ఓటమి ద్వారా ఆ పార్టీ కూడా యాక్టివ్ అవుతుంది. మరింత బలపడుతుంది. తన బలం మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంది. అటు కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా రెండు విపక్షాలు తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశమే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ముక్కోణ పోరు ఇలాగే కొనసాగితే.. అది టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో మేలు చేస్తుంది.


ముక్కోణ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం ద్వారా టీఆర్ఎస్ లాభపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. హుజూరాబాద్‌లో బీజేపీని బలోపేతం చేయడం ద్వారా కాంగ్రెస్‌ ఎదుగుదలను టీఆర్ఎస్ కట్టడి చేసింది. బీజేపీ, కాంగ్రెస్‌ రెండింటిలో ఏ పార్టీ బలహీనపడినా అది టీఆర్ఎస్‌కే ప్రమాదకారి అయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. హుజూరాబాద్‌లో ఓటమితో బీజేపీని ఉత్సాహపరిచి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చీలిక ద్వారా లబ్ది పొందే అవకాశం టీఆర్ఎస్‌ దక్కించుకుంది. అలా ఓడినా టీఆర్ఎస్‌ లాభపడే అవకాశం పొందింది.  





కేసీఆర్‌ వ‌ర్సెస్ ఈట‌ల‌.. కాంగ్రెస్ ఖేల్ ఖ‌తం..?

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>