PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/srikakulam6449e53a-ae42-40d1-83f7-fff625799a29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/srikakulam6449e53a-ae42-40d1-83f7-fff625799a29-415x250-IndiaHerald.jpgశ్రీ‌కాకుళం ప‌ట్టణానికి ఆనుకుని ఉన్న ఏడు శివారు పంచాయ‌తీలు, వాటి ప‌రిధిలో ఉన్న కాల‌నీల విలీనం అన్న‌ది పూర్త‌యిందని, ఇక‌పై తాను స‌మ‌స్య ప‌రిష్కారం పై దృష్టి సారిస్తాన‌ని చెప్పారు. చాపురం - 2 గ్రామ స‌చివాలయ ప‌రిధిలో ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందితో ఆయ‌న మాట్లాడారు. సంబంధిత ఇంఛార్జ్ సుధీర్ కు కొన్ని సూచ‌న‌లు చేశారు. అదేవిధంగా ప‌బ్లిక్ న్యూసెన్స్ కు కార‌ణం అవుతున్న కృష్ణా పాన్ షాప్ ఓన‌ర్ తో కూడా మాట్లాడారు. తొల‌గించాల‌ని ఆదేశించారు. కాల‌నీ ప్ర‌ధాన వీధుల‌లో అస్త‌వ్య‌స్తంగా ఉన్న డ్రైనేజీల‌నూ ఆయ‌న srikakulam{#}workers;Krishna River;Vishakapatnam;YCP;media;local language;sudigali sudheerవిశాఖ బీ కాల‌నీ వార్త : ఆ క‌మిష‌న‌ర్ మ‌గాడ్రా బుజ్జీవిశాఖ బీ కాల‌నీ వార్త : ఆ క‌మిష‌న‌ర్ మ‌గాడ్రా బుజ్జీsrikakulam{#}workers;Krishna River;Vishakapatnam;YCP;media;local language;sudigali sudheerWed, 03 Nov 2021 11:18:05 GMT- మార్నింగ్ రాగా విత్ మున్సిప‌ల్ క‌మిష‌నర్
- స్థానికుడు చొర‌వ‌తో క‌ద‌లివ‌చ్చిన యంత్రాంగం
- ప్ర‌భావం చూపిన సోష‌ల్ మీడియా పోస్టులు

ఉద‌యాన్నే ఓ క‌మిష‌న‌ర్ వీధుల్లోకి వ‌స్తారు. రెండు నుంచి మూడు గంట‌ల కాలాన్ని వెచ్చిస్తారు. న‌గ‌రంలో ఉన్న ప్ర‌ధాన వీధుల‌లో తిరుగుతూ, స్థానిక స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారిస్తూ సిబ్బందికి త‌గు సూచ‌న‌లు ఇస్తారు. ఇదీ శ్రీ‌కాకుళం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ చ‌ల్లా ఓబులేశు ప‌నితనానికి మెచ్చుతునక. తార్కాణం కూడా! ఇదేకోవలో ఈ ఉద‌యం అంటే బుధ‌వారం ఉద‌యం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ చ‌ల్లా ఓబులేశు విశాఖ బీ కాల‌నీకి వ‌చ్చారు. స్థానికుడు, జ‌ర్న‌లిస్టు ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించి, ఇచ్చిన మాట ప్ర‌కారం వ‌చ్చి కాల‌నీలో ప‌లు వీధులు క‌లియ‌దిరిగారు. క్షేత్ర స్థాయిలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను కాల‌నీ వాసుల‌ను అడిగి తెలుసుకున్నారు. అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ పై సీరియ‌స్ అయ్యారు. సంబంధిత సిబ్బందికి ప‌లు  సూచ‌న‌లు చేశారు.

శ్రీ‌కాకుళం ప‌ట్టణానికి ఆనుకుని ఉన్న ఏడు శివారు పంచాయ‌తీలు, వాటి ప‌రిధిలో ఉన్న కాల‌నీల విలీనం అన్న‌ది పూర్త‌యిందని, ఇక‌పై తాను స‌మ‌స్య ప‌రిష్కారం పై దృష్టి సారిస్తాన‌ని చెప్పారు. చాపురం - 2 గ్రామ స‌చివాలయ ప‌రిధిలో ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందితో ఆయ‌న మాట్లాడారు. సంబంధిత ఇంఛార్జ్ సుధీర్ కు కొన్ని సూచ‌న‌లు చేశారు. అదేవిధంగా ప‌బ్లిక్ న్యూసెన్స్ కు కార‌ణం అవుతున్న కృష్ణా పాన్ షాప్ ఓన‌ర్ తో కూడా మాట్లాడారు. తొల‌గించాల‌ని ఆదేశించారు. కాల‌నీ ప్ర‌ధాన వీధుల‌లో అస్త‌వ్య‌స్తంగా ఉన్న డ్రైనేజీల‌నూ ఆయ‌న ప‌రిశీలించారు. అస్త‌వ్య‌స్తంగా ఉన్న రోడ్ల‌నూ ప‌రిశీలించి, త‌క్ష‌ణ మ‌ర‌మ్మ‌తులకు తాను సిద్ధ‌మేన‌ని అన్నారు. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలు చేప‌డుతున్న య‌జ‌మానుల‌తో మాట్లాడి, నిర్మాణ వ్య‌ర్థాల‌ను వెంట వెంట‌నే త‌ర‌లించాల‌ని సూచించారు. 


విశాఖ బీ కాల‌నీ ప‌రిధిలో ఉన్న ముఖ్య‌మ‌యిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాను చొర‌వ చూపిస్తాన‌ని అన్నారు. తొలుత కొందరు వైసీపీ నాయ‌కులు ఆయ‌న‌ను క‌లిసి మాట్లాడారు. స‌మ‌స్య‌లు వివ‌రించారు. తాను మ‌ళ్లీ ఇక్క‌డికి వ‌స్తాన‌ని చెప్పి వెళ్లారు. క‌మిష‌న‌ర్ సూచ‌న‌ల అనంత‌రం పారిశుద్ధ్య కార్మికులు చెత్తలు ఎత్తి ట్రాక్ట‌రుతో త‌ర‌లించారు. కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ సిబ్బంది, వైసీపీ నాయ‌కులు చ‌ల్లా శ్రీ‌నివాస్ తో ప‌లువురు చాపురం గ్రామ స‌చివాల‌య సిబ్బంది కూడా పాల్గొన్నారు.





ఐటెం సాంగ్స్ తో ఉర్రూతలూగించిన ప్రముఖ నటి..!!

బాలయ్య నుండి దీపావళికి రెండు అదిరిపోయే కానుకలు..!

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>