PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap480e661a-c1c5-408b-befd-8e96d50e9393-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap480e661a-c1c5-408b-befd-8e96d50e9393-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో గంజాయి విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఏపీ ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో ఈ మధ్య విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఇటువంటి చర్యల మీద పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి సాగు నియంత్రణపై పోలీసుల ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నారు అని తెలుస్తుంది. చింతూరు మం. మోతుగూడెం పంచాయతీ ఒడియా క్యాంప్ లో సాగు చేస్తోన్న గంజాయి పంట ధ్వంసం చేసామని పోలీసులు ap{#}East;Panchayati;marijuana;CBN;Andhra Pradesh;police;Government;Districtగంజాయి బ్యాచ్ కి చుక్కలు చూపిస్తున్న ఎస్పీ...?గంజాయి బ్యాచ్ కి చుక్కలు చూపిస్తున్న ఎస్పీ...?ap{#}East;Panchayati;marijuana;CBN;Andhra Pradesh;police;Government;DistrictWed, 03 Nov 2021 19:13:05 GMTఆంధ్రప్రదేశ్ లో గంజాయి విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఏపీ ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో ఈ మధ్య విమర్శలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో ఇటువంటి చర్యల మీద పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి సాగు నియంత్రణపై పోలీసుల ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నారు అని తెలుస్తుంది. చింతూరు మం. మోతుగూడెం పంచాయతీ ఒడియా క్యాంప్ లో సాగు చేస్తోన్న గంజాయి పంట ధ్వంసం చేసామని పోలీసులు తెలిపారు.

జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఆథ్వర్యంలో 10 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసామని పోలీసులు వివరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మన్యంలో ఇప్పటి వరకు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాము అని అన్నారు. ఇక నుంచి గంజాయి సాగు నియంత్రణ పై దృష్టి సారించాము అని ఆయన వివరించారు. పర్యావరణం పేరిట గిరిజనుల గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసామని చెప్పారు. గంజాయి సాగు వైపు గిరిజనులు వెళ్లకుండా ప్రత్యామ్నయ చర్యలు చేపడుతున్నాము అని ఆయన తెలిపారు.

బయట నుంచి వచ్చి గిరిజనులను గంజాయి సాగు చేయాలని వత్తడి చేస్తే ఉపేక్షించం అని హెచ్చరించారు. ఏళ్ల తరబడి మన్యంలో గంజాయి సాగు జరుగుతోంది అని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ నాడు మావోలు గంజాయి సాగుపై స్పందించింది లేదు అని అన్నారు ఆయన. అంటే గంజాయి సాగు లో మావోల పాత్ర ఉన్నటే భావించాలి అన్నారు. ఇప్పటి వరకు శాటిలైట్ ఇమేజెస్, డ్రో్ కెమెరాల పరిజ్ఞానంతో 4 వేల ఎకరాల్లో సాగు అవుతోన్న గంజాయి గుర్తించాము అని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ఎస్ఈబి శాఖల సంయుక్తంగా నిరంతరం గంజాయి సాగు నివారణ చేపడతాము అని హెచ్చరించారు.



నీ ఏడుపు నువ్వు ఏడువు, ఫాంలోకి వచ్చిన రేణుకా చౌదరి...!

పండుగ సీజన్‌లో ట్రిప్ కు ఈ 5 ప్లేసెస్ బెస్ట్

హీరో ల వారసులే కాదు.. దర్శకుల వారసులు కూడా!!

ఈ తప్పులు చేస్తే చిన్న వయసులోనే వృద్ధాప్యం

భీమ్లా నాయక్ దీపావళి సర్ప్రైజ్ ఇదే!!

కళ్యాణ్ రామ్ బింబిసారా ఆగిపోయిందా!!

వాట్సాప్ 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్‌ లో మార్పులు

బూతులుపై విజయసాయి నీతులు...కేశినేని తిరిగిచ్చేశారు!

వివాదంలో ప్రకాష్ రాజ్.. జై భీమ్ లో ఆ సన్నివేశంపై రచ్చ..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>