PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/flashpavan-donation-becomes-problem-to-top-heroes9fb0d3f0-29f5-4772-8fe3-137eddde5718-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/flashpavan-donation-becomes-problem-to-top-heroes9fb0d3f0-29f5-4772-8fe3-137eddde5718-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం మరోసారి ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పైకి వచ్చింది. అనూహ్యంగా ఐదు నెలల క్రితం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం...స్టీల్ ప్లాంట్‌ని ప్రయివేటీకరణ చేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పేసింది. కేంద్రం ప్రకటన తర్వాత...స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది...ఉద్యోగులు, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాయి. బీజేపీ మినహా మిగిలిన పార్టీలు విశాఖ స్టీల్ పpawan{#}Letter;MP;Vishakapatnam;YCP;Andhra Pradesh;Bharatiya Janata Party;Party;CMటార్గెట్ పవన్...అనవసరంగా ఇరుక్కున వైసీపీ?టార్గెట్ పవన్...అనవసరంగా ఇరుక్కున వైసీపీ?pawan{#}Letter;MP;Vishakapatnam;YCP;Andhra Pradesh;Bharatiya Janata Party;Party;CMTue, 02 Nov 2021 03:30:00 GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం మరోసారి ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పైకి వచ్చింది. అనూహ్యంగా ఐదు నెలల క్రితం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం...స్టీల్ ప్లాంట్‌ని ప్రయివేటీకరణ చేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పేసింది. కేంద్రం ప్రకటన తర్వాత...స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది...ఉద్యోగులు, ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాయి. బీజేపీ మినహా మిగిలిన పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గళం విప్పాయి.

అయితే మొదట్లోనే రాజకీయ పార్టీలు కాస్త హడావిడి చేశాయి...తర్వాత నుంచి ఉద్యోగులు, ప్రజా సంఘాలే ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. ఇక తాజాగా పవన్ కల్యాణ్...ఉద్యమానికి మద్ధతు తెలిపారు. అలాగే ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది...అయితే పవన్ పోరాడాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై..కానీ పవన్ కేంద్రాన్ని ఒక మాట అనకుండా, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

వైసీపీ పోరాటం చేయాలని, అఖిలపక్షం పెట్టాలని...అలాగే వైసీపీకి వారం రోజులు డెడ్ లైన్ పెడుతున్నాని, ఈలోపు పోరాటానికి సిద్ధం కాకపోతే తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నట్లు పవన్ యథావిధిగా నాలుగు డైలాగులు కొట్టారు. ఇదంతా కేంద్రం పరిధిలో ఉంటే పవన్ తమపై పోరాటం చేయడం కరెక్ట్ కాదని, ఎప్పుడో ఉద్యమం మొదలైతే ఇప్పుడు వచ్చి పవన్ హడావిడి చేస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుందని, పార్లమెంట్‌లో తమ ఎంపీలు పోరాడుతున్నారని, సీఎం జగన్...కేంద్రానికి లేఖ రాశారని చెబుతున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో వైసీపీ పోరాటం ఏంటో జనం చూశారు...ఏదో మొక్కుబడిగా మమ అనిపించేలా పోరాటం చేసింది..ఇప్పుడేమో హడావిడిగా చెప్పుకుంటూ...అనవసరంగా ఇరుక్కుపోయింది. అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యమం విషయంలో ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధితో పోరాటం చేయడం లేదని తెలుస్తోంది...ఎవరికి వారు సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారు.



టార్గెట్ పవన్...అనవసరంగా ఇరుక్కున వైసీపీ?

మనీ ప్లాంట్ పెంచుతున్నారా ? అయితే జాగ్రత్త !

ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ పడేనా?

కేసీఆర్ కు.. ఆంధ్రాతో పనేమిటో..!

ప‌వ‌న్‌పై వైసీపీ నేత‌లు ఎటాక్‌..!

భార్యపై అనుమానం.. కూతురిని ఏం చేసాడో తెలుసా?

అందరి బంధాలు బయటపెడతా అంటున్న మాజీ సీఎం..!

కాంగ్రెస్ స‌భ్య‌త్వం తీసుకునేవారికి రెవంత్ రెడ్డి బంప‌రాఫ‌ర్..!

కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నా : రవితేజ హీరోయిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>