HealthChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covid-19-guidlinesd6d0e04f-717e-4ea5-b966-065c00109a74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covid-19-guidlinesd6d0e04f-717e-4ea5-b966-065c00109a74-415x250-IndiaHerald.jpgదేశంలో మరోసారి ప్రజలు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కరోనా కాస్త తగ్గే సరికే మళ్ళీ కనీస జాగర్తలు కూడా పాటించకుండా ఇష్టానికి తిరిగేస్తున్నారు. అసలే పండుగ సీజన్, ప్రయాణాలు, అందరు కలిసే సమయం కావడంతో మరోసారి కరోనా తీవ్రంగా వ్యాప్తినుంచే సూచనలు భారీగా ఉన్నాయని, ఆ తరహా వ్యాప్తి అప్పుడే మొదలైందని కూడా ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. అందుకే మరోసారి ప్రజలను హెచ్చరించేందుకు దేశంలో ఇంకోసారి కరోనా అలర్ట్ విధించింది. ప్రజలు ఎక్కడకు వెళ్లినా కనీస కరోనా నిబంధనలు పాటించాల్సిందే అని కఠిన నిబంధన కూడా వచ్చేసింది. covidalertinindia;{#}festival;Coronavirusదేశంలో.. కరోనా అలర్ట్..!దేశంలో.. కరోనా అలర్ట్..!covidalertinindia;{#}festival;CoronavirusTue, 02 Nov 2021 10:03:27 GMTదేశంలో మరోసారి ప్రజలు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కరోనా కాస్త తగ్గే సరికే మళ్ళీ కనీస జాగర్తలు కూడా పాటించకుండా ఇష్టానికి తిరిగేస్తున్నారు. అసలే పండుగ సీజన్, ప్రయాణాలు, అందరు కలిసే సమయం కావడంతో మరోసారి కరోనా తీవ్రంగా వ్యాప్తినుంచే సూచనలు భారీగా ఉన్నాయని, ఆ తరహా వ్యాప్తి అప్పుడే మొదలైందని కూడా ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. అందుకే మరోసారి ప్రజలను హెచ్చరించేందుకు దేశంలో ఇంకోసారి కరోనా అలర్ట్ విధించింది. ప్రజలు ఎక్కడకు వెళ్లినా కనీస కరోనా నిబంధనలు పాటించాల్సిందే అని కఠిన నిబంధన కూడా వచ్చేసింది. ఇప్పటికైనా ప్రజలు తమ ప్రయాణాలు కావచ్చు, ఇతరత్రా సమయాలలో కావచ్చు తగిన జాగర్తలతో ఉండటం ద్వారా ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా ఉండవచ్చని అధికారులు అంటున్నారు.

ఇప్పటికే డెల్టా వేరియంట్ వివిధ దేశాలలో మరోసారి విజృంభిస్తుంది. ఇది దేశంలో కూడా కాస్త కనిపించింది. అసలే డెల్టా వేరియంట్ అతి త్వరగా వ్యాప్తి చెందే గుణం కలది కాబట్టి జాగర్తలు పాటించడం అత్యవసరం అని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాస్త కరోనా నెమ్మదించడంతో అందరు మాములు స్థితికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు, అందుకు సంతోషమే కానీ మరికొంత కాలం జాగర్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అంటున్నారు. లేదంటే మరోసారి రెండో వేవ్ తరహా పరిస్థితులు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనిని ప్రజలు ఎంత త్వరగా గ్రహిస్తే ప్రమాదం అంత దూరంగా ఉన్నట్టు.

పండుగలు గట్రా జరుపుకున్నప్పటికీ తగిన జాగర్తలు పాటిస్తూ, అంటే నిర్ణిత దూరం పాటించడం, ప్రతిసారి చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటూ ఉండటం, ముఖానికి ముక్కు నోరు మూసి ఉంచేవిధంగా మాస్క్ ధరించడం లాంటివి పాటిస్తూ ఏ వేడుక అయినా జరుపుకోవడం మంచిది. అది కూడా నిర్ణిత సంఖ్యతో జరుపుకోవడం మంచిది. ఎక్కువ సంఖ్య అయ్యే కొద్దీ మనమే అందరిని బాధపెట్టిన వాళ్ళం అవుతాము. అలాంటి స్థితి రాకుండా ముందుజాగర్తలే రక్ష. టీకాలు రెండు డోసులు వేసుకున్నా, ఒకే డోసు వేసుకున్నా కూడా పైన చెప్పిన అన్ని నిబంధనలు పాటించి తీరాల్సిందే. టీకా కేవలం మరణం సంభవించకుండా ఆపగలదు అంతే, కానీ ఒకవేళ వైద్యం సరైన సమయంలో అందుకోలేనంత మంది కి వైరస్ వస్తే, టీకా వేసుకున్న వారికి కూడా మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయని అందరు గ్రహించాలి. తస్మాత్ జాగర్త!



జనసేన.. బీజేపీతోనేనా..!

కేసీఆర్ Vs ఈటెల: కారుకు పంక్చ‌ర్ వేస్తోన్న ఇండిపెండెంట్లు

కేసీఆర్ Vs ఈటెల: తొలిరౌండ్ వ‌చ్చేసింది..

జనసేనాని దూకుడుతో బీజేపీలోటెన్షన్..?

కేసీఆర్ Vs ఈటెల : అదే సీన్ రిపీట్ అవుతుందా?

హుజురాబాద్‌: కేసీఆర్‌ను నేలకు దింపిన ఈటల..!?

పోస్ట‌ల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. వారికి ప్రాణభయం..

వై.ఎస్‌.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>