QuotesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaatae86011ea-433b-4e58-9c9c-609d3585de73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/manchimaatae86011ea-433b-4e58-9c9c-609d3585de73-415x250-IndiaHerald.jpgఒకానొకప్పుడు ఒక అందమైన చిలుక ఒక చెట్టు చివరి కొమ్మన నివసిస్తూ ఉండేది. దానికి ఒకే పోలికతో కలిగి ఉన్న రెండు చిన్న పిల్లలు ఉండేవి.. ఒకసారి పిల్లల తల్లి చిలుక తన పిల్లల్ని విడిచి ఆహారం కోసం బయటకు వెళ్లినప్పుడు..వీటిని బాగా గమనించిన ఒక వేటగాడు చెట్టుపైకి ఎక్కి గూటిలో వున్న చిట్టి చిలకలనీ పట్టుకొని సంచిలో వేసుకున్నాడు. ఆ పిల్లల్ని సంచిలో వేసుకునేటప్పుడు ఒక చిలుక పిల్ల చాలా తెలివిగా తప్పించుకొని పోయింది. వేటగాని చేతి నుండి తప్పించుకున్న చిలుక , ఆ దారి వెంట నడుస్తూ వస్తున్న ఒక గొప్ప సాధువుకి దొరికింది. MANCHIMAATA{#}king;Muni;Tammudu;Athadu;Thammuduమంచిమాట : సజ్జనుల సావాసం సత్ఫలితాలను ఇస్తుంది..!మంచిమాట : సజ్జనుల సావాసం సత్ఫలితాలను ఇస్తుంది..!MANCHIMAATA{#}king;Muni;Tammudu;Athadu;ThammuduWed, 03 Nov 2021 14:00:00 GMTఒకానొకప్పుడు ఒక అందమైన చిలుక ఒక చెట్టు చివరి కొమ్మన నివసిస్తూ ఉండేది. దానికి ఒకే పోలికతో కలిగి ఉన్న రెండు చిన్న పిల్లలు ఉండేవి.. ఒకసారి పిల్లల తల్లి చిలుక తన పిల్లల్ని విడిచి ఆహారం కోసం బయటకు వెళ్లినప్పుడు..వీటిని బాగా గమనించిన ఒక వేటగాడు చెట్టుపైకి ఎక్కి గూటిలో వున్న చిట్టి చిలకలనీ పట్టుకొని సంచిలో వేసుకున్నాడు. ఆ పిల్లల్ని సంచిలో వేసుకునేటప్పుడు ఒక చిలుక పిల్ల చాలా తెలివిగా తప్పించుకొని పోయింది. వేటగాని చేతి నుండి తప్పించుకున్న చిలుక , ఆ దారి వెంట నడుస్తూ వస్తున్న ఒక గొప్ప సాధువుకి దొరికింది.

 అతడు ఆ చిలకనీ తను ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చిన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా ఆ చిలుక పిల్లలు వేటగాడి వల్ల విడిపోయి ఒకటేమో వేటగాడి వద్ద మరో ఒకటేమో సాధువు వద్ద పెరిగి పెద్దవయ్యాయి.అయితే ఒకానొక రోజు ఒక  గొప్ప మహారాజు వేటకోసం అడవికి వచ్చి అనుకోకుండా వేటగాడి ఇళ్లు చూశాడు. ఆ మహారాజు తన గుఱ్ఱాన్ని తీసుకొని, వేటగాడి ఇంటి వైపు వెళ్ళాడు. అప్పుడు ఆ చిలక ఎవరో మన ఇంటి వైపు వస్తున్నారు..తొందరగా విల్లు ,బాణాలు తీసుకొని వచ్చి వాళ్లని చంపు అని అరవడం ఆ రాజు విన్నాడు. వెంటనే ఆ మాటలన్నది ఒక పంజరంలోని చిలకని మహారాజు గ్రహించాడు.


ఎంత విచిత్రమైన పక్షి ఇది..దాని యజమాని కూడా అలాగే ఉంటాడేమో అనుకుని రాజు తిరిగి చూడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అలా వెళుతూ వెళుతూ ఆ మహారాజు ఒక ముని ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ దాహం తీర్చుకోవడానికి ఆగాడు. అక్కడ కూడా మహారాజుకి పంజరంలో ఒకచిలుక కనిపించింది. ఇది కూడా దుర్మార్గపు  చిలుక అయి ఉంటుంది అని అనుకున్నాడు మహారాజు.. కానీ  ఆ చిలుక రండి రండి మహారాజా..!  మిమ్మల్ని మా నివాసానికి ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అని చిలుక పలుకులు విని ఆ మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు.


వేటగాని ఇంటివద్ద తను చూసిన చిలక పోలికలతో కలిపి ఉన్న ఈ చిలుక వినయంగా మర్యాదగా తనను ఆహ్వానించడం చూసి రాజు విస్మయం చెందాడు. అప్పుడు రాజు చిలుక పంజరాన్ని సమీపించి..అరే నేను ఇప్పుడే నిన్ను పోలిన చిలుకను చూసి వచ్చాను. దాని ప్రవర్తన చాలా నీచంగా ఉంది. అయితే అది వేటగాని వద్ద ఉన్నదా..? అని అడిగింది చిలుక.. అవునవును..! నీకెలా తెలుసు అని అడిగాడు మహారాజు.. అది నా తమ్ముడు మేమిద్దరం ఒకే గూటి లో ఉండేవాళ్ళం.. ఒక రోజు మా అమ్మ గూటిలో లేని సమయంలో ఒక వేటగాడు మమ్మల్ని పట్టుకున్నాడు.

నేను తప్పించుకున్నాను. వేటగాడు నా తమ్ముడిని పట్టుకొని పోయాడు. దాని యజమాని నీచమైన వాడు కాబట్టి నా తమ్ముడు అలా తయారయ్యాడు. కానీ నా యజమాని అలాంటివాడు కాదు కదా అని ఏడుస్తూ చెప్పింది చిలుక.. ఆ సమాధానానికి రాజు ఎంతో సంతోషించి సాధువుని ఆ చిలుక ని పొగుడుతూ వెళ్ళిపోయాడు.



కేసీఆర్ vs ఈట‌ల : హుజురాబాద్ ఓట‌మి.. గులాబీ బాస్ సంచ‌ల‌న నిర్ణ‌యం..?

కోటి వరకు ఫైన్ వేయనున్న కేంద్రం....!

షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ వెనక ఇంత పెద్ద కథ ఉందా..?

సీరియల్ యాక్టర్ గా టాలీవుడ్ హీరో...?

బుల్లి పిట్ట: రూ.4,999 కే సౌండ్ బార్..?

తెలంగాణ లో దీపావళి నిన్ననే జరిగింది..ఈటెల షాకింగ్ కామెంట్స్...!

సంక్రాంతికి సినిమాను విడుదల చేసే ప్లాన్ లో సీనియర్ హీరో..!

బాలయ్య నుండి దీపావళికి రెండు అదిరిపోయే కానుకలు..!

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>