PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/trs-0f45df1f-e316-4e3a-b944-bd16c51260e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/trs-0f45df1f-e316-4e3a-b944-bd16c51260e0-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఉప ఎన్నిక‌ల 2023 సార్వ‌త్రిక‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, ఒక ఉప ఎన్నిక ఫ‌లితం ఆధారంగా భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను అంచ‌నా వేయ‌లేమంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అలాగే ఒక ఎన్నిక‌కు ఇంకో ఎన్నిక‌కు పోలీక ఉండ‌ద‌ని తెలుస్తోంది. హుజుర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఓడిపోయిన బీజేపీ దుబ్బాక ఉప ఎన్నిక‌లో గెలిచింది. ఆ త‌రువాత నాగార్జునసాగ‌ర్ ప్రభావం చూప‌లేదు. ఇప్పుడు హుజురాబాద్‌లో అధ్బుత ప్ర‌భావాన్ని చూపించింది. గ‌త ఎన్నిక‌లో నోటాకంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన బీజేపీkcr vs etala{#}Huzur Nagar;KCR;Telangana Rashtra Samithi TRS;MLA;Huzurabad;Telangana;Bharatiya Janata Partyకేసీఆర్vs ఈట‌ల‌ : 2023లో కేసీఆర్ ప‌ని అంతేనా..?కేసీఆర్vs ఈట‌ల‌ : 2023లో కేసీఆర్ ప‌ని అంతేనా..?kcr vs etala{#}Huzur Nagar;KCR;Telangana Rashtra Samithi TRS;MLA;Huzurabad;Telangana;Bharatiya Janata PartyWed, 03 Nov 2021 10:07:43 GMTహుజురాబాద్ ఉప ఎన్నిక‌ల 2023 సార్వ‌త్రిక‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుంద‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, ఒక ఉప ఎన్నిక ఫ‌లితం ఆధారంగా భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను అంచ‌నా వేయ‌లేమంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అలాగే ఒక ఎన్నిక‌కు  ఇంకో ఎన్నిక‌కు పోలీక ఉండ‌ద‌ని తెలుస్తోంది. హుజుర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఓడిపోయిన బీజేపీ దుబ్బాక ఉప ఎన్నిక‌లో గెలిచింది.  ఆ త‌రువాత నాగార్జునసాగ‌ర్ ప్రభావం చూప‌లేదు. ఇప్పుడు హుజురాబాద్‌లో  అధ్బుత ప్ర‌భావాన్ని చూపించింది. గ‌త ఎన్నిక‌లో నోటాకంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన బీజేపీ ఇప్పుడు ఏకంగా భారీ మెజారిటీతో గెలుపొందింది.
 

 దీనికి ప్రధాన కార‌ణం ఈట‌ల రాజేంద‌ర్ అభ్య‌ర్థిత్వం అని అంద‌రికీ తెలిసిన విష‌యమే.  కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాల‌నుకున్న వారు కూడా ఈ ఉప ఎన్నిక‌లో ఈట‌ల రాజేంద‌ర్‌కు ఓటు వేశార‌ని తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంబంధం లేని ఉప ఎన్నిక వేరు రేపు 2023లో ప్ర‌భుత్వ ఏర్పాటు ఎన్నిక వేర‌ని విశ్లేషిస్తున్నారు రాజ‌కీయ నిపుణులు. అయితే, గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో  బీజేపీ అభ్య‌ర్థి మాత్ర‌మే పోటీ చేశారు. అలాగే టీఆర్ఎస్ త‌ర‌ఫు నుంచి నిల‌బ‌డిన వాళ్లు గెలిచారు.



కానీ, హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో గ‌తంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌కు చాలా తేడా ఉంద‌ని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈట‌ల రాజేంద‌ర్ తెలంగాణ ఉద్య‌మం నుంచి తెలంగాణ స్వ‌రాష్ట్రం ఏర్పడిన త‌రువాత రెండు సార్లు ప్ర‌భుత్వంలో మంత్రిగా బాధ్య‌తలు నిర్వ‌ర్తిస్తూ తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌కంగా మారారు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ ఈట‌ల‌ను బ‌హిష్క‌రించ‌డం, ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజ‌నామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగి విజ‌యాన్ని అందుకున్నారు.


ఈ క్ర‌మంలో ఈట‌ల‌కు టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌ల‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. టీఆర్ఎస్ లో ఇమ‌డ‌లేని అసంతృప్త నాయ‌కుల‌ను త‌న వైపు తిప్పుకునేంత చ‌రిష్మ ఉందని చెప్పొచ్చు. అలాగే,  కేసీఆర్‌కు తిరుగులేద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఈ ఉప ఎన్నిక ఓట‌మి కేసీఆర్‌కు గ‌ట్టి దెబ్బ కొట్టింది. దీంతో ప్ర‌తిప‌క్షాలు బ‌లం పుంజుకోవ‌డానికి  అవ‌కాశం ఉంటుంది. దీంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారి వ‌చ్చే ఎన్నిక‌ల‌పై కొంచెం అయిన ప్ర‌భావం ఉండ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.



ఇల్లు క‌ట్టుకోవాల‌నుకున్నా..కానీ ఆ డ‌బ్బుతో పునీత్ అన్న కోరిక తీరుస్తా : విశాల్

బిగ్ బాస్ 5: మానస్ టైటిల్ గెలవాలంటే మార్చుకోవాల్సిన విషయాలివే?

కెసిఆర్ vs ఈటల : తెలంగాణ లో కుమ్మక్కు రాజకీయాలు ఎక్కువయ్యాయా ?

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>