PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/nellore-corporation-electionsdf8332e9-bf57-4913-9b37-280898289f0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/nellore-corporation-electionsdf8332e9-bf57-4913-9b37-280898289f0d-415x250-IndiaHerald.jpgబద్వేలు బైపోల్ ముగిసే సమయంలో ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ఒకే ఒక కార్పొరేషన్ నెల్లూరు. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. అయితే అధికార పార్టీ తమను వేధిస్తోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. నామినేషన్లకు ఒకరోజు ముందు.. టీడీపీ అభ్యర్థులు ఓటర్ల లిస్ట్ చూసి షాకయ్యారు. అభ్యర్థుల పేర్లు అందులో లేకపోవడంతో ఉద్దేశ పూర్వకంగానే తమ పేర్లు తొలగించారని ఆందోళనకు దిగారు. nellore corporation elections{#}Episode;Assembly;local language;Elections;MP;Janasena;Nellore;YCP;TDP;Minister;Partyనామినేషన్లలోనే టీడీపీ నేతలకు చుక్కలు చూపెడుతున్నారు..నామినేషన్లలోనే టీడీపీ నేతలకు చుక్కలు చూపెడుతున్నారు..nellore corporation elections{#}Episode;Assembly;local language;Elections;MP;Janasena;Nellore;YCP;TDP;Minister;PartyWed, 03 Nov 2021 19:41:23 GMTబద్వేలు బైపోల్ ముగిసే సమయంలో ఏపీలో మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ఒకే ఒక కార్పొరేషన్ నెల్లూరు. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. అయితే అధికార పార్టీ తమను వేధిస్తోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. నామినేషన్లకు ఒకరోజు ముందు.. టీడీపీ అభ్యర్థులు ఓటర్ల లిస్ట్ చూసి షాకయ్యారు. అభ్యర్థుల పేర్లు అందులో లేకపోవడంతో ఉద్దేశ పూర్వకంగానే తమ పేర్లు తొలగించారని ఆందోళనకు దిగారు.

తీరా నామినేషన్ల రోజు సవాలక్ష ప్రశ్నలతో తమను వేధిస్తున్నారని అంటున్నారు టీడీపీ అభ్యర్థులు. నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ సీట్లు వైసీపీకే దక్కాయి. జిల్లాలో గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ వైసీపీ మెజార్టీ సీట్లు సాధించింది. అక్కడక్కడ టీడీపీ ప్రభావం కనిపించింది. ఇక నెల్లూరు కార్పొరేషన్ విషయానికొస్తే.. టీడీపీ గెలుపు ధీమాతో ఉంది. గతంలో మంత్రి నారాయణ హయాంలో నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ప్రస్తుతం అవి ఆగిపోయాయని, ఆ అభివృద్ధే తమను గెలిపిస్తుందని అంటున్నారు నేతలు. అయితే అధికార పార్టీ తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తోందని, మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టడానికి సైతం వెనకాడ్డంలేదని ఆరోపిస్తున్నారు.

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. జనసేన కూడా దూకుడుగానే ముందుకెళ్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల్ని ప్రగకటించడంతో వారు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడానికి కాస్త ముందూ వెనకా ఆలోచిస్తోంది. గతంలో ఓ అభ్యర్థిని ప్రకటిస్తే.. మరుసటి రోజే వారి క్యాటరింగ్ దుకాణంపై హెల్త్ ఆఫీసర్ దాడి చేశారు. తమ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. మొత్తమ్మీద నామినేషన్ల పర్వం పూర్తి కాకముందే టీడీపీకి అధికార పార్టీ చుక్కలు చూపెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికలనాటికి ఈ రాజకీయ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.



హీరో విజయ్ సేతుపతిపై అగంతకుడు దాడి..!

పండుగ సీజన్‌లో ట్రిప్ కు ఈ 5 ప్లేసెస్ బెస్ట్

హీరో ల వారసులే కాదు.. దర్శకుల వారసులు కూడా!!

ఈ తప్పులు చేస్తే చిన్న వయసులోనే వృద్ధాప్యం

భీమ్లా నాయక్ దీపావళి సర్ప్రైజ్ ఇదే!!

కళ్యాణ్ రామ్ బింబిసారా ఆగిపోయిందా!!

వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ లో మార్పులు

బూతులుపై విజయసాయి నీతులు...కేశినేని తిరిగిచ్చేశారు!

వివాదంలో ప్రకాష్ రాజ్.. జై భీమ్ లో ఆ సన్నివేశంపై రచ్చ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>