PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpbf704e77-bb80-4987-854e-e610b97dcc6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpbf704e77-bb80-4987-854e-e610b97dcc6a-415x250-IndiaHerald.jpgఏపీలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలలో అధికార పార్టీ నేత డాక్టర్ సుధ భారీ మెజారిటీతో గెలుస్తారని మొదటి నుండి వైసీపీ చెపుతూనే ఉంది. అయితే అది ఎంతగా నిజం అయిందంటే సీఎం కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చేసుకున్నారు అక్కడి అభ్యర్థి. ఇంకేముంది సీఎం పిచ్చ హ్యాపీ. నేడు బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీలకు అనుకున్నట్టే డిపాజిట్స్ కూడా రాలేదు. ఈ లెక్కింపులో మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్‌ ముగిసేసరికి అధికార పార్టీ అభ్యర్థి సుధ 90533 ఓట్ల భారీ మెజార్టీతోbypollsap;{#}Anandam;sudha;Andhra Pradesh;Nijam;CM;Doctor;Jagan;YCP;Assembly;Partyసీఎం కంటే.. ఎక్కువ మెజారిటీ.. !సీఎం కంటే.. ఎక్కువ మెజారిటీ.. !bypollsap;{#}Anandam;sudha;Andhra Pradesh;Nijam;CM;Doctor;Jagan;YCP;Assembly;PartyTue, 02 Nov 2021 22:01:58 GMTఏపీలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలలో అధికార పార్టీ నేత డాక్టర్ సుధ భారీ మెజారిటీతో గెలుస్తారని మొదటి నుండి వైసీపీ చెపుతూనే ఉంది. అయితే అది ఎంతగా నిజం అయిందంటే సీఎం కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చేసుకున్నారు అక్కడి అభ్యర్థి. ఇంకేముంది సీఎం పిచ్చ హ్యాపీ. నేడు బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీలకు అనుకున్నట్టే డిపాజిట్స్ కూడా రాలేదు. ఈ లెక్కింపులో మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్‌ ముగిసేసరికి అధికార పార్టీ అభ్యర్థి సుధ 90533 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ లెక్కింపులో మొత్తం చెల్లిన ఓట్లు 147163 కాగా, వైసీపీకి 112211 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 21678 ఓట్లు, కాంగ్రెస్‌కు మొత్తం 6235 ఓట్లు వచ్చాయి, నోటాకు 3650 ఓట్లు పడ్డాయి. డాక్టర్ సుధకు వచ్చిన మెజార్టీ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువగా ఉండటం విశేషం. గత ఎన్నికల్లో జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజవర్గం నుంచి  90110 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. అప్పుడు మొత్తం పోలైన 180127 ఓట్లలో జగన్ కు 132356 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో జగన్‌కు 75243 ఓట్ల మెజార్టీ వచ్చింది.

రాష్ట్రంలో సీఎం జగన్ సుపరిపాలన అందించడం, ఆయన అమలు చేస్తోన్న సంక్షేమ పధకాల ఫలితం తనను గెలిపించాయన్నారు డాక్టర్ సుధ. తన విజయానికి సహకరించిన వైసీపీ నేతలకు, బద్వేల్‌ ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బద్వేల్‌లో భారీ మెజారిటీతో గెలుపొందిన అధికార పార్టీ అభ్యర్థి సుధ ఎన్నికల అధికారి నుంచి డిక్లరేషన్‌ తీసుకున్నారు.

అధికార పార్టీ నేతలు నేటి ఉపఎన్నికల లెక్కింపు ద్వారా బద్వేల్‌లో భారీ విజయాన్ని సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల వలన ఈ భారీ విజయం సాధించగలిగామని వారు తెలిపారు. 2024 ఎన్నికలలో కూడా ఇదే ఫలితాలు వస్తాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



సీఎం కంటే.. ఎక్కువ మెజారిటీ.. !

కేసీఆర్ Vs ఈటెల: విన్నర్ ఈటెల, మెజారిటీ ఎంత...?

గెలుపును దీవెనగా భావిస్తున్న సీఎం జగన్..!

నాని సెలక్షన్ లో అంతా వీక్ అయ్యాడేంటి..?

నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

'భీమ్లా నాయక్' రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన 'ఆర్ ఆర్ ఆర్'..?

దీదీ క్లీన్ స్వీప్... పాపం బీజేపీ...!

వచ్చేది బి.జె.పి - జనసేన ప్రభుత్వం !

కేసీఆర్ Vs ఈటెల : 16వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>